అనంతపురం అగ్రికల్చర్ : రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రాన్ని సీడ్‌హబ్‌గా మార్చనున్నారని కో ఆర్డినేటర్ డాక్టర్ పి.లక్ష్మిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రెడ్డిపల్లి కేవీకేను సీడ్‌హబ్‌గా చేస్తామంటూ ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రధానంగా ఖరీఫ్‌లో కంది రకాలు, రబీలో పప్పుశనగ పంట అభివృద్ధికి విస్తృతమైన పరిశోధనలు, మిగతా విత్తనాలపై కూడా ప్రయోగాలు, పరిశోధనలు ఉంటాయన్నారు. అందుకోసం ప్రత్యేకంగా మౌలిక వసతుల కల్పన, సాంకేతిక పరిజ్ఞానం, సిబ్బంది అవసరం ఉంటుందని తెలిపారు. దీనిపై త్వరలోనే కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వానికి పంపుతామని ఆయన తెలిపారు.