దారికి దూరం | Starting of new liquor stores from today | Sakshi
Sakshi News home page

దారికి దూరం

Published Sat, Jul 1 2017 4:13 AM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM

దారికి దూరం

దారికి దూరం

- నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం
ప్రధాన రహదారులకు 500 మీటర్లపైనే దుకాణాలు
 
బద్వేలు/కడప అర్బన్‌
జాతీయ, రాష్ట్ర రహదారులకు అర కిలో మీటరు దూరంలో మద్యం దుకాణం ఏర్పాటు చేసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో నేటినుంచి వీటిని తొలగించనున్నారు. అనుమతులు వచ్చిన వారు నేటినుం చి కొత్త దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. వాహన చోదకులు మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారని..రాష్ట్ర, జాతీయ రహదారుల్లో ప్రమాదా లు ఎక్కువ జరుగుతున్నాయని  పలు అధ్యయనాల్లో తేలింది. ఈ నేపథ్యంలో ఈ రహదారులకు దూరంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఖరాఖండిగా చెప్పింది. 500మీటర్ల లోపు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని పేర్కొంది.
 
ఇప్పటికే ఏడాది ఆలస్యం
జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీట ర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండాలని ఏడాది కిందటే సుప్రీంకోర్టు పేర్కొం ది. పాత దుకాణాదారులకు మరో ఏడాది స మయం ఉండటంతో వారంతా కోర్టును ఆశ్రయించారు. తాము ప్రభుత్వానికి భారీగా ఫీ జు చెల్లించామని, దుకాణాలను దూరంగా ఏ ర్పాటు చేస్తే నష్టపోతామని వివరించారు.  దీంతో వారి గడువు ముగిసే వరకు వెసులు బాటు ఇచ్చారు. శుక్రవారంతో గడువు ము గిసింది. ప్రస్తుత దుకాణాలు పొందిన వా రు సుప్రీం ఆదేశాలనుసారం రహదారుల కు 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో మొత్తం 255 దుకాణాలు ఉండగా నిన్నటి వరకు వీటిలో 189 రాష్ట్ర, జాతీయ రహదారులపై ఉ న్నాయి. ఇవన్నీ ప్రస్తుతం తొలగిపోనున్నా యి. ఈ ఏడాది మార్చి చివర్లో కొత్తవాటిని లాటరీ పద్ధతిన ఎంపిక చేశారు. ఈ దుకాణాల యజమానులు శనివా రం నుంచి కొత్తవి ఏర్పాటు చేయనున్నారు.
 
దోపిడీ, కల్తీకి తెర పడేనా...! 
ఇప్పటి వరకు జిల్లాలో మద్యందుకాణాదారులు ఎమ్మార్పీ కంటే రూ.10 నుంచి రూ.20  అదనపు ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఇటీవల అనుమతులు గడువు దగ్గర పడటం, ఎక్సైజ్‌ కమిషనర్‌గా బాద్యతలు చేపట్టిన అధికారి అదనపు ధరపై ఉక్కుపాదం మోపడంతో గత నెలరోజులుగా ఎమ్మార్పీకే విక్రయిస్తున్నారు. పోరుమామిళ్ల, బద్వేలు, మైదుకూరు ప్రాంతాల్లో కల్తీ మద్యం కూడా ఎక్కువే. అధికారుల దాడుల్లో కల్తీ మద్యం దొరకడం, కేసులు పెట్టడం కూడా జరిగింది. ప్రస్తుతం దుకాణాలు దక్కించుకున్న వారిలో పాతవారు కూడా ఉన్నారు. వీరు తమ ఆగడాలను అలాగే కొనసాగిస్తారో.. లేదో అన్నది తేలాల్సి ఉంది. జులై నుంచి ఏర్పాటు చేస్తున్న దుకాణాల ఫీజులు భారీగా తగ్గాయి. ఇప్పటి వరకు కట్టిన ఫీజు మూడింటిలో రెండింతలు తగ్గింది. 50 వేల నుంచి 3 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో మద్యం దుకాణం ఫీజు గతంలో రూ.50 లక్షలు ఉండగా ప్రస్తుతం అది రూ.11.25లక్షలకు చేరింది. 25 వేల నుంచి 50 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో పాత ఫీజు రూ.30 లక్షలు ఉండగా ప్రస్తుతం రూ.10లక్షలు చేశారు.
 
ఈ నిబంధనలు తప్పవు
కొత్త మద్యం దుకాణాలు ఏర్పాటులో మరిన్ని నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలకు 100 మీటర్ల దూరంలో దుకాణం ఏర్పాటు చేసుకోవాలి. దేవాదాయశాఖ ద్వారా గుర్తింపు పాందిన ఆలయాలకు 100 మీటర్ల అవతల ఏర్పాటు చేయాలి. వక్ఫ్‌బోర్డు, గుర్తింపు ఉన్న మసీదులు, మైనార్టీ సంక్షేమ శాఖ గుర్తింపు ఉన్న చర్చిలకు 100 మీటర్ల లోపు దుకాణాలు ఏర్పాటు చేయకూడదని నిబంధన పెట్టారు.
 
500 మీటర్ల అవతల ఉండాల్సిందే 
కొత్తగా ఏర్పాటే చేసే దుకాణాలు రాష్ట్ర, జాతీయ రహదారులకు 500 మీటర్ల అవతల ఉండాల్సిందే. నేటి నుంచి అన్ని ప్రాంతాల్లో   పరిశీలిస్తాం. నిబంధనలకు అనుకూలంగా ఏర్పాటు చేయకపోతే చర్యలు తీసుకుంటాం. పాత దుకాణాలు కూడా మూసి వేయాల్సిందే.
 – చైతన్య మురళి, డీసీ, ఎక్సైజ్‌శాఖ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement