నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా | ruling in friendly governs | Sakshi
Sakshi News home page

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా

Published Sun, Jul 24 2016 8:25 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా - Sakshi

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా

 
  • –స్నేహపూర్వకపాలన అందిస్తా..పారదర్శకంగా పనిచేస్తా
  • –త్వరలో డయల్‌ యువర్‌ కలెక్టర్‌ ప్రవేశపెడతా
  • –ప్రభుత్వం నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయను
  • –ప్రభుత్వ భూములను పరిరక్షిస్తా..
  • –‘సాక్షి’తో ప్రవీణ్‌కుమార్‌
  • –నేడు కలెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ
సాక్షి, విశాఖపట్నం :
‘తమ సమస్యల చెప్పుకునేందుకు ప్రజలు నన్ను ఎక్కడైనా ఎప్పుడైనా సరే నేరుగా కలవొచ్చు. మాట్లాడొచ్చు..ఎలాంటి ఆంక్షలు ఉండవు. కార్యాలయంలోనే కాదు..బంగ్లాలో కూడా నిత్యం వారికి అందుబాటులో ఉంటా’నని విశాఖ జిల్లా కొత్త కలెక్టర్‌గా నియమితులైన ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు.ఫ్రెండ్లీ గవర్నెన్స్‌(స్నేహపూర్వక)పాలన అందిస్తా.. మరింత పారదర్శకంగా పని చేస్తా. జీవీఎంసీలో మాదిరిగానే త్వరలో డయుల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించే యోచన ఉందన్నారు. సోమవారం బాధ్యతలు స్వీకరించనున్న ప్రవీణ్‌కుమార్‌ ఆదివారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
 
ప్రశ్నః–ఒకే జిల్లాలో మూడు కీలక పోస్టులపై మీ అభిప్రాయం?
జః–నేను రెండేళ్ల పాటు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేశా..గడిచిన 20 నెలలుగా జీవీఎంసీ కమిషనర్‌గా పనిచేస్తున్నా..ఇప్పుడు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నా. ఒకే జిల్లాలో మూడుకీలక పోస్టుల్లో పనిచేసే అరుదైన అవకాశం నాకు లభించడం ఆనందంగా ఉంది.ఇలాంటి అవకాశం ఎవరికి రాదు. కలెక్టర్‌ పోస్ట్‌ అనేది చాలెంజింగ్‌ పోస్ట్‌. నాకు అప్పగించిన బాధ్యతను చాలెంజ్‌గా తీసుకొని ప్రభుత్వం నాపై ఉంచిన నమ్మకాన్ని ఏమాత్రం వమ్ముచేయకుండా పని చేస్తాను.ప్రజలకు మెరుగైన సేవలందిస్తాను.
 
ప్రశ్నః–యువరాజ్‌తో మీకున్న అనుబంధం?
జః–కేంద్ర సర్వీసులకు వెళ్తున్న జిల్లా కలెక్టర్‌ యువరాజ్‌తో జిల్లాలో నాలుగేళ్ల అనుబంధం ఉంది. నేను జేసీగా పనిచేస్తున్నప్పుడు ఆయన వుడా వైస్‌ చైర్మన్‌గా ఉన్నారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన చూపిన బాటలోనే నేను నడుచుకుంటాను.
 
ప్రశ్నః–జిల్లాపై మీకున్న అవగాహన ?
జః–విశాఖ సిటీతో సహా జిల్లాపై నాకు స్పష్టమైన అవగాహన ఉంది. జిల్లాలోసగం జనాభా విశాఖ సిటీలో ఉంటే మిగిలిన జనాభా గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంది. ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కడ ఏ సమస్యలున్నాయి? వాటిని ఏ విధంగా పరిష్కరించాలో నాకు బాగాతెలుసు..
ప్రశ్నః–స్మార్ట్‌సిటీప్రాజెక్టుల పరిస్థితి?
జః–జీవీఎంసీకి కూడా నేనే ప్రత్యేక అధికారి కావడంతో స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులపై కూడా ప్రత్యేక దష్టి పెడతాను. జీవీఎంసీలో నేను తీసుకొచ్చిన సంస్కరణలన్నీ కొనసాగుతాయి. స్మార్ట్‌సిటీ కోసం నా ఆలోచనలన్నీ కొత్తగా బాధ్యతలు చేపడుతున్న హరినారాయణన్‌తో కలిసి ఆచరణలో పెట్టేందుకుకషి చేస్తా
ప్రశ్నః–ల్యాండ్‌గ్రేబర్స్‌ సమస్యపై ?
జః–నిజమే..ల్యాండ్‌గ్రాబర్స్‌ సమస్య ఎక్కువగా ఉంది. సిటీ పరిధి రోజురోజుకు పెరగడం...భూముల విలువ కూడా విపరీతంగా పెరుగుతుండడంతో గ్రాబర్స్‌ బెడద ఎక్కువగా ఉంది. వారిపై ఉక్కుపాదం మోపుతా ప్రభుత్వ భూముల పరిరక్షణకు పెద్దపీట వేస్తాను.  జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన సొమ్ముతో కొనుగోలు చేసిన భూముల కబ్జాకు పాల్పడే వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకునేలా కషిచేస్తాను.
ప్రశ్నః–పారిశ్రామిక రంగంపై ఎలాంటి దష్టి పెడతారు?
జః–ఇండస్ట్రియల్‌ సమ్మిత్‌లో విశాఖలో లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదిరాయి. వాటన్నింటిని ఆచరణలో పెట్టేందుకు కషి చేస్తా. పరిశ్రమలు వచ్చేందుకు అవసరమైన ఎన్విరాన్‌మెంట్‌ క్రియేట్‌చేస్తాను.త్వరలో జాతీయస్థాయి బ్రిక్స్‌ మీట్‌ జరుగనుంది. జనవరిలో పార్టనర్‌షిప్‌మీట్‌ జరుగనుంది. పారిశ్రామిక రంగాభి వద్ధిపై ప్రత్యేకదష్టి పెడతాను..
ప్రశ్నః–జీవీఎంసీలో మాదిరిగా జిల్లా పాలనలో ప్రత్యేక ముద్ర ?
జః–తప్పకుండా ఉంటుంది..కలెక్టర్‌ యువరాజ్‌ బాటలోనే పనిచేస్తూమరింత పారదర్శకంగా ప్రతీసంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలను అమలు చేస్తాను. జేసీ నివాస్, డీఆర్వో చంద్రశేఖర్‌ వంటి మంచి అధికారులున్నారు.వారితో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తా.
ప్రశ్నః–గ్రామీణ ప్రాంతానికి సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే వాదనపై?
జః–అదేం లేదు. విశాఖ సిటీవేగంగా అభివద్ధి చెందుతుంది. విభజనతర్వాత విశాఖ సిటీపై ఫోకస్‌ ఎక్కువగా ఉన్న మాట వాస్తవమే. అంతేకాని గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలకు ప్రాధాన్యత లేదనడం సరికాదు.
ప్రశ్నః–మౌలిక సదుపాయాల కల్పనపై మీ ఆలోచన?
జః–ఇప్పటికే జిల్లాలో ఆర్ధికసంఘం నిధులతో పెద్ద ఎత్తునసీసీ రోడ్లు, ఉపాధి హామీలో పెద్దఎత్తున అభివద్ధి పనులు జరుగుతున్నాయి.హుద్‌హుద్‌ తుఫాన్‌ పునర్నిర్మాణ కార్యక్రమాలకోసం కేంద్రంతో పాటు ప్రపంచ బ్యాంకు నుంచి పెద్ద ఎత్తున నిధులు రాను న్నందున వాటితో విశాఖ సిటీతో పాటుS గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు అవసర మైన మౌలిక సదుపాయాల కల్పనకు కషి చేస్తాను. 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement