ఫిరాయింపులపై 19 నుంచి సెమినార్లు
మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు వెల్లడి
గాంధీనగర్ (విజయవాడ): ‘పార్టీ ఫిరాయింపులు- ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ అనే అంశంపై ఈనెల 19 నుంచి జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో సెమినార్లు నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు తెలిపారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 19న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య భవన్‌లో సెమినార్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సెమినార్‌కు సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి హాజరవుతారని తెలిపారు.
జూన్ 26న విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో జరిగే సెమినార్‌కు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇ.ఎ.ఎస్.శర్మ, జూలై 3న తిరుపతిలోని ఉదయ్ ఇంటర్నేషనల్‌లో జరిగే సెమినార్‌లో మాజీ స్పీకర్ ఆగరాల ఈశ్వరరెడ్డి, జూలై 31న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే సెమినార్‌లో లా కమిషన్ మాజీ చైర్మన్ బీపీ జీవన్‌రెడ్డి పాల్గొంటార ని చెప్పారు. సెమినార్‌లో వచ్చిన వ్యాసాల సంపుటిని జూలై 31న కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి ఆవిష్కరిస్తారని తెలిపారు. ప్రజాస్వామ్యవాదులు సెమినార్లలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
విలువలకు పాతరేస్తున్న ఫిరాయింపులు: వి.లక్ష్మణరెడ్డి
రాజకీయ విలువలకు, ప్రజాస్వామ్య వ్యవస్థకు పార్టీ ఫిరాయింపులు పాతరేస్తున్నాయని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయింపులను రాజకీయ వ్యభిచారంగా అభివర్ణించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని ఆయన ఖండించారు.