డేంజర్ వీల్స్
-
రోడ్లపైకి కేజీవీల్స్‌తో ట్రాక్టర్లు
-
దెబ్బతింటున్న రోడ్లు
-
పట్టించుకోని అధికారులు
చెన్నూర్ రూరల్ : ప్రభుత్వం ఎంత హెచ్చరించినా ట్రాక్టర్ల యజమానుల తీరు మారడం లేదు. రోడ్లపైకి ఇష్టారాజ్యంగా కేజీవీల్స్ అమర్చిన ట్రాక్టర్లను నడుపుతున్నారు. దీంతో గ్రామీణ రోడ్లు దెబ్బతింటున్నాయి. గ్రామాల్లో వరినాట్లు ముమ్మరమయ్యాయి. ట్రాక్టర్లకు కేజీవీల్స్‌ను తొడిగి పొలాలను దయ్ము చేస్తున్నారు.
రైతుల డిమాండ్ దష్ట్యా కేజీవీల్స్‌ను తొలగించకుండానే ట్రాక్టర్లను వాటి యజమానులు రోడ్లపై యథేచ్ఛగా తిప్పుతున్నారు. నిబంధనల ప్రకారం రోడ్లపై ట్రాక్టర్లను తిప్పి వలసి వస్తే కేజీవీల్స్‌లను తొలగించాలి. లేదా రోడ్లు దెబ్బతినకుండా వాటికి రబ్బరు తొడిగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ట్రాక్టర్ల యజమానులు కేజీవీల్స్‌ను తొలగించకుండా, కనీస జాగ్రత్తలు పాటించకుండా నడిపిస్తూ నిబంధలను తుంగలో తొక్కుతున్నారు.
మండలంలోనూ అదే పరిస్థితి...
మండలంలోని ఆయా గ్రామాల్లో నిబంధనలు పాటించకుండానే రోడ్లపై కేజీవీల్స్‌తో ట్రాక్టర్లను నడిపిస్తున్నారు వాటి యజమానులు. గ్రామాల్లో ప్రజల సౌకర్యార్థం ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్ శాఖ వారు లక్షల రూపాయలు వ్యయంతో రోడ్లను నిర్మిస్తున్నారు. ఎంతో కాలం మన్నాల్సిన రోడ్లు కేజీవీల్స్ కారణంగా దెబ్బతింటున్నాయి.
ముఖ్యంగా వర్షాకాలంలో అధిక సంఖ్యలో కేజీవీల్స్ ట్రాక్టర్లు నడుస్తుండడంతో రోడ్లు దెబ్బ తింటున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రోడ్లు, గ్రామాల్లోని రోడ్లు గుంతల మయంగా మారుతున్నాయి.