reddypalli
-
మెదక్ జిల్లా రెడ్డిపల్లి విలేజ్ లో బీజేపీ నేత నిర్వాకం
-
ఆగస్టులో బెటాలియన్ ప్రారంభోత్సవం
బుక్కరాయసముద్రం : మండల పరిధిలోని సెంట్రల్ జైలు సమీపంలో ఉన్న 14వ పోలీస్ బెటాలియన్‌ను ఆగస్ట్‌లో ప్రారంభించనున్నట్లు కమాండర్ జగదీష్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని సెంట్రజైలు సమీపంలో 14వ పోలీస్ బెటాలియన్‌లో వనం - మనం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కమాండర్ జగదీష్‌కుమార్ మాట్లాడుతూ పోలీసులు ప్రజా రక్షణతో పాటు సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొనడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రెండు మొక్కలు నాటి, సంరక్షించాలన్నారు. బెటాలియన్‌లో రూ. 13 కోట్లతో మొదటి విడత అడ్మినిస్ట్రేషన్ భవన నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. వీటిని ఆగస్టు నెలలో ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వెయ్యి మందికి శిక్షణ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత ఏడాది 10 వేల మొక్కలు నాటామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండర్ ప్రభుకుమార్, అసిస్టెంట్ కమాండెన్స్ ఆనంద్ కన్నా, విల్సన్ కేర్, ఇన్స్పెక్టర్ దస్తగిరి, సబ్ఇన్స్పెక్టర్లు వీబీ వర్మ, రఘురాం, మల్లికార్జున, బలరాం నాయక్, బెటాలియన్ పోలీసులు పాల్గొన్నారు. -
కరువు క్షేత్రం
- ఓపన్ ఎయిర్ జైల్లో వ్యవసాయం కుదేలు - భారీగా తగ్గిన జైలు ఆదాయం - ఈ ఏడాది 9 లక్షలే ఆదాయం - ఎండుతున్న మామిడి చెట్లు ఖైదీల వ్యవసాయ క్షేత్రం.. ఎటు చూసినా పచ్చని చెట్లు.. కూరగాయలు, పండ్ల తోటలు, పూల మొక్కలు, జీవిత ఖైదీలు పనులు చేసుకుంటూ కనిపించేది. ఇదంతా రెండేళ్ల కిందటి మాట. నేడు ఎండిపోయిన చెట్లు.. వాడిపోయిన కాయలు, రాలిన ఆకులతో కళావిహీనంగా మారిపోయింది. కరువు రక్కసి పంజా విసరడంతో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయం కుదేలైంది. వ్యవసాయం ద్వారా జైలుకు వచ్చే ఆదాయం భారీగా పడిపోయింది. - బుక్కరాయసముద్రం (శింగనమల) : బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి సమీపంలో ఓపన్ ఎయిర్ జైలు ఉంది. జైలుకు 1427.57 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో 118 ఎకరాలు ఏపీఎస్పీ 14వ బెటాలియన్ నిర్మాణానికి, 500 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణానికి, 18.38 ఎకరాలు జిల్లా జైలుకు ఇచ్చారు. 45 ఎకరాల్లో ఓపన్ ఎయిర్ జైలు పరిపాలనా విభాగం ఉంది. 3 ఎకరాల్లో పెట్రోలు బంకులు, హోటల్ నిర్మాణాలు చేపట్టారు. వర్షాలు, హెచ్చెల్సీ నీటి ఆధారంగా 110 ఎకరాల్లో వేప, చింత టేకు చెట్లు పెంచుతున్నారు. మిగిలిన 600 ఎకరాల్లో 5 వేల వరకు వివిధ రకాల మామిడి చెట్లు, కాయగూరలు, వేరుశనగ, చిరుధాన్యాలు, గ్రాసం, పూల వంటి పంటలు సాగు చేస్తున్నారు. భారీగా తగ్గిన జైలు ఆదాయం వర్షాభావం ప్రభావం ఓపన్ ఎయిర్ జైలు ఆదాయంపై పడుతోంది. గత రెండేళ్ల కంటే ఈ ఏడాది ఆదాయం పెద్ద ఎత్తున పడిపోయింది. 2014–15లో రూ.42,66,241 పెట్టుబడి పెట్టగా రూ.37,60,770 ఆదాయం వచ్చింది. 2015–16లో రూ.24,03,346 పెట్టుబడి పెట్టగా రూ.32,95,840 ఆదాయం సమకూరింది. 2016–17లో రూ.23,05,559 పెట్టుబడి పెట్టగా రూ.9,62,350 ఆదాయం వచ్చినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అదే విధంగా గత ఏడాది మామిడి తోట వేలం వేయగా రూ.23 లక్షలు వచ్చింది. ఈ ఏడాది మామిడి తోట దిగుబడి లేక వ్యాపారస్తులు సరైన ధర పెట్టకపోవడంతో రెండుసార్లు వేలం వాయిదా పడింది. వర్షాలు లేక, హెచ్చెల్సీ నీరు అందక జైలులో మామిడి, టేకు చెట్లు నిలువునా ఎండపోతున్నాయి. ఎక్కడ చూసినా పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. నీరుంటే మంచి ఆదాయం ఓపన్ ఎయిర్ జైలులో వర్షాలు సక్రమంగా పడి, నీరు ఉంటే మంచి పంటలు పండించవచ్చు. జైలులో 80 మంది ఖైదీల వరకు ఉన్నారు. యంత్రాలు కూడా వినియోగించి పనులు చేయిస్తున్నాము. రెండేళ్లలో ఆదాయం 3 రెట్లు తగ్గిపోయింది. ఏ పని చేయించాలన్నా నీరు బాగా కావాల్సి వస్తోంది. ఇలాంటి కరువు పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. వర్షాలు వస్తే వేరుశనగ, కంది, మామిడి చెట్ల పెంపకం, కూరగాయలు సాగు పెద్ద ఎత్తున చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నాం. - గోవిందరాజులు, సూపరింటెండెంట్, ఓపెన్ ఎయిర్ జైలు -
సీడ్‌హబ్‌గా రెడ్డిపల్లి కేవీకే
అనంతపురం అగ్రికల్చర్ : రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రాన్ని సీడ్‌హబ్‌గా మార్చనున్నారని కో ఆర్డినేటర్ డాక్టర్ పి.లక్ష్మిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రెడ్డిపల్లి కేవీకేను సీడ్‌హబ్‌గా చేస్తామంటూ ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రధానంగా ఖరీఫ్‌లో కంది రకాలు, రబీలో పప్పుశనగ పంట అభివృద్ధికి విస్తృతమైన పరిశోధనలు, మిగతా విత్తనాలపై కూడా ప్రయోగాలు, పరిశోధనలు ఉంటాయన్నారు. అందుకోసం ప్రత్యేకంగా మౌలిక వసతుల కల్పన, సాంకేతిక పరిజ్ఞానం, సిబ్బంది అవసరం ఉంటుందని తెలిపారు. దీనిపై త్వరలోనే కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వానికి పంపుతామని ఆయన తెలిపారు. -
సిరుల బంతి
రొద్దం : సంప్రదాయ వ్యవసాయంతో నష్టాలు చవిచూసిన రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో లాభాలు గడిస్తున్నారు. నిత్యమూ అన్ని సామాజిక వర్గాలకు ఉపయోగకరమైన పూల సాగు రోజు వారి ఆదాయాన్ని సమకూరుస్తుండడంతో రైతులు ఆ దిశగా అడుగు వేశారు. అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. వివరాలు.. రొద్దం మండలంలోని రెడ్డిపల్లికి చెందిన 20 మంది రైతులు నూనత వంగడాల బంతి పూల సాగును 50 ఎకరాల్లో చేపట్టారు. పూల విత్తనం అందించిన కంపెనీ వారే దిగుబడిని కూడా కొనగోలు చేస్తుండడంతో మార్కెటింగ్‌లో తలెత్తుతున్న సమస్యల నుంచి వారు బయటపడ్డారు. ఎకరా బంతి పూల సాగుకు రూ. రెండు వేల వరకు పెట్టుబడులు అవసరం కాగా, ప్రతి కోతకు రూ. నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు ఆదాయం వస్తోంది. వారానికి ఒకసారి కోతకు వచ్చే పూలను తరలించేందుకు కంపెనీ వారే లారీలను తీసుకువచ్చి కర్ణాటకలోని టిప్పుటూరు మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఈ లెక్కన పంట మొత్తం 9 సార్లు కోతకు వస్తుందని రైతులు వివరిస్తున్నారు. -
డీఎస్పీ గన్మెన్లను చితకబాదారు..
కడప: కడప జిల్లా డీఎస్పీ గన్మెన్లు దౌర్జన్యానికి పాల్పడగా స్థానికులు వారిని పట్టుకుని చితకబాదారు. ఈ సంఘటన జిల్లాలోని పుల్లంనేట మండలం రెడ్డిపల్లిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. పుల్లంనేట మండలం రెడ్డిపల్లిలో డీఎస్పీ గన్మెన్లు ఓ షాపు వద్దకు వెళ్లారు. అక్కడ కూల్ డ్రింక్ తీసుకుని తాగారు. అయితే డబ్బులు ఇవ్వకుండా వెళ్తోన్న వాళ్లను ఆ షాపు అతను డబ్బులు చెల్లించమని అడిగాడు. ఆగ్రహించిన గన్మెన్లు మమ్మల్నే డబ్బులు అడుగుతావా అంటూ కూల్ డ్రింక్స్ తాగిన షాపును ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు డీఎస్పీ గన్మెన్లను పట్టుకుని చితకబాదారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.