పంచ‘బడి’ంది | schools devid | Sakshi
Sakshi News home page

పంచ‘బడి’ంది

Published Wed, Sep 7 2016 12:20 AM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM

పంచ‘బడి’ంది

పంచ‘బడి’ంది

  •  పాఠశాలలు, ఉపాధ్యాయుల విభజన
  •  మూడు  జిల్లాల్లోకి పాఠశాలలు
  •  కసరత్తు ప్రారంభించిన అధికారులు
  • ఖమ్మం: జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రభుత్వ, ఎయిడెడ్, జిల్లా పరిషత్‌ పాఠశాలలు, ఆయా స్కూల్స్‌లో పనిచేసే ఉపాధ్యాయుల పంపకాలపై జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఏ జిల్లాకు ఎన్ని పాఠశాలలు, ఎంతమంది ఉపాధ్యాయులను కేటాయించాలనే దానిపై అధికారులు లెక్కలు వేస్తున్నారు. కొత్తగూడెం జిల్లాలోకి 18 మండలాలు, 22 మండలాలతో ఖమ్మం, గార్ల, బయ్యారం మండలాలు మహబూబాబాద్‌ జిల్లాలోకి వెళ్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 2,319 ప్రాథమిక పాఠశాలలు, 627 ప్రాథమికోన్నత, 625 ఉన్నత పాఠశాలలు, 15 హయ్యర్‌ సెకండరీ స్కూల్స్‌ (హెచ్‌ఎస్‌ఎస్‌), జూనియర్‌ కళాశాలలు (జేసీ) 141 మొత్తం 3,797 ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నాయి. ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఆశ్రమ పాఠశాలల్లో 11,352 మంది ఉపాధ్యాయులు వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్నారు. 
     
    పాఠశాలల విభజన ఇలా..
    ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
    జిల్లా పీఎస్‌ యూపీఎస్‌ హెచ్‌ఎస్‌ హెచ్‌ఎస్‌ఎస్‌ జేసీ మొత్తం
    –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
    ఖమ్మం 954 313 381 09 71 1,728
    కొత్తగూడెం 1239 288 280 6 60 1,873
    మహ–బాద్‌ 126 26 34 0 10 196
    ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
    మొత్తం 2,319 627 695 15 141 3,797
    –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
    ఉపాధ్యాయుల విభజన ఇలా..
    ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
    జిల్లా ఉపాధ్యాయులు
    ఖమ్మం 5,573
    కొత్తగూడెం 5,355
    మహబూబాబాద్‌ 424
    –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
    ఎలా పంచాలి?
    జిల్లాలోని పాఠశాలలు ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్‌ పరిధిలోకి వెళ్లడంతో అక్కడి ఉపాధ్యాయులను ఏవిధంగా కేటాయించాలి అనేదానిపై అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. ‘స్థానికత ఆధారంగా ఏ మండలం వాసిని అక్కడికే పంపిస్తే బాగుంటుంది’ అని పలువురు అధికారులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘ఏనాడో ఊరు విడిచి వచ్చి ఖమ్మం, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాం.. ఇప్పుడు తిరిగి సొంత మండలాలకు వెళ్లాలి’ అని అనడం సరికాదని పలువురు ఉపాధ్యాయులు వాదిస్తున్నారు. ‘ఉద్యోగరీత్యా జిల్లా ఉమ్మడిగా ఉన్నప్పుడు వచ్చాం..ఇప్పుడు విభజనైతే మా పిల్లల స్థానికత మారుతుంది. కాబట్టి స్థానికతను మార్చొద్దు..’ అని పలువురు ఉపాధ్యాయులంటున్నారు. అత్యధిక మంది ఉపాధ్యాయులు ఖమ్మం, కొత్తగూడెం ప్రాంతాల్లోనే ఉంటున్న దృష్ట్యా వారు ఆయా ప్రదేశాల్లోనే తమను ఉంచాలని కోరుతున్నారు. 
    బోధనేతర సిబ్బందికీ గండం
    ఉపాధ్యాయులే కాదు విద్యాశాఖలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికీ విభజన గండం తప్పడం లేదు. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం, రాజీవ్‌ మాధ్యమిక విద్యామిషన్, సర్వశిక్ష అభియాన్, మోడల్‌ స్కూల్స్, డిప్యూటీ డీఈఓ కార్యాలయం, పలు పాఠశాలల్లో సీనియర్, జూనియర్‌ అసిస్టెంట్లు మొత్తం 200 మందికి పైగా ఉన్నారు. వీరిని సీనియార్టీ ప్రాతిపదికన జిల్లాలకు కేటాయిస్తారనే వార్త రావడంతో ఉద్యోగ సంఘాల నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందచేశారు. ఉద్యోగులకు ఆప్షన్‌ ఇచ్చి జిల్లాల కేటాయింపులు జరపాలని కోరుతున్నారు. ఆప్షన్‌ ఇస్తే అత్యధిక మంది ఖమ్మం జిల్లానే కోరుకుంటే కొత్తగూడెం, మహబూబాద్‌ జిల్లాలకు ఎవరిని పంపాలని అధికారులు అంటున్నారు. తమను వేరే ప్రాంతాలకు పంపిస్తే వచ్చే కొద్దిపాటి వేతనాలతో ఎలా కుటుంబాలను పోషించాలని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో విభజన నిబంధనలు ఎలా ఉండబోతున్నాయి? ఎవరు ఎటువెళ్లాల్సి వస్తుందనే విషయంలో ఆందోళన నెలకొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement