మేడికొండూరు: గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల వద్ద శుక్రవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అంబులెన్సు డ్రైవర్ చనిపోయాడు. గుంటూరు నుంచి కారంపూడి వైపు వెళ్తున్న అంబులెన్సును పేరేచర్ల కాల్వ సమీపంలో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్సు డ్రైవర్ విశ్వకాంత్(29) అక్కడికక్కడే చనిపోయాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని సమాచారం. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అంబులెన్సును ఢీకొన్న లారీ..
Published Sat, May 21 2016 9:41 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement