అనారోగ్యంతో విశ్రాంత ఎంపీడీఓ మృతి | retire mpdo ramarao dies | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో విశ్రాంత ఎంపీడీఓ మృతి

Published Sat, Nov 12 2016 10:45 PM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM

అనారోగ్యంతో విశ్రాంత ఎంపీడీఓ మృతి

అనారోగ్యంతో విశ్రాంత ఎంపీడీఓ మృతి

చిలమత్తూరు : మండలంలోని విశ్రాంత ఎంపీడీఓ రామారావు (72) అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందారు. కొన్ని రోజులుగా ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వ్యాధి తీవ్రత ఎక్కువై మరణించారని కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌ రామారావు ఇంటికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీడీఓగా రామారావు సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. నవీన్‌నిశ్చల్‌తో పాటు కన్వీనర్‌ సదాశివారెడ్డి, నాయకులు రంగారెడ్డి, నాగిరెడ్డి, రామకృష్ణారెడ్డి, రంగారెడ్డి, నస్రూ, వెంకటేష్, రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement