- జనగామ కేంద్రంగా బ్లాక్ దందా
- నలుగురు ఏజెంట్ల కనుసన్నల్లో వ్యాపారం
‘బియ్యం’ పక్కదారి
Published Sun, Sep 11 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM
జనగామ : రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఈ పథకం దళారుల పాలిట వరంగా మారింది. బియ్యం తరలింపుపై రెవెన్యూ, పోలీ సు అధికారులు మండలాలు, గ్రామాల్లో నిఘా వేయడంతో బియ్యం కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. దీంతో గ్రామాల్లో ఇప్పటి వరకు రూ.14 పలికిన కిలో బియ్యం ధర సింగిల్ డిజి ట్‌కు పడిపోయింది. ఇదే అదనుగా భావించిన కొందరు జనగామ కేంద్రంగా చేసుకొని, నలుగురు దళారుల కనుసన్నల్లో ఈ వ్యాపారం జోరు గా సాగిస్తున్నారు.
రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు బియ్యం చేరుతున్నప్పటికీ, బ్లాక్ మార్కెట్‌కు ఎలా వస్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని చోట్ల డీలర్ల మాయాజాలం, మరికొన్ని చోట్ల రిటైల్ అమ్మకాలతో సబ్సిడీ బియ్యం ప్రైవేటు మార్కెట్ వైపు వస్తున్నాయి. గ్రామాలు, తండాల నుంచి నేరుగా రేషన్ బియాన్ని కొనుగోలు చేసి జనగామ పట్టణంలోని రహస్య ప్రదేశాల్లో ఉన్న తమ గోదాం లకు తరలిస్తున్నారు. గ్రామాల్లో బియ్యం కొనుగోలు చేసేవారు లేకపోవడంతో దళారులు కిలో బియ్యానికి రూ.6 నుంచి రూ. 8 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ బియ్యం మాఫియా నల్లగొండ జిల్లా ఆలేరు, మెదక్ జిల్లా సిద్దిపేట, మడికొండతో పాటు హైదరాబాద్, కాకినాడ, రాజ మండ్రి పట్టణాలకు రాత్రికి రాత్రే బియ్యాన్ని తరలిస్తోంది. జనగామలోని పలు ఏరియాల్లోని గోదాముల్లో వేల క్వింటాళ్ల రేషన్ బియ్యం స్టాక్ ఉన్నట్లు సమాచారం.
Advertisement
Advertisement