మాట్లాడుతున్న మంత్రి తుమ్మల
-
మిర్చి రైతులను ఆదుకోవాలి
-
అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం జెడ్పీసెంటర్ : జిల్లాలో మిర్చి రైతులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం టీటీడీసీలో వరద నివారణ ప్రత్యేకాధికారి అహ్మద్‌నదీం, జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్‌తో కలిసి వరద నివారణ చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మిర్చి విత్తనాలను రైతులు లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారని, తీరా వేశాక అవి మొలకెత్తలేదని, వాటిని సరఫరా చేసిన షాపులు, ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మిర్చి వేసిన రైతులు తీవ్ర ఆందో ఉన్నారని ఏ షాపులో కొనుగోలు చేశారో వారిపై చర్యలు తీసుకోవాలని, జిల్లా ఎస్పీని సంప్రదించి కేసులు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో గోదావరి వరదల ఇబ్బంది లేదని, అయినప్పటికీ అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేసేందుకు ఇరిగేష¯ŒS మంత్రిని కోరినట్లు చెప్పారు. మండల వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలను కాపాడుకునేందుకు అవసరమైన సలహా లు అందించాలని చెప్పారు. వర్షాలు ముగిసిన తరువాత వ్యాధులు ప్రబలకుండా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని, వైద్య ఆరోగ్యశాఖ బఫర్‌స్టాక్ ఆయా ప్రాంతాల్లో నిల్వ ఉంచాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ మాట్లాడుతూ పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖలకు రూ.3.85 లక్షలు మంజూరు చేసినా మరమ్మతు పనులు మొదలు కాలేదన్నారు. అనంతరం వరద నివారణ చర్యలు పరిశీలించేందుకు ప్రభుత్వం నియమించిన జిల్లా ప్రత్యేకాధికారి, కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్‌నదీం మాట్లాడుతూ జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల ఎలాంటి ప్రమాదం లేదన్నారు. పాలేరు రిజర్వాయర్ నీటి మట్టం 21.8 అడుగులు, మున్నేరు ఉధృతి 10 అడుగులు ఉందన్నారు. వర్షాల వల్ల జిల్లాలో 4,500 చెరువుల్లో 500 చెరువులు పొంగిపోర్లుతున్నాయని, మరో 1,500 చెరువుల్లో 75 శాతం మేర నీరు వచ్చి చేరిందని పేర్కొన్నారు.