జాతీయ రహదారిపై విడిది కేంద్రాలు
జాతీయ రహదారిపై విడిది కేంద్రాలు
Published Sun, Jan 1 2017 12:31 AM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM
ఏలూరు (మెట్రో) : జిల్లాలో జాతీయ రహదారిపై ప్రతి 10 కిలోమీటర్లకూ ఒక విడిది కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు పటిష్టమైన ప్రణాళిక అమలు చేస్తున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో శనివారం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, రైల్వే అభివృద్ధి పనుల ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారి పొడవునా ప్రయాణికులకు సరైన విశ్రాంతి సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారి కోసం విడిది కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. తాడిపూడి, చింతలపూడి, యనమదుర్రు డ్రెయిన్ వంటి సాగునీటి ప్రాజెక్టులన్నీ వచ్చే మార్చినాటికి పూర్తయ్యేలా అధికారులు పనులు వేగవంతం చేయాలన్నారు. కాంట్రాక్టర్లు పనిచేయరని, అధికారులు వారిని బ్లాక్‌లిస్టులో పెట్టమంటే పెట్టకుండా చోద్యం చూస్తుంటారని కలెక్టర్ మండిపడ్డారు. ఈ సమావేశంలో జేసీ పులిపాటి కోటేశ్వరరావు, ఏజేసీ షరీఫ్, డీఆర్‌వో కె.హైమావతి, పోలవరం ఎస్‌ఈ శ్రీనివాసయాదవ్, ఐటీడీఏ పీవో షాన్ మోహన్, ఆర్డీవోలు నంబూరి తేజ్‌భరత్, లవన్న, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ నిర్మల, వ్యవసాయశాఖ జేడీ సాయిలక్షీ్మశ్వరి, ఉద్యాన శాఖ ఏడీలు దుర్గేష్, విజయలక్ష్మి, ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.
పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత
ఏలూరు (మెట్రో) : జిల్లాలో పర్యాటక రంగానికి అధిక ప్రాముఖ్యతనిచ్చి పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించటమే కాకుండా వారికి వసతి, బోటింగ్, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా పర్యాటకాభివృద్ధి కౌన్సిల్ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్లేరు, గుడివాకలంకలతో పాటు గోష్పాదక్షేత్రం, వలంధరరేవు, రామగుండంపార్కు, శంభుని పార్క్, ఇతర స్థలాలను పర్యాటకులు వచ్చి తిలకించడానికి వీలుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. మొదటి, రెండు, మూడు ఫేజ్‌లలో రూ.361.8 లక్షలకు పరిపాలనామోదం ఇచ్చినట్టు చెప్పారు. మొదటి ఫేజ్‌లో రూ.155.78 లక్షలు, రెండో ఫేజ్‌లో రూ.158.40 లక్షలు, మూడో ఫేజ్‌లో రూ.47.5 లక్షలు వివిధ పనులకు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. కొల్లేరు సరస్సులో పక్షులు కూర్చొవడానికి వీలుగా పొడవాటి దిమ్మెలకు, పర్యాటకులకు వసతి సౌకర్యాలు నిమిత్తం రూ.86 లక్షలు పనులను వెంటనే ప్రారంభించాలని అటవీశాఖ డీఎఫ్‌వోను కలెక్టరు ఆదేశించారు. చించినాడ బ్రిడ్జి దగ్గర బోటింగ్ సదుపాయం, ఆకివీడు దగ్గర చేనేత పరిశ్రమాభివృద్ధి, ఎమ్యూజ్‌మెంట్ పార్క్ తదితర కార్యక్రమాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో టూరిజం శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస్, సెట్‌వెల్ ఇన్ చార్జి సీఈవో, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసులు, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, డీఎఫ్‌ఓ ఎన్ .నాగేశ్వరరావు, టూరిజం అధికారి పట్టాభి పాల్గొన్నారు.
Advertisement
Advertisement