బొల్లవరంలో పంటల పరిశీలన
- అంతర పంటలను పరిశీలించిన కేవీకే శాస్త్రవేత్తలు
- ఎస్వీ వ్యవసాయ కళాశాల విద్యార్థులకు వ్యవసాయ అనుభవం
కల్లూరు : కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్తలు రమణయ్య, సుధాకర్ ఆధ్వర్యంలో ఎస్వీ వ్యవసాయ కళాశాలకు చెందిన విద్యార్థినులు మంగళవారం మండల పరిధిలోని బొల్లవరంలో రైతులు సాగు చేసిన పంటలను పరిశీలించారు. అంతర పంటలుగా వరలక్ష్మి సాగుచేసిన కంది, పత్తిని పరిశీలించారు. రెండు అంతకన్నా ఎక్కువగా పంటలను సాగుచేయడం వల్ల ఒక పంట దెబ్బతిన్నా మరో పంటలో లాభాలు వస్తాయని ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు వివరించారు. అనంతరం తీగజాతి కూరగాయలను సాగుచేస్తున్న రైతు రాజశేఖర్ పొలాన్ని పరిశీలించారు.