ఏడు సబ్‌స్టేషన్లు మంజూరు
రాపూరు : జిల్లాకు ఏడు 132 కేవీ సబ్‌స్టేషన్లు, 33–11 కేవీ సబ్‌స్టేషన్లు 11 మంజూరయ్యాయని, వీటి పనుల త్వరలో ప్రారంభిస్తారని విద్యుత్‌శాఖ సీఈ నందకుమార్ తెలిపారు. ఆధునీకరణ చేసిన రాపూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌ను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు హెచ్‌వీడీఎస్ (వ్యవసాయ రైతులకు మూడు విద్యుత్ మెటార్లకు ఒక ట్రాన్స్‌ఫారం) పథకానికి రూ.320 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. విద్యుత్ సమస్యలుంటే ప్రజలు టోల్‌ఫ్రీ నంబర్ 180042515333 ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. రాపూరు సమీపంలో నిర్మిస్తున్న 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పూర్తయితే విద్యుత్ సమస్య ఉండదని ఇక్కడి నుంచి చుట్టుపక్కల మండలాలకు విద్యుత్ సరఫరాచేస్తామని చెప్పారు. రాపూరుకు ఏఈని పుష్కరాల అనంతరం నియమిస్తామన్నారు. జిల్లాలో విద్యుత్ శాఖలో 1,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వనికి నివేదిక పంపామని చెప్పారు. అనంతరం విద్యుత్‌శాఖ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. పాత బకాయిల వసూళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు.ఆయన వెంట డీఈలు అనీల్‌కుమార్, రాఘవేంద్ర ఇస్మాయిల్, జగదీష్, ఏడీఈ ప్రసాద్, ఏఈ సుబ్రమణ్యం ఉన్నారు.