ఇసుకాసురులను ఉపేక్షించం
ఇసుకాసురులను ఉపేక్షించం
Published Sun, Jun 4 2017 10:50 PM | Last Updated on Tue, Sep 5 2017 12:49 PM
- డీఎస్పీ సుప్రజ హెచ్చరిక
- 15 ట్రాక్టర్లు సీజ్, రూ. 15లక్షల జరిమానా
- 24 మందిపై కేసు, 18 మంది అరెస్టు,
నందికొట్కూరు: కృష్ణానది నుంచి ఇసుకను ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ సుప్రజ హెచ్చరించారు. మండల పరిధిలోని మల్యాల, శాతనకోట సమీపంలోని కృష్ణానది నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న వారిపై ఆదివారం డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు. 15 ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ విలేకరులకు వెల్లడించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఇసుక అక్రమ తవ్వకాలపై నిఘా పెట్టినట్లు తెలిపారు. ట్రాక్టర్లను సీజ్ చేసి ఒక్కో ట్రాక్టర్‌కు రూ. లక్ష ప్రకారం విధించినట్లు తెలిపారు. 26 మందిపై కేసు నమోదు చేశామని, అందులో 18 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు చెప్పిన డీఎస్పీ.. వారిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. దాడుల్లో ఇన్‌చార్జి సీఐ కృష్ణయ్య, ఎస్‌ఐలు లక్ష్మినారాయణ, సుబ్రమాణ్యం, అశోక్, సుధాకర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement