రోడ్డు ప్రమాదాలను నివారించాలి
రోడ్డు ప్రమాదాలను నివారించాలి
Published Sat, Oct 22 2016 1:32 AM | Last Updated on Thu, Mar 21 2019 7:28 PM
నెల్లూరు(పొగతోట): రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో రోడ్డు భద్రత కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నాలజీ పెరిగినా రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాలతో అనేక మంది మరణిస్తున్నారని ఫలితంగా కుటుంబాలు అనాథలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలు అ«ధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అతివేగం, రాంగ్‌సైడ్ పార్కింగ్‌లతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. వాటిని నివారించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సూచించారు. ఎస్పీ విశాల్‌గున్ని మాట్లాడుతూ జాతీయ రహదారి పక్కన మద్యం దుకాణాలు ఉండడం ప్రమాదాలకు ఓ కారణమన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను జియో టాగింగ్ చేశామన్నారు. సంబంధిత అధికారులు జియో టాగింగ్ వివరాలు తీసుకోవచ్చునని తెలిపారు. అనంతరం మైనింగ్ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఏండీ ఇంతియాజ్, డీటీసీ శివరామ్‌ప్రసాద్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement