
ఎస్‌బీఐ ఎక్స్‌టెన్షన్ కౌంటర్
ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థాన సన్నిధిలో ఎస్‌బీఎస్ తన సేవలను అందించడం సంతోషంగా ఉందని బ్యాంక్ పరిపాలనా కార్యాలయ డీజీఎం దీప్‌చంద్ అన్నారు. మహా మండపంలోని 5వ అంతస్తులో బ్యాంక్ ఎక్స్‌టెన్షన్ కౌంటర్ బుధవారం బ్యాంక్ డీజీఎం, అర్బన్ రీజినల్ మేనేజర్ గరికపాటి వెంకట్ ప్రారంభించారు. దేవస్థాన ఉద్యోగులందరూ ఈ కౌంటర్ ద్వారా సేవలు పొందవచ్చన్నారు. కౌంటర్ గాంధీనగర్ శాఖ పరిధిలో పని చేస్తుందని తెలిపారు. గతంలో భవానీదీక్ష మండపం వద్ద కౌంటర్‌ను ఆలయంలో మార్పులతో 5వ అంతస్తులోకి మార్చినట్లు వివరించారు. కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ అడ్మిన్ గోపీనాథ్, విజయవాడ చీఫ్ మేనేజర్ వంశీకృష్ణ, గాంధీనగర్ శాఖ బ్యాంక్ మేనేజర్ కిశోర్, ఆఫీసర్ అసోసియేషన్ ఏజీఎస్ వీఆర్‌కే మోహన్, స్టాఫ్ యూనియన్ డీజీఎస్ ప్రకాష్, ఏజీఎస్ శ్రీనివాసమూర్తి, కమలాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.