kvk
-
ఐసీఏఆర్‌తో అమెజాన్ ఒప్పందం.. ప్రయోజనాలివే!
న్యూఢిల్లీ: కిసాన్ స్టోర్‌లో నమోదు చేసుకున్న రైతులకు శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయడంలోనూ, అధిక దిగుబడులు.. ఆదాయం పొందడంలో తోడ్పాటు అందించడంపై ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పరిశోధన సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్)తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. పుణేలోని ఐసీఏఆర్–కృషి విజ్ఞాన్ కేంద్రంలో సంయుక్తంగా నిర్వహించిన పైలట్ ప్రాజెక్ట్ ఫలితాల ఊతంతో తమ భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించినట్లు అమెజాన్ తెలిపింది. ఐసీఏఆర్ డిప్యూటీ జనరల్ యూఎస్ గౌతమ్, అమెజాన్ ఫ్రెష్ సప్లై చెయిన్..కిసాన్ విభాగం ప్రోడక్ట్ లీడర్ సిద్ధార్థ్ టాటా ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కింద ఐసీఏఆర్ అభివృద్ధి చేసే అధునాతన వ్యవసాయ సాంకేతికతలను రైతులకు చేరువ చేసేందుకు ఇరు సంస్థలు కృషి చేస్తాయి. అలాగే, రైతులు తమ ఆదాయాలను పెంచుకునేందుకు ఉపయోగపడే మెరుగైన సాగు విధానాలను కిసాన్ వికాస్ కేంద్రాల్లో (కేవీకే) ప్రదర్శిస్తాయి. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా రైతులు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు కావాల్సిన శిక్షణ, సహాయాన్ని అమెజాన్ అందిస్తుంది. తద్వారా రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానిస్తుంది. 2021 సెప్టెంబర్‌లో అమెజాన్ తమ ప్లాట్ఫామ్లో ’కిసాన్ స్టోర్’ సెక్షన్‌ను ప్రారంభించింది. ఇందులో షాపింగ్ ద్వారా వ్యవసాయానికి అవసరమైన ముడి వనరులను రైతులు ఇంటి దగ్గరే అందుకోవచ్చు. -
కేవీకేకు ముగ్గురు నూతన శాస్త్రవేత్తలు
కళ్యాణదుర్గం: స్థానిక కృషి విజ్ఞాన కేంద్రానికి ముగ్గురు నూతన రెగ్యులర్ శాస్త్రవేత్తలను ప్రభుత్వం నియమించింది. వీరంతా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కేవీకే సేవలను రైతులకు మరింత విస్తరింపజేయడానికి అవకాశం ఏర్పడిందని కోఆర్డినేటర్ సుధీర్ తెలిపారు. ఉద్యానవన శాస్త్రవేత్తగా డాక్టర్ లక్ష్మీదుర్గ, హోంసైన్సు శాస్త్రవేత్తగా మంజులత, విస్తరణ విభాగం శాస్త్రవేత్తగా ఉషా బాధ్యతలు చేపట్టారు. రైతులకు అందుబాటులో ఉండి మంచి దిగుబడులు సాధించేందుకు కృషి చేస్తామని చెప్పారు. శాస్త్రవేత్తల సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. -
సీడ్‌హబ్‌గా రెడ్డిపల్లి కేవీకే
అనంతపురం అగ్రికల్చర్ : రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రాన్ని సీడ్‌హబ్‌గా మార్చనున్నారని కో ఆర్డినేటర్ డాక్టర్ పి.లక్ష్మిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రెడ్డిపల్లి కేవీకేను సీడ్‌హబ్‌గా చేస్తామంటూ ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రధానంగా ఖరీఫ్‌లో కంది రకాలు, రబీలో పప్పుశనగ పంట అభివృద్ధికి విస్తృతమైన పరిశోధనలు, మిగతా విత్తనాలపై కూడా ప్రయోగాలు, పరిశోధనలు ఉంటాయన్నారు. అందుకోసం ప్రత్యేకంగా మౌలిక వసతుల కల్పన, సాంకేతిక పరిజ్ఞానం, సిబ్బంది అవసరం ఉంటుందని తెలిపారు. దీనిపై త్వరలోనే కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వానికి పంపుతామని ఆయన తెలిపారు. -
కళ్యాణదుర్గం కేవీకేకు రాష్ట్ర ఉత్తమ అవార్డు
కళ్యాణదుర్గం రూరల్ : కళ్యాణదుర్గం పట్టణ సమీపంలో ఉన్న లక్ష్మిదేవమ్మ కృషి విజ్ఞాన కేంద్రానికి రాష్ట్ర ఉత్తమ అవార్డు వచ్చింది. ఈనెల 5న నంద్యాలలో జరిగిన పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశంలో రాష్ట్ర ఉత్తమ కేవీకేగా అవార్డును కో ఆర్డినేటర్ జాన్సుధీర్కు వ్యవసాయశాఖ కమిషనర్ ధనుంజయరెడ్డి, ఎన్జీరంగా విశ్వవిద్యాలయ సంచాలకుల చేతులమీదుగా అవార్డును ప్రదానం చేశారు. రైతులకు అందుబాటులో ఉంటూ కరువు జిల్లా అయినా అనంతలో 70 శాతం మంది రైతులు వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారని, ఇందులో రైతులకు చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయల పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తూ మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలిపి మంచి ఫలితాలు సాధించారు. దీంతో వ్యవసాయ శాఖ గుర్తించి రాష్ట్ర ఉత్తమ కేవీకేగా అవార్డును అందజేసింది. ఈ అవార్డు జాన్‌సుధీర్ అందుకున్నారు. -
బొల్లవరంలో పంటల పరిశీలన
- అంతర పంటలను పరిశీలించిన కేవీకే శాస్త్రవేత్తలు - ఎస్వీ వ్యవసాయ కళాశాల విద్యార్థులకు వ్యవసాయ అనుభవం కల్లూరు : కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్తలు రమణయ్య, సుధాకర్ ఆధ్వర్యంలో ఎస్వీ వ్యవసాయ కళాశాలకు చెందిన విద్యార్థినులు మంగళవారం మండల పరిధిలోని బొల్లవరంలో రైతులు సాగు చేసిన పంటలను పరిశీలించారు. అంతర పంటలుగా వరలక్ష్మి సాగుచేసిన కంది, పత్తిని పరిశీలించారు. రెండు అంతకన్నా ఎక్కువగా పంటలను సాగుచేయడం వల్ల ఒక పంట దెబ్బతిన్నా మరో పంటలో లాభాలు వస్తాయని ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు వివరించారు. అనంతరం తీగజాతి కూరగాయలను సాగుచేస్తున్న రైతు రాజశేఖర్ పొలాన్ని పరిశీలించారు. -
ఏపీని అన్ని విధాలా ఆదుకుంటాం
రూ.22 వేలకోట్లు రెవెన్యూలోటు భర్తీ కేంద్రానిదే బాధ్యత నెల్లూరులో ఎన్సీఈఆర్టీ త్వరలో ఏర్పాటు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వెంకటగిరి: రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రప్రభుత్వ అన్ని విధాలుగా ఆదుకుంటున్నట్లు కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వెంకటగిరిలో ఆదివారం కృషివిజ్ఞానకేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ 14వ ఆర్థికసంఘం సూచనల మేరకు ప్రత్యేకహోదా కాకుండా రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక హోదాకన్నా ప్రత్యేక ప్యాకేజీతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనఽతో ఏర్పడిన రూ.22 వేలకోట్లు రెవెన్యూ లోటును కేంద్రప్రభుత్వం ఐదేళ్లలో భర్తీ చేసేందుకు అంగీకరించిందన్నారు. ఇప్పటికే రెండు విడతలుగా నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. దక్షణ భారత దేశంలో రెండోదిగా నెల్లూరులో ఎన్సీఈఆర్టీ ( నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రయినింగ్ సెంటర్ )కు త్వరలో సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. విజయవాడ నుంచి చెన్నై వరకూ ఉన్న డబుల్ రైల్వేలైన్‌ను ఆధునీకరించి ట్రిపుల్‌లైన్‌గా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కృషివిజ్ఞానకేంద్రం ద్వారా పరిశోధనలు జరిగి ఈ ప్రాంతానికి అనుకూలమైన పంటలు, సాగువిధానాలు రూపొందించే వీలుంటుందన్నారు. రైతులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ కేంద్రన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు అదేప్రాంగణంలో పట్టణంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో నిర్మించిన సిమెంట్‌రోడ్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. రాష్ట్రమంత్రులు పత్తిపాటి పుల్లారావు, పొంగూరు నారాయణ, కామినేని శ్రీనివాస్, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు, స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర, నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దొంతుశారద, డాక్టర్ వైఎస్సార్ ఉద్యానశాఖ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ బీఎంసీ రెడ్డి. కలెక్టర్ ముత్యాలరాజు పాల్గొన్నారు. -
నూనె గింజల ఉత్పత్తికి ప్రోత్సాహం
ఉండి : నూనె గింజల ఉత్పత్తిని పెంచేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నట్టు కేవీకే ప్రోగ్రాం కో–ఆర్డినేటర్, హెడ్ డాక్టర్ దెబోరా మెస్సియానా తెలిపారు. ఎన్నార్పీ అగ్రహారం కృషి విజ్ఞాన కేంద్రంలో చింలపూడి, విజయరాయి గ్రామాల రైతులకు శుక్రవారం నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్‌పామ్ కార్యక్రమం ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అతారీ జోన్ 5 ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో దెబోరా మాట్లాడుతూ దేశంలో నూనె గింజల ఉత్పత్తి తగ్గడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు సబ్సిడీపై విత్తనాలు, పురుగుమందులు అందించి వేరుశనగ, మినుము, నువ్వుల పంటల సాగు చేసేలా కేవీకే ఆధ్వర్యంలో రైతులను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. వేరుశనగ విత్తనశుద్ధి తప్పనిసరన్నారు. శుద్ధిచేసే సమయంలో విత్తనం పైపొర పాడవకుండా చూడాలని సూచించారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని అన్నారు. కలుపు, వేరు పురుగు, వైరస్ నివారణకు ఎకరాకు బోరెక్స్ అనే మందును ఎకరాకు 4 కేజీల చొప్పున విత్తనాలతో కలిపి భూమిలో వేయాలని సూచించారు. కార్యక్రమంలో 25 మంది రైతులు, శాస్త్రవేత్తలు ఎం.వి.కృష్ణాజీ, సుధాజాకబ్, సుమన్‌బాబు పాల్గొన్నారు. -
రైతు నేస్తం అవార్డుల స్వీకరణ
హన్మకొండ మండలం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ రేపల్లె ప్రసన్నకుమార్, గోవిం దరావుపేట మండల పశువైద్యా ధికారి అజ్మీరా ధర్మానాయక్, కేసముద్రం మండలానికి చెందిన రైతు గంటా దామోదర్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో పద్మశ్రీ ఐవీ సుబ్బారావు రైతునేస్తం అవార్డులు అందుకున్నారు. కేంద్ర, రాష్ట్ర మం త్రులు వెంకయ్యనాయుడు, హరీష్‌రావు చేతుల మీదుగా వారు అవార్డులు స్వీకరించారు. కార్యక్రమంలో రైతు నేస్తం ఎడిటర్ వై. వెంకటేశ్వర్రావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, యల మంచలి శివాజీ, ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
బంగారు కోడిపెట్ట.. పెంచుకోండి..
రోజుకో గుడ్డు తినండి.. వ్యాధుల నుంచి దూరంగా ఉండండి అని వైద్యులు చెబుతున్నారు. అధిక పోషక విలువలతో కూడిన గుడ్డు వినియోగం ఇటీవల పెరిగింది. పలు రకాల కోళ్ల ఉత్పత్తి పెరుగుతోంది. కొత్త కొత్త రకాల కోళ్లు దర్శనమిస్తున్నాయి. సిరుల పండించే కోళ్ల పెంపకంపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అధిక పోషక విలువలు, ఆదాయూన్ని ఇస్తూ వాతావరణ పరిస్థితులను తట్టుకునే రకాల పెంపకంపై తాడేపల్లిగూడెం మండలం వెంక్రటామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. శ్రీనిధి, వనరాజా కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ.. ఔత్సాహిక రైతులను గుర్తించి వారికి పరిశీలన కోసం ఉచితంగా యూనిట్లను అందిస్తున్నారు. - వెంకట్రామన్నగూడెం (తాడేపల్లిగూడెం) రైతులకు లాభాలు పంచడానికి, పోషకాహారంతో కూడిన గుడ్లును అందించే శ్రీ నిధి, వనరాజా కోళ్ల పెంపకాన్ని కేవీకే ప్రోత్సహిస్తోంది. దీనిలో భాగంగా ముందుగా హైదరాబాద్‌లో ప్రాజెక్టు ైడె రెక్టరేట్ ఆన్ పౌల్ట్రీ నుంచి తయారుచేసిన కోడి పిల్లలను రైతులకు ఇస్తారు. తొమ్మిది పెట్టలు, ఒక పుంజు పిల్లను యూనిట్‌గా కేవీకే రైతులకు అందిస్తోంది. ఆరు వారాల వయసు ఉన్న కోడిపిల్లలను అందించగా ఇవి ఆరు నెలల వయసు నుంచి గుడ్లు పెట్టడం ప్రారంభిస్తారుు. ఏడాదికి సుమారు 180 నుంచి 220 గుడ్లను జీవించి ఉన్నంత కాలం పెడుతుంటాయి. వీటికి పెరట్లో హారుుగా తిరిగే వీలు కల్పించాలి. అందుబాటులో ఉండే ఆహారం అందిస్తే సరిపోతుంది. కోళ్లు రెండు నుంచి రెండున్నర కిలోల బరువు వరకు పెరుగుతాయి. ఏడాదిలోపు ఈ బరువును చేరుకుంటారుు. అప్పుడు సగం కోళ్లను అమ్ముకుంటే రైతుకు రూ. 2,500 ఆదాయం వస్తుంది. వనరాజా కోళ్లు బలిష్టంగా, చిన్న కాళ్లతో ఎదుగుతాయి. ఇవి గుడ్లను పొదగవు, నాటు కోళ్ల ద్వారా వీటి గుడ్లను పొదిగించవచ్చు. గుడ్డు ధర రూ.10 నుంచి రూ.15 వనరాజా గుడ్డు ధర రూ.10 నుంచి రూ.15 ఉంది. అయితే వీటి పిల్లలు కుక్కలకు సుల భంగా దొరికిపోతుంటారుు. దీంతో కేవీకే శాస్త్రవేత్తలు శ్రీ నిధి కోళ్లను అభివృద్ధి చేశారు. ఇవి వనరాజా కోళ్ల మాదిరిగానే ఉన్నా కాళ్లు కాస్త పొడవుగా ఉంటాయి. ఎగిరే గుణం ఉంటుంది. బరువు వనరాజాతో పోలిస్తే 200 గ్రాములు తక్కువుగా ఉంటుంది. రంగుల్లో ఉంటాయి. ఇటీవల వీటి పెంపకంపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఆరు వారాల వయసున్న వనరాజా కోడిపిల్ల ధర రూ.120. ఉండ్రాజవరానికి చెంది న బాలాజీ అనే రైతు వీటిని హేచరీలో పెం చుతూ, అవసరమైన వారికి విక్రయిస్తున్నారు. మంచి పోషకాహారం వనరాజా, శ్రీ నిధి కోళ్ల పెంపకం వల్ల రైతులకు ఆదాయానికి ఆదాయం, పోషకాహారానికి పోషకాహారం లభిస్తుంది. తెలికిచర్ల, చోడవరం, బంగారుగూడెం, వెల్లమిల్లి, వెంకట్రామన్నగూడెం గ్రామాల్లో రైతులకు వీటిని ఉచి తంగా ఇచ్చి పెంపకాలను ప్రోత్సహిస్తున్నాం. - ఈ.కరుణశ్రీ, కేవీకే సమన్వయ కర్త, వెంకట్రామన్నగూడెం -
సాగు ఖర్చు తగ్గేదెలా?
పంట పొలాల్లో మరణ మృదంగం మోగిస్తున్న వ్యవసాయ సంక్షోభాన్ని నిలువరించడం ఎలా? ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ ప్రశ్నపై దృష్టిని కేంద్రీకరించింది. వ్యవసాయ పరిశోధనల సారాన్ని స్వయంగా సేద్యం చేస్తున్న యువ రైతులకు నేరుగా అందించడానికి వీలుగా శిక్షణ ఇవ్వడం మేలని విశ్వవిద్యాలయం భావించింది. దూరవిద్య ద్వారా తెలుగులో 3 నెలల సర్టిఫికెట్ కోర్సును నిర్వహించాలని, వ్యవసాయ పరిశోధన కేంద్రాలు, కేవీకేలలో వారానికో రోజు కాంటాక్టు క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇంతకీ యువ రైతులకు ఏయే అంశాలపై శిక్షణ అవసరం? 9 జిల్లాల నుంచి 77 మంది యువ రైతులను ఈ నెల 1న హైదరాబాద్‌లోని విస్తరణ విద్యా సంస్థకు పిలిపించి వారి అభిప్రాయాలను సేకరించారు. అనేక ఇతర అంశాలతోపాటు.. రసాయనిక ఎరువులు, పురుగు, కలుపు మందుల ఖర్చు పెచ్చుమీరిందని.. ఈ ఖర్చులు తగ్గించే సమగ్ర సేంద్రియ/ప్రకృతి సాగు పద్ధతుల్లో శిక్షణనివ్వాలని యువ రైతులు కోరారు. అయితే, వర్మీ కంపోస్టు, జీవన ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం తప్ప.. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంపై ఇప్పటి వరకు సమగ్ర పరిశోధనా విభాగాన్నే తెరవని మన విశ్వవిద్యాలయం(తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఈ విషయంలో ఎంతో ముందున్నాయి).. ఇక యువ రైతులకెలా నేర్పిస్తుందో వేచి చూడాల్సిందే. ఇప్పటికే ఈ పద్ధతులను ఏళ్ల నాటి నుంచి అవలంబిస్తూ అనేక పంటల్లో సత్ఫలితాలు సాధిస్తున్న చిన్న, పెద్ద రైతులతోపాటు విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్తలు/ అధికారులూ లేకపోలేదు. వీరి తోడ్పాటుతో యువ రైతులకు నిక్షేపంగా శిక్షణ ఇవ్వొచ్చు. అయితే విశ్వవిద్యాలయ నిబంధనలు అందుకు ఒప్పుకుంటాయా? ప్రత్యామ్నాయ సాగు పద్ధతులు పాటించకుండా ఖర్చు తగ్గేదెలా? రైతుల అభిలాష నెరవేరేదెలా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి! ఖర్చు తగ్గే సాగు పద్ధతులు నేర్పాలి! రెండెకరాల్లో పత్తి, ఎకరన్నరలో వరి, ఎకరంలో టమాటా పండిస్తున్నం. వ్యవసాయం ఖర్చు బాగా పెరిగిపోయింది. గిట్టుబాటు కావటం లేదు. శిక్షణ ద్వారా కూలీల ఖర్చు తగ్గించుకునే సాగు పద్ధతులను నేర్చుకోవాలనుకుంటున్న. డీఏపీ బస్తా రూ. 1,200కు పెరిగిపోయింది. కూలి రూ. 200 దాటింది. సేంద్రియ ఎరువులను రైతులు ఎవరికివారు సొంతంగా తయారు చేసుకోవడంపై శిక్షణ ఇవ్వాలి. - మద్ది శ్రావణి(93924 84542), యువ మహిళా రైతు, మొయినాబాద్, రంగారెడ్డి జిల్లా రైతు కొడుకును రైతుగా నిలబెట్టే శిక్షణ కావాలి ఎరువులు, పురుగుమందులు, కలుపుమందుల మోతాదుపై రైతుల్లో అవగాహన లేదు. వీటిని విచక్షణారహితంగా వాడేస్తున్నందున ఖర్చు పెరుగుతోంది. డిగ్రీ చదివిన నా వంటి రైతులు కూడా పక్క వాళ్లను చూసి ఎక్కువగా వాడేయాల్సి వస్తోంది. వీటిపై పూర్తి అవగాహన కలిగించేలా శిక్షణ ఇవ్వాలి. అన్ని పంటల్లో పూర్తిస్థాయిలో సొంత విత్తనం తయారుచేసుకోవడం, మాక్ సొసైటీల ఏర్పాటుపై అవగాహన కలిగించాలి. రైతుల కోసం ప్రత్యేక తెలుగు టీవీ ఛానల్ ప్రారంభించాలి. సెల్ ద్వారా పంట ఫొటోలు పంపితే శాస్త్రవేత్తలు సూచనలు ఇవ్వాలి. రైతు కొడుకును రైతుగా నిలబెట్టే భరోసా ఇచ్చేలా శిక్షణ సమగ్రంగా ఉండాలి. - రాకం దేవేందర్(97015 59376), లింగయ్యగిరి, చెన్నారావుపేట మండలం, వరంగల్ జిల్లా అధికాదాయాన్నిచ్చే పంటలపైనే ఆసక్తి! తాతలు తండ్రుల నాటి నుంచి సాగు చేస్తున్న వరి, పత్తి వంటి సంప్రదాయక పంటల సాగుపై చిన్న కమతాలున్న యువ రైతులకు బొత్తిగా ఆసక్తి లేదు. ధనిక రైతులకే పరిమితమైన అధికాదాయాన్నిచ్చే పంటలపై వీరికి ఆసక్తి ఉంది. పూలు, పండ్ల తోటల సాగు, చేపల పెంపకం, పాడి పెంపకంలో ఆధునిక పద్ధతులపై శిక్షణ ఇవ్వాలి. అధికాదాయాన్నిచ్చే పంటలకు పెట్టుబడి ఎక్కువ అవసరమైనప్పటికీ.. అయినావాళ్లు నలుగురూ కలిసి సాగు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. సబ్సిడీలకన్నా సమాచారం, శిక్షణ ఇవ్వడం అవసరం. చిన్న రైతులకు వ్యవసాయ సూచనలు, సలహాలు అందటం లేదు. - పొడిచేటి సురేందర్, నకిరేకల్(90303 69300), నల్లగొండ జిల్లా సేంద్రియ సాగుపై ఊరూరా ప్రదర్శన క్షేత్రాలు పెట్టాలి 18 ఎకరాల్లో పత్తి, వరి, కంది పండిస్తున్నా. పాలిహౌస్‌లతో పెద్ద రైతులకే ఉపయోగం. చిన్న రైతులందరికీ ఉపయోగపడే సేంద్రియ సాగు పద్ధతులపై శిక్షణ ఇవ్వాలి. తక్కువ ఖర్చుతో సేంద్రియ వ్యవసాయం చేయడంపై ప్రతి గ్రామంలో రెండెకరాల్లో ప్రదర్శన క్షేత్రాలను విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి. అనుభవజ్ఞులైన ప్రకృతి వ్యవసాయదారులు, సేంద్రియ రైతులతో శిక్షణ ఇప్పించడం అవసరం. అన్ని పంటల విత్తనాలు తయారు చేసుకోవడం.. స్ప్రేయర్లు, చిన్న యంత్రపరికరాలు, మోటార్ల మరమ్మతులు చేయడం.. 50-100 కోళ్లు పెంచుకోవడం, పశువ్యాధులకు చికిత్స చేయడం.. ప్రతి ఊళ్లో కొందరు యువ రైతులకు శిక్షణ ఇప్పించాలి. సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవడం, వాటి ద్వారా లబ్ధిపొందడంపై శిక్షణ ఇవ్వాలి. ఆవులు, గేదెలను 50% సబ్సిడీ మీద ఇవ్వాలి. - పల్లె రమాదేవి (90003 02289), మహిళా రైతు, ఎత్బార్పల్లె, రంగారెడ్డి జిల్లా యువ రైతులకు గోఆధారిత సాగు నేర్పించాలి అనేక దేశవాళీ వరి వంగడాలు, కూరగాయలను సాగు చేస్తున్నా. 4 ఏళ్ల నుంచి గోఆధారిత వ్యవసాయం చేస్తున్నా. ప్రతి రైతుకూ ఆవులుండాలి. పాడి-పంట ఉంటేనే రైతుకు లాభం. పశువుల ఎరువు కొనుక్కొని వేస్తే రైతుకు మిగిలేదేమీ ఉండదు. గోమూత్రం, వేపనూనె పిచికారీ చేస్తున్నాను. గోమూత్రం పిచికారీ వల్ల వైరస్ తెగుళ్లు రావడం లేదు. ఖర్చు బాగా తగ్గింది. దిగుబడి బాగుంది. యువ రైతులకు ఈ పద్ధతులను నేర్పిస్తే.. వ్యవసాయంలో నిలబడగలుగుతారు. పత్తి, సోయా వంటి వాణిజ్య పంటలతోపాటే అంతరపంటలుగా చిరుధాన్యాలు, కూరగాయలు పండించుకుంటే చిన్న రైతులకు తిండి కరువుండదు. ఈ పద్ధతులపై శిక్షణ ఇవ్వాలి. - ఎన్. మన్మోహన్రెడ్డి (85001 47354), చించోలిబీ, సారంగపూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా దిగుబడి తగ్గి.. తెగుళ్లు పెరుగుతున్నాయి! మా గ్రామాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయం పదేళ్ల క్రితమే దత్తత తీసుకుంది. అన్ని పొలాల్లోనూ డ్రిప్ ఏర్పాటు చేసుకొని కూరగాయలే పండిస్తున్నాం. ఎకరానికి 7 టన్నులు కోళ్ల పెంట, డీఏపీ తదితర ఎరువులు వేస్తున్నాం. ప్రతి సంవత్సరం దిగుబడి తగ్గుతోంది. తెగుళ్లు పెరుగుతున్నాయి. క్యాబేజీ 2010 వరకు ఎకరానికి 20 టన్నులు పండేది. ఇప్పుడు 5-6 టన్నులకు తగ్గింది. ఎండుతెగులుకు శాస్త్రవేత్తలూ పరిష్కారం చూపలేకపోతున్నారు. క్యారెట్ మొక్కలు 4 ఆకులు వేసిన తర్వాత పడిపోయి చనిపోతున్నాయి. టమాటా సాగులో మల్లి సమస్యకు పరిష్కారం లేదు. స్థానిక అధికారులకు ఈ సమస్యలపై అవగాహన శూన్యం. సమస్య ఇదీ అని చెప్పినా రోజులు గడుస్తున్నా పరిష్కారం ఏమిటో చెప్పే నాథుడే లేడు. ఫోన్ ద్వారా ఫొటో పంపితే ఒకటి, రెండు రోజుల్లో పరిష్కారం చూపే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అంతకన్నా ఆలస్యమైతే పంట చేయిదాటిపోతుంది. పురుగుమందుల కంపెనీల శాస్త్రవేత్తలు తరచూ పొలాల్లోకి వస్తూనే ఉంటారు. తమ కంపెనీ ఉత్పత్తులనే వాడాలని ఎవరికి వారు ఊదరగొడుతూ గందరగోళం సృష్టిస్తున్నారు. యాంత్రీకరణలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. కర్ణాటకలో క్యారెట్ సీడ్ వేయడం, దుంపలు పీకడం, కడగడం వంటి పనులన్నీ యంత్రాలతోనే చేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నారు. అటువంటి టెక్నాలజీని అందుబాటులోకి తేవాలి. ఖర్చు, తెగుళ్లు తగ్గి దిగుబడి పెరిగే సాగు పద్ధతులపై శిక్షణ కావాలి. - యువ రైతులు దేవేందర్‌రెడ్డి, శంకర్, సుఖేష్‌రెడ్డి, దీపక్‌రెడ్డి(98669 66162) చనువల్లి, చేవెళ్ల మండలం, రంగారెడ్డి జిల్లా - సేకరణ: పంతంగి రాంబాబు, ఫొటోలు: మోహన్