కష్టపడిన అధికారులను ప్రోత్సహిస్తా
కష్టపడిన అధికారులను ప్రోత్సహిస్తా
Published Tue, Jul 26 2016 12:19 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
మహారాణిపేట: జిల్లా అభివద్ధికి కష్టపడి పని చేసిన అధికారులను ప్రోత్సహిస్తానని అలాగే పని చేయని అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. మన జిల్లాలో ఉన్న ప్రభుత్వ విభాగాలు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ శాఖల కన్నా అన్నింటా ముందుండేలా పోటీపడాలని అందుకు తగ్గట్టు ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రతి శాఖ ఇండికేటర్స్ (సూచికలు) తయారు చేసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్‌గా సోమవారం పదవీ భాద్యతలు చేపట్టిన తరువాత కలెక్టరేట్ సమావేశమందిరంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి కలెక్టర్ హోదాలో హాజరైన అధికారులనుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు తీరునుబట్టి విభాగాల వారీగా అధికారుల పని తీరును అంచనా వేస్తానన్నారు. అందుకు తాను ప్రణాళికలు సిద్ధం చేస్తానన్నారు. గ్రీవెన్స్‌సెల్‌లో భాగంగా ప్రతి సోమవారం ప్రజలనుంచి సమస్యలను తెలుసుకునేందుకు డయల్ యువర్ కలెక్టర్ అనే కార్యక్రమాన్ని పెట్టనున్నట్లు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఉదయం 10గంటల నుంచి అరగంట సేపు ప్రజల సమస్యలను ఫోన్ ద్వారా తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కషి చేస్తానన్నారు. ఒక్కో వారం ఒక్కో ప్రభుత్వ శాఖకు సంబందించిన అంశాలపై ఫిర్యాదులును ఫోన్‌లో స్వీకరిస్తామన్నారు. ఆయాశాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన గ్రీవెన్స్ పరిష్కారంలో వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మూడు రోజుల్లో చేసే పనిని ఒక రోజులో చేసేందుకు అధికారులు ప్రయత్నించాలన్నారు. రాష్ట్రంలో పెద్దజిల్లాల్లో విశాఖ ఒకటని ఇక్కడ పనిచేసే అవకాశం రావడం మన అదష్టంగా భావించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సారి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు అన్ని విభాగాలతో సమీక్ష చేసే అవకావం ఉందని దానికి అధికారులంతా సిద్ధంగా ఉండాలన్నారు. అధికారులంతా ఒక జట్టుగా పని చేయాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. గ్రీవెన్స్‌లో జేసీ–2 డి.వెంకటరెడ్డి, పాడేరు సబ్‌కలెక్టర్ శివశంకర్ లోతేటి, డీఆర్వో సి.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement