871.4 అడుగులుగా శ్రీశైలం డ్యాం నీటిమట్టం
Published Thu, Sep 8 2016 10:30 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైల జలాశయ నీటిమట్టం గురువారం సాయంత్రం సమయానికి 871.4 అడుగులుగా నమోదైంది. జలాశయానికి ఎలాంటి ఇన్‌ఫ్లో లేదు. జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 13,588 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. తెలంగాణా ప్రాంతంలోని భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జునసాగర్‌కు 7,063 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి హంద్రీనివాసుజల స్రవంతికి 2,025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 4,500 క్యూసెక్కులను వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 147.6340 టీఎంసీల నీరు నిల్వగా ఉంది.
Advertisement