సాక్షి, సిటీబ్యూరో: పర్యావరణానికి హానికలగని రీతిలో సహజరంగులతో మట్టిగణపతులను తయారు చేసేవారికి పీసీబీ బహుమతులు అందజేయనుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో నివాస సముదాయాలు, కాలనీలు, అసోసియేషన్లు, ఎన్‌జీఓలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయనున్నారు.
తాము తయారు చేసే మట్టిగణపతులను సెప్టెంబరు 7న సాయంత్రం 5 గంటలలోగా సనత్‌నగర్‌లోని పీసీబీ కేంద్ర కార్యాలయానికి పంపించాలని ఒక ప్రకటనలో కోరారు. ఇందులో తయారీదారుల వివరాలు, చిరునామా, కాంటాక్ట్ ఫోన్ నెంబరు ఉండాలని పేర్కొన్నారు. ఎంపికైన వారికి బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.