పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ముంపు గ్రామాల్లో సోమవారం పోలీసులు ఆంక్షలు విధించారు.
పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ముంపు గ్రామాల్లో సోమవారం పోలీసులు ఆంక్షలు విధించారు. బయటివారు ముంపు గ్రామాల్లోకి ప్రవేశిస్తే కేసు నమోదుకు చేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.
చెక్‌పోస్టుల ఏర్పాటుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి. ముంపు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో ముంపు గ్రామాల గిరిజనులు భయాందోళనలో ఉన్నారు.