కొంప ముంచిన ఆకతాయితనం
కొంప ముంచిన ఆకతాయితనం
Published Wed, Jan 4 2017 11:39 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
పాఠశాల భవనం పై నుంచి దూకి విద్యార్థికి తీవ్ర గాయాలు
పరిస్థితి విషమం..
కాకినాడ ఆసుపత్రికి తరలింపు
పెద్దాపురం : ఆకతాయితనంతో పాటు సినిమా స్టంట్ల ప్రభావంతో ఓ విద్యార్థి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొం దుతున్నాడు. పెద్దాపురం పట్టణంలోని జవహార్ లాల్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి, స్థానిక కబడ్డీ వీధికి చెందిన గోకేటి మణికంఠ(14) పాఠశాల పై అంతస్తు నుంచి దూకి తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు పెద్దాపురం ప్రభుత్వాçస్పత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం కాకినాడ జీజీహె చ్‌కు తరలించారు. సహచర వి ద్యార్థులు, స్థానికుల కథనం ప్రకారం మణికంఠకు తం డ్రి లేకపోవడంతో తల్లి నాగమణి ఆమె తండ్రి సత్తిరాజు ఇంటి వద్దనే ఉంచి తన కుమారుడు మణికంఠ, కుమార్తెను ఇక్కడే చదివిస్తోంది. పాఠశాలకు వస్తూనే అందరితో ఆకతాయి బెట్టింగ్‌లు, స్నేహితుల తో చాలెంజ్‌లు చేయడం మణికంఠ నిత్యకృత్యం. రెండు రోజుల నుంచి మేడపై నుండి దూకేస్తానంటూ సహచర విద్యార్థులకు చెప్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఇంటికి వెళ్లి చేయి కోసుకుని చూపించాడు. అయినప్పటికీ సహచర విద్యార్థులు హేళనగా దూకుతానంటాడు కానీ దూకడనేలోగానే మణికంఠ పాఠశాల మొదటి అంతస్తు నుంచి దూకేసాడు. దీంతో అతని చాతికి, చేతికి బలమైన గాయమైంది. వెంటనే హెచ్‌ఎం రామారావు, స్థానికులు మణికంఠను ఎదురుగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా వెంటనే పెద్ద ఆస్పత్రికి తీసుకుపొమ్మని చెప్పడం పెద్దాపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి అనంతరం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. పెద్దాపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనపై అనుమానాలు...?
విద్యార్థి మేడపై నుంచి దూకేసిన ఘటనపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చూస్తున్నారు. రెండు పీరియడ్ల మధ్యలో ఉపాధ్యాయుడు వచ్చేలోగా విద్యార్థి మేడపై నుంచి దూకేయడంపై అ ధ్యాపకుల క్రమశిక్షణ ఏమాత్రం ఉందో అర్థమౌతోంది. ఆకతాయితనం, సహచర విద్యార్థులు రెచ్చగొట్టడంతో పాటు ఓ అమ్మాయితో అల్లరిగా ప్రవర్తించడానికే గొప్పకుపోయి తిప్పలు తెచ్చుకున్నాడని చెబుతున్నారు. ఘటన విషయాన్ని విద్యార్థి తల్లికి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించగా ఆమె వేరే గ్రామం వెళ్లడం , ఆ కారణం వల్ల మధ్యాహ్నమే ఆత్మహత్యాయత్నంగా చెయ్యి కోసుకుని పాఠశాలకు రావడం జరిగింది. అయినా అధ్యాపకులు అతన్ని అడగకపోవడం పలు అనుమానాలు తావిస్తున్నది. విద్యార్థి కొలుకుంటే ఈ ఘటనకు కారణాలు తెలిసే అవకాశం ఉంది.
Advertisement