
ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని ఒకరి దుర్మరణం
ఎర్రగుంట్ల: మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామ డాబా సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందాడు. పోలీసులు, బంధువుల కథనం మేరకు..ఎర్రగుంట్ల పట్టణంలోని ఎర్రబ్బచేను దగ్గర దర్గా సమీపంలో నివాసం ఉంటున్న రామక్రిష్ణ (28)మంగళిషాపులో పని చేస్తూ, మరో వైపు డ్రైవర్‌గా పోతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ప్రొద్దుటూరులోని తన బంధువులు చనిపోగా ఆ ఇంటిలో దీపం చూడడానికి సోమవారం స్కూటర్‌పై బయలుదేరాడు. ప్రొద్దుటూరుకు వెళ్లి ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు. పోట్లదుర్తి గ్రామ సమీపానికి రాగానే పులివెందుల డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో రామక్రిష్ణ తల పగలి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చెరుకున్నారు. మృత దేహన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు.