
ఆగదు మా పోరాటం
- అరెస్టులు.. బెదిరింపులతో ఉద్యమాన్ని ఆపలేరు
- వైఎస్సార్‌సీపీ నాయకుల అరెస్టు.. పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
హిందూపురం అర్బన్ : అరెస్టులు బెదిరింపులతో హోదా ఉద్యమాన్ని ఆపలేరని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, బీ బ్లాక్ కన్వీనర్ మల్లికార్జున ధ్వజమెత్తారు. ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచే దిశగా శాంతియుతంగా పోరాటం చేస్తుంటే పోలీసుల బలగంతో పోరాటాన్ని అణచివేయాలని చూస్తున్న ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా శుక్రవారం వైఎస్సార్‌సీపీ నాయకులు దశలు వారీగా ధర్నాలు చేపట్టారు.
స్థానిక అంబేడ్కర్ సర్కిల్‌లో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బసిరెడ్డి, బీసీ సెల్ రాము, కౌన్సిలర్ నాగభూషణరెడ్డి, మహిళా కన్వీనర్ నాగమణి తదితర నాయకులు ధర్నా చేపట్టారు. ఇంతలో సీఐ ఈదూర్‌బాషా, ఎస్‌ఐ, పోలీసులు అక్కడికి వచ్చి నాయకులను బలవంతంగా లాగేసి వాహనంలో వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం కౌన్సిల్ ఫ్లోర్‌లీడర్ శివ, కౌన్సిలర్లు ఆసీఫ్‌వుల్లా, రజనీ మరికొందరు నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని కూడా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పోలీసుల అక్రమ నిర్బంధాలను నిరసిస్తూ నాయకులు పోలీస్‌స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 15 ఏళ్లు ప్రత్యేక హోదా అవసరమని చెప్పిన చంద్రబాబు కేసుల భయంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎదుట మోకరిల్లారని విమర్శించారు. ప్రజలకు ప్రయోజం చేకూర్చే హోదాను పక్కన పెట్టి పాలకులు ప్యాకెట్లు నింపుకోవడానికి ప్యాకేజీల కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఫజులూ రెహెమాన్, కౌన్సిలర్లు జబీవుల్లా, మండల నాయకులు షామింతాజ్, మూర్తి, రమేష్, నర్సిరెడ్డి, షేక్షావలి, రియాజ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.