సరదాగా ట్రాక్టర్ నడుపుతూ ప్రమాదానికి గురై సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృత్యువాత పడ్డాడు. గూనిపల్లికి చెందిన నారాయణరెడ్డి కుమారుడు యర్రగూడి (మొర్రెప్పగారి) ఎల్లారెడ్డి(25) ముంబైలో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నారు.
= ట్రాక్టర్ బోల్తా పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
బుక్కపట్నం : సరదాగా ట్రాక్టర్ నడుపుతూ ప్రమాదానికి గురై సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృత్యువాత పడ్డాడు. గూనిపల్లికి చెందిన నారాయణరెడ్డి కుమారుడు యర్రగూడి (మొర్రెప్పగారి) ఎల్లారెడ్డి(25) ముంబైలో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నారు. ఈ యువ ఇంజినీర్ దీపావళి పండుగ కోసం గత శనివారం స్వగ్రామానికి వచ్చాడ. మంగâýæవారం సరదాగా ట్రాక్టర్‌ను నడుపుతూ ఊరు దగ్గర్లో ఉన్న పాత బావిలోకి పల్టీలు కొట్టాడు.దీంతో ట్రాక్టర్ ఎల్లారెడ్డిపై పడటంతో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే 108 వాహనంలో పుట్టపర్తి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.