లక్ష్య సాధనకు క్రీడలు | sports day in kmc | Sakshi
Sakshi News home page

లక్ష్య సాధనకు క్రీడలు

Published Fri, Jul 29 2016 12:54 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

sports day in kmc

కర్నూలు(హాస్పిటల్‌): లక్ష్యసాధనలో క్రీడలు ఎంతో ఉపకరిస్తాయని కర్నూలు మెడికల్‌ కాలేజి పూర్వ విద్యార్థి(1975వ బ్యాచ్, మిస్టర్‌ కేఎంసీ) డాక్టర్‌ శ్రీనివాసరావు అన్నారు. కళాశాల 59వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం రాత్రి స్పోర్ట్స్‌డే నిర్వహించారు.  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ తన తండ్రి, అన్న స్ఫూర్తితోనే ఆనాడు క్రీడాకారునిగా రాణించానని గుర్తు చేసుకున్నారు. రోజుకు ఆరు గంటల పాటు వ్యాయామం చేసేవానని చెప్పారు. ఆనాడు అలా చేయడంతతో నేడు రోజుకు 230 బటన్‌హోల్‌ ఆపరేషన్లు చేయగలుగుతున్నానని, 1.35లక్షలు ల్యాప్రోస్కోపిక్‌ సర్జరీలు చేశానని తెలిపారు. ఆనాడు అథ్లెటిక్‌ చాంపియన్, కోకో కెప్టెన్, వెయిట్‌ లిఫ్టింగ్‌లలో పతకాలు సాధించినట్లు చెప్పారు. ప్రతి విద్యార్థి రోజూ వ్యాయామం చేయాలని, క్రీడల్లో పాల్గొని శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవాలన్నారు. 
– జిల్లా ఎస్‌పీ ఆకే రవికష్ణ మాట్లాడుతూ వైద్యులు దేవునితో సమానమని, పోలీసు కూడా సామాజిక వైద్యుడన్నారు. ర్యాగింగ్‌ చట్టవ్యతిరేకమని, కళాశాలలో యాంటిర్యాగింగ్‌ స్వా్కడ్‌లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ర్యాగింగ్‌ వల్ల మతి చెందిన రిషితేశ్వరి తల్లిదండ్రుల బాధను ప్రతి విద్యార్థి ఊహించుకోవాలని సూచించారు. సమాజంలో అసాంఘిక కార్యక్రమాలను అరికట్టాల్సిన బాధ్యత పౌరులుగా ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.
– కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జీఎస్‌ రామప్రసాద్‌ మాట్లాడుతూ తమ కళాశాలలో వైద్యవిద్యార్థులు క్రీడలతో పాటు ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారని చెప్పారు. కళాశాలలో జిమ్‌ను ఆధునీకరిస్తామని, యోగా, మెడిటేషన్‌ బందాలను ఏర్పాటు చేస్తామన్నారు. కళాశాలలోని సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 
– అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వీరాస్వామి, రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ భవానీప్రసాద్‌ మాట్లాడారు. అనంతరం వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. 
– కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జోజిరెడ్డి, మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్‌ సీఐ మధుసూదన్‌రావు, ఫిజికల్‌ డైరెక్టర్‌ రామకష్ణప్రసాద్, ప్రోగ్రామ్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ లక్ష్మిబాయి తదితరులు పాల్గొన్నారు. 
 
క్రీడల్లో పతిభ చూపిన విద్యార్థులు
ఇంటర్‌ యూనివర్సిటీ క్రీడల్లో పల్మనాలజి పీజీ విద్యార్థి డాక్టర్‌ పీడీ ఆంజనేయులు ఒక బంగారు, రెండు వెండిపతకాలు సాధించారు. క్రికెట్‌లో ఆర్‌. రాఘవప్రీతమ్, జి. సాయిమనీష్‌రెడ్డి, కె.భార్గవ్, సౌత్‌జోన్‌ ఇండియన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ వాలీబాల్‌లో ఎన్‌ఆర్‌ హరీష్, వీడీఎల్‌ రాహుల్, బాల్‌బాడ్మింటన్,కబడ్డీలో బి. మహేష్‌నాయక్, తేనె సుధాకర్, కబడ్డీలో వై. గణేష్, తేనె సుధాకర్, మ్యాత్యూ, క్రికెట్‌లో పి. రాఘవప్రీతమ్, జి. సాయిమనీష్‌రెడ్డి, ఎ.రవికిరణ్, వాలీబాల్‌లో అనిరుద్‌నాయక్, ఆర్‌. వినయ్, ఆలిండియా చెస్‌ టోర్నమెంట్‌లో ఆర్‌. హేమంత్‌ పాల్గొని ప్రతిభ కనపరిచారు.  
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement