కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి
ఎమ్మెల్యే రేఖానాయక్ దస్తురాబాదు(కడెం) : దళారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకని ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, రైతులందరూ ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రేఖానాయక్ రైతులను కోరారు. దస్తురాబాదు మండల కేంద్రంతో పాటు మండలంలోని మున్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె బుధవారం ప్రారంభించారు. కేంద్రాలు రైతు వద్ద చివరి ధాన్యం అమ్మే వరకు పనిచేస్తాయని, కేంద్రాల వద్ద రైతులకు అందుబాటులో గన్నీ బ్యాగులుంచాలని తేమ విషయంలో నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఐకేపీ సిబ్బందిని ఆదేశించారు.
ఎ గ్రేడు రకానికి క్వింటాలుకు రు.1510, బీ గ్రేడు రకానికి క్వింటాలుకు రు.1470 లుగా ప్రభుత్వం నిర్ణయించిందని, రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో అమ్మి వారం రోజుల్లో డబ్బులు పొందొచ్చని ఐకేపీ ఏపీఎం వనజ రైతులకు వివరించారు. కార్యక్రమంలో తహసీల్ధార్ నర్స య్య, ఎంపీడీఓ విలాస్‌గౌడ్, సింగిల్ విండో చైర్మన్ చుంచు భూమన్న, డెరైక్టర్లు నల్గొండ, ఐలయ్య యా దవ్, దస్తురాబాదు, మున్యాల, బుట్టాపూర్ గ్రామాల సర్పంచులు జీ గంగామణి, ఎస్ సంతో ష్, హన్మాగౌడ్, ఎంపీటీసీ వీ మల్లేష్, టీఆర్‌ఎస్ కడెం మండలాద్యక్షుడు నల్ల జీవన్‌రెడ్డి, నాయకులు సాగర్, జీ రాజేశం, దొనకంటి స్వామి, బుక్యా రాజు, జీ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
పాండ్వాపూర్ గ్రామంలో. . .
కడెం మండలం పాండ్వాపూర్ గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే రేఖానాయక్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సంతోష్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు జీవన్‌రెడ్డి, నల్గొండ, నాయకులు గోపు రాజమౌళి, పాలకాని గంగాధర్, వుల్వకాని మల్లయ్య, పిన్నం మల్లేష్, ఐకేపీ సీసీ స్వామి, సిబ్బంది గోపి, రైతులు పాల్గొన్నారు.