లెక్కిస్తానంటూ నొక్కేశాడు..
లెక్కిస్తానంటూ నొక్కేశాడు..
Published Fri, Sep 9 2016 10:43 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
వేములవాడ : బ్యాంకు వాళ్లు ఇచ్చిన సొమ్ములో చెడిపోయిన నోట్లు వచ్చాయని, వాటిని లెక్కిస్తామని రైతును మాయలో పడేసి రూ.13వేలు అపహరించిన సంఘటన స్థానిక ఆంధ్రాబ్యాంకులో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితుడు హన్మాజీపేటకు చెందిన రైతు డి.లక్ష్మణ్ వ్యవసాయ అవసరాల కోసం శుక్రవారం ఉదయం ఆంధ్య్రాబ్యాంకులోకి వచ్చాడు. తన ఖాతాలోంచి రూ.40 వేలు డ్రా చేసుకున్నాడు. సొమ్మును తన బ్యాగ్‌పై పెట్టి లెక్కిస్తున్నాడు. అక్కడికి చేరుకున్న గుర్తు తెలియని వ్యక్తి రైతుతో మాట కలిపాడు. డబ్బులో చిరిగినవి, చెల్లకుండాపోయినవి ఉన్నాయన్నాడు. సరిచూడాలని రైతు ఆ వ్యక్తికి డబ్బు ఇచ్చాడు. దానిని లెక్కిస్తున్నట్లు నటిస్తూనే కొంత తస్కరించి ఆగంతకుడు బ్యాంకు నుంచి జారుకున్నాడు. కాసేపటి తర్వాత ఆ సొమ్మును రైతు మళ్లీ లెక్కింగా రూ.13 వేలు తక్కువగా వచ్చాయి. ఈ విషయాన్ని బ్యాంకు మేనేజర్ రవిశర్మ దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బ్యాంకుకు చేరుకని సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించారు. అందులో నలుగురు అనుమానా స్పదంగా కనిపించడంలో గాలింపు చేపట్టారు.
Advertisement
Advertisement