అక్రమంగా ఇసుక తరలింపు
అక్రమంగా ఇసుక తరలింపు
Published Mon, Jan 30 2017 11:40 PM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM
5 ట్రిప్పర్లు, 3 జేసీబీలు స్వాధీనం
కర్నూలు సీక్యాంప్: ప్రభుత్వ నిబంధనలకు పాతరేస్తూ కర్నూలు మండలం నిడ్జూరు గ్రామంలో కొందరు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న తాలూకాపోలీసులు, రెవెన్యూ సిబ్బంది దాడి చేసి 5ట్రిప్పర్లు, 3జేసీబీలను పట్టుకున్నారు. నిడ్జూరులోని తుంగభద్ర నదిలో అధికారికంగా ఇసుక రీచ్ ఉంది. ట్రాక్టర్లకు మాత్రమే ఆ రీచ్‌కు అనుమతి ఉంది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలను పెట్టి టిప్పర్లతో ఇసుక రవాణా చేస్తుండటంతో దాడి చేసి బాధ్యులపై కేసు నమోదు చేసి ఆ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తాలుకా ఎస్‌ఐ గిరిబాబు, ఆర్‌ఐ షాలిబాషా తెలిపారు.
Advertisement
Advertisement