అకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన | scince fare in timmapoor | Sakshi
Sakshi News home page

అకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన

Published Sat, Sep 17 2016 11:39 PM | Last Updated on Sat, Sep 15 2018 7:45 PM

అకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన - Sakshi

అకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన

తిమ్మాపూర్‌: మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర మోడల్‌ స్కూల్‌లో ఇన్‌స్పైర్‌ అవార్డు 2016 రెండు జిల్లాల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు రెండోరోజు శనివారం అనూహ్య స్పందన లభించింది.  కరీంనగర్, నిజామాబాద్‌ నుంచి 172 ఎగ్జిబిట్స్‌ను ప్రదర్శించినట్లు జిల్లా సైన్స్‌ఫేర్‌ అధికారి స్వదేశీ కుమార్‌ తెలిపారు. ప్రదర్శనను మండలంలోని అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతోపాటు కరీంనగర్‌ నగరంలోని పాఠశాలలు, ఇతర పాఠశాలల విద్యార్థులు రావడంతో ప్రాంగణం విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. సాయంత్రం రాష్ట్ర సాంస్కృతిక సారథి కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో నిజామాబాద్‌ డీఎస్‌వో గంగాకిషన్, మండల విద్యాధికారి లక్ష్మణ్‌రావు, న్యాయనిర్ణేతలు, రిసోర్సు పర్సన్లు కిషన్‌రెడ్డి, వెంకన్న, నరేష్, సురేందర్, అనంతాచార్య, శర్మ, రవీందర్‌ పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement