కబడ్డీ క్రీడాకారులకు వైద్య సేవలు
Published Thu, Oct 6 2016 8:59 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
బాలాజీచెరువు (కాకినాడ) :
ఎన్టీఆర్ మెమోరియల్ 64వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు సామర్లకోటలోని పల్లంబీడు మైదానంలో గురువారం నుంచి ఆదివారం వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి స్త్రీ, పురుషుల విభాగాల నుంచి 26 జట్లు విచ్చేశాయి. ఈ నేపథ్యంలో జేఎన్‌టీయూకే నుంచి స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ పీఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ సురేంద్ర, డాక్టర్ దీపక్‌ల వైద్య బృందం క్రీడాకారులకు ప్రాథమిక వైద్యచికిత్సను అందించనున్నారు. క్రీడాకారులు ఆహారం, ఆరోగ్యంపై తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించనున్నారు.
Advertisement
Advertisement