
పర్యావరణ పరిరక్షణపై లఘుచిత్రం చిత్రీకరణ
పేదరిక నిర్మూలన, పర్యావరణ పరిరక్షణపై ఆదివారం జవహర్‌నగర్‌లో లఘు చిత్రాన్ని చిత్రీకరించారు.
పేదరిక నిర్మూలన, పర్యావరణ పరిరక్షణపై ఆదివారం జవహర్‌నగర్‌లో లఘు చిత్రాన్ని చిత్రీకరించారు. గ్రామీణ ప్రాంతాల్లో జీవించే పేదల స్థితిగతులను కళ్లకుకట్టేలా కొన్ని సన్నివేశాలను చిత్ర డైరెక్టర్ వాసు చిత్రీకరించారు. బాలాజీనగర్‌లోని సబ్‌స్టేషన్ ఆవరణలోని చెత్త కుప్పలో ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. పర్యావరణ పరిరక్షణ, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర దర్శకుడు వాసు తెలిపారు. - జవహర్‌నగర్