ప్రభుత్వ నిర్లక్ష్యంతో సీమ ఎడారి
బీజేపీ రాష్ట్ర ఉపా«ధ్యక్షుడు కపిలేశ్వరయ్య
పత్తికొండ: ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రాయలసీమ ఎడారిగా మారుతుందని బీజేపీ రాష్ట్ర ఉపా«ధ్యక్షుడు కపిలేశ్వరయ్య చెప్పారు. ఇప్పటికైనా సర్కారు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ప్రజలు నీటి ఎద్దడితో అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో వారానికి ఒకసారి నీళ్లు సరఫరా చేసే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. రిజర్యాయర్ల నుంచి వంద చెరువులకు నీళ్లు ఇస్తామన్న నేతలు ఇంతవరకు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఆనావృష్టితో పంటలు పూర్తిగా ఎండి రైతులు ఆర్థికంగా నష్టపోయారన్నారు. మిర్చిరైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
జిల్లాల్లో తాగునీరు, గ్రాసం సమస్యలతో పాటు చెరువులకు నీరు సరాఫరాపై కొత్త కలెక్టరు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న ఆనాలోచిత నిర్ణయాలతో కర్నూలు జిల్లాకు సాగు, తాగునీరు అందడం లేదన్నారు. దీనిపై సీమప్రజలు స్పందించాలన్నారు.గ్రామ స్థాయిలో బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు హరీష్‌బాబు, జిల్లా ఇన్చార్్జ అంబటి రామకృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి పెరవలి రంగస్వామిగౌడు, జిల్లా ఉపా«ధ్యక్షుడు దండి మల్లికార్జున, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పూనా మల్లికార్జున, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.