మా కూలీ మాకివ్వండి | sanitation workers protest | Sakshi
Sakshi News home page

మా కూలీ మాకివ్వండి

Aug 25 2016 8:54 PM | Updated on Sep 4 2017 10:52 AM

మా కూలీ మాకివ్వండి

మా కూలీ మాకివ్వండి

మా కూలీ డబ్బులు మాకు ఇవ్వాలంటూ పుష్కరాల పారిశుధ్య పనుల్లో పాల్గొన్న కూలీలు స్పష్టం చేశారు. పుష్కరాల పనులకు రోజుకు రూ. 400 కూలీ ఇచ్చే ఒప్పందంతో ఒక కాంట్రాక్టరు బయటి ప్రాంతాల నుంచి మహిళా కూలీలను తీసుకొచ్చాడు.

ఘరానా కాంట్రాక్టరుకు మహిళా
కూలీల హెచ్చరిక 
రామవరప్పాడు :
మా కూలీ డబ్బులు మాకు ఇవ్వాలంటూ పుష్కరాల పారిశుధ్య పనుల్లో పాల్గొన్న కూలీలు స్పష్టం చేశారు. పుష్కరాల పనులకు రోజుకు రూ. 400 కూలీ ఇచ్చే ఒప్పందంతో ఒక కాంట్రాక్టరు బయటి ప్రాంతాల నుంచి మహిళా కూలీలను తీసుకొచ్చాడు. పుష్కరాలు ముగిశాక... రోజుకు రూ. 200 లే ఇస్తానని కాంట్రాక్టర్‌ అడ్డం తిరగడంతో సుమారు 15 మంది మహిళా కార్మికులు భగ్గుమన్నారు. ఎక్కడి నుండో ఇక్కడికి వచ్చి రాత్రింబవళ్లు పని చేశామని, ఇప్పుడు తీరా రోజుకు 200లే ఇస్తామనడం ఎంతవరకూ సమంజసమని కాంట్రాక్టర్‌ తరుపు వ్యక్తితో వాదనకు దిగారు. రాత్రుళ్లు ప్రభుత్వ పాఠశాలల్లో పడుకుని నానా ఇబ్బందులు, అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అవసరమైతే కార్పొరేషన్‌ ముందు ధర్నా చేస్తాని చెప్పారు. పరిస్థితి అదుపు తప్పడంతో కాంట్రాక్టర్‌ వారితో ఫోన్లో మాట్లాడి రేపటిలోగా మీ కూలి మీకిస్తాననడంతో ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగింది. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement