review with officers
-
ఏపీ సంస్కృతిని ప్రతిబింబించేలా ‘లేపాక్షి’ ఉత్పత్తులు
సాక్షి, అమరావతి: లేపాక్షికి సంబంధించి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఏర్పాటు చేస్తామని చేనేత,జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఆయన అధ్యక్షతన బుధవారం చేనేత, జౌళి శాఖపై మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యుత్తమ హ్యాండ్లూమ్ క్లస్టర్ల ఫొటోలు, అత్తుత్యుమంగా ఉండడానికి గల కారణాలపై తర్వాతి సమావేశానికి సమగ్ర వివరాలు అందించాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. పవర్ లూమ్ యూనిట్లకు అందించే పవర్ టారిఫ్ వివరాలు, ముద్ర రుణాలను మంత్రి గౌతమ్‌రెడ్డి ఆరా తీశారు. ఆన్లైన్ మార్కెటింగ్‌తో విక్రయాలను మరింత పెంచాలని సూచించారు. ఈ-కామర్స్ ద్వారా వచ్చే ఆర్డర్లను మూడు రోజుల్లో డెలివరీ చేసే స్థాయికి చేరాలని స్పష్టం చేశారు. ఖాదీ ప్రోగ్రామ్, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (పీఎమ్ఈజీపీ), ఎంటర్‌ప్యూనర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఈడీపీ)లపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా 17 షోరూంలు (ఏపీయేతరవి 3) కోవిడ్ కారణంగా కొంత ఇబ్బంది కలిగినా స్వయంగా నడపగలిగినవే అన్నీ అని వివరించారు. తోలుబొమ్మలు, ఆదివాసీ పెయింటింగ్స్, ఏటికొప్పాక, కొండపల్లి, బంజారా ఎంబ్రయిడరీ వస్తువుల తయారీలో మరింత శిక్షణనందిస్తే నాణ్యత ప్రమాణాలు పెరుగుతాయని మంత్రి చెప్పారు. ఎక్కువ నాణ్యత, రకరకాల డిజైన్ల తయారీతో ఎక్కువ మందిని ఆకర్షించేలా ఉండాలని పేర్కొన్నారు. ఒక జిల్లా ఒక వస్తువు విషయంలో మరింత చొరవ పెరగాలని తెలిపారు. తిరుపతి బాలాజీ, పుట్టపర్తి సాయిబాబా వంటి దేవుడి విగ్రహాల తయారీలో నైపుణ్యం పెంచి.. ఎక్కువ ప్రతిమల తయారీపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ప్రతిబింబించేలా బ్రాండింగ్, బ్రాండ్ అంబాసిడర్ ఉంటుందని మంత్రి గౌతమ్‌రెడ్డి చెప్పారు. సమావేశంలో ఆప్కో చైర్మన్ చల్లపల్లి మోహన్ రావు, హస్తకళల అభివృద్ధి సంస్థ (ఏపీహెచ్డీసీఎల్) ఛైర్మన్ బండిగింజల విజయలక్ష్మి, చేనేత, జౌళి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్, జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
విద్యాలయాల్లో కరోనా జాగ్రత్తలు పాటించాలి: మంత్రి ఆదిమూలపు
సాక్షి, అమరావతి: పాఠశాలలతో పాటు ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు కోవిడ్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. ఆగష్టు 16వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి కళాశాలలు ప్రారంభించిన దృష్టా గురువారం మంత్రి సమీక్ష చేశారు. విద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖాధికారులతో ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. కరోనా పరిస్థితులతోపాటు ఇప్పటివరకు వాక్సిన్ వేయించుకున్న ఉపాధ్యాయుల వివరాలు, ప్రస్తుతం పాజిటివ్‌గా నమోదైన విద్యార్ధుల, ఉపాధ్యాయుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 97.5 శాతం ఉపాధ్యాయులకు టీకా వేశారని మిగిలిన 7,388 మందికి వెంటనే వేసి 100 శాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సురేశ్ ఆదేశించారు. 100 మందికి వాక్సిన్ ఒకేసారి వేయడానికి విద్యా శాఖ ఏ కేంద్రాన్ని ప్రతిపాదిస్తే అక్కడ వాక్సిన్ వేసే ఏర్పాటు చేస్తామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులు ఆయా జిల్లా వైద్యాధికారిని సంప్రదిస్తే చాలని స్పష్టం చేశారు. పాఠశాలల్లో విద్యార్థులు భౌతిక దూరం పాటిస్తే, చాలావరకు కరోనా వ్యాప్తిని నివారించవచ్చని తెలిపారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తప్పక పాటించాలని సూచించారు. విశ్వ విద్యాలయాలు, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలు వంటి వాటిలో సిబ్బందికి, విద్యార్థులకు కూడా వాక్సినేషన్‌కు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీశ్ చంద్ర, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఇంటర్మీడియెట్ విద్య కమిషనర్ రామకృష్ణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు వెట్రిసెల్వి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ఉద్యానం’ పంట పండాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఉద్యాన పంటల సాగు రైతుల ఆదాయాన్ని పెంచే వ్యూహాలను అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, విజ్ఞానాన్ని రైతులకు అందించేందుకు జాతీయ, అంతర్జాతీయ నైపుణ్య సంస్థలు, వర్సిటీల సహకారాన్ని తీసుకోవాలన్నారు. నిరంతర పరిశోధనలు, సమాచార మార్పిడి ద్వారా ప్రయోగాలు కొనసాగించాలని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త వంగడాలు, సాగు సమస్యల పరిష్కారం, ఫుడ్ ప్రాసెసింగ్‌లో కొత్త టెక్నాలజీ, ప్రాసెసింగ్‌కు అనుకూల రకాల సాగే లక్ష్యంగా ఈ పరిశోధనలుండాలని దిశా నిర్దేశం చేశారు. ఉద్యాన, సెరికల్చర్, వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం జగన్ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. మంచి మార్కెటింగ్‌తో పరిష్కారాలు.. కర్నూలు జిల్లాలో మంచి మార్కెటింగ్ అవకాశాలున్న ఉల్లి సాగుపై దృష్టి పెట్టి నాణ్యమైన రకం పండించేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఫుడ్ ప్రాసెసింగ్‌కు అనుకూలమైన ఉల్లి రకాలు సాగు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. టమాటాలను రోడ్డుమీద పారవేయడం, ధరలేక పొలాల్లోనే రైతులు ఉల్లిపంటను వదిలేసే దుస్థితి తలెత్తకూడదన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు. ఇలాంటి పరిస్థితులు ఇక ఎక్కడా కనిపించకుండా మంచి మార్కెటింగ్‌తో సమస్యకు పరిష్కారాలను చూపాలని ఆదేశించారు. 25 చోట్ల వేగంగా ప్రాసెసింగ్ యూనిట్ల పనులు ఫుడ్ ప్రాసెసింగ్‌లో భాగంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో వివిధ వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణ పనులను మొదలు పెట్టాలని సీఎం సూచించారు. అక్టోబర్ నుంచి గ్రౌండింగ్ చేపట్టడం ద్వారా నిర్మాణ పనులు దశల వారీగా ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఇవి ఆర్నెల్లలో పూర్తవుతాయని చెప్పారు. ఉద్యాన పంటలను గరిష్టంగా సాగు చేయడం ద్వారా ‘్రçఫూట్ బౌల్ ఆఫ్ ఇండియా’గా ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి సాధించిందని అధికారులు చెప్పారు. కొబ్బరి, అరటి, బొప్పాయి, మిరప, టమాటా, ఉల్లి, బత్తాయి పంటల సాగు వివరాలను అధికారులు సీఎంకు అందచేశారు. వీటి సాగుపై ప్రత్యేక దృష్టి సారించాల్సిందిగా సీఎం ఆదేశించారు. కొబ్బరి, బొప్పాయి, టమాట సాగులోనూ, ఉత్పాదకతలోనూ దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిచిందని, టిష్యూ కల్చర్ విధానంలో అరటిసాగు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మిరప సాగు విస్తీర్ణం పెరగాలి.. రాష్ట్రంలో మిరప సాగు విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు ప్రాసెసింగ్‌పై మరింత శ్రద్ధ తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీనికోసం అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. కొబ్బరికి మంచి ధర.. నిరంతర పరిశోధనలు కొబ్బరి రైతులకు మంచి ధర లభించేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొబ్బరిపై నిరంతరం పరిశోధనలు జరగాలని హార్టికల్చర్ విశ్వవిద్యాలయం వీసీకి ముఖ్యమంత్రి సూచించారు. కొబ్బరి సాగులో సమస్యలపై పరిశోధనలు కొనసాగిస్తూ అవసరమైతే అత్యుత్తమ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో కొబ్బరికి ‘వైట్ ఫ్లై’ లాంటి తెగుళ్లు సోకటాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉంటూ విదేశాల్లో జరుగుతున్న అధ్యయనాలపై కన్నేసి ఉంచాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల సహకారం, పరస్పర సమాచార మార్పిడి వల్ల చక్కటి పరిశోధనలకు ఆస్కారం ఉంటుందన్నారు. పరిశోధన ఫలితాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దీనివల్ల మంచి వంగడాలతో పాటు సాగులో ఉత్పన్నమయ్యే సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయన్నారు. ప్రాసెసింగ్ రంగంలో వస్తున్న మార్పులు, సాంకేతిక పరిజ్ఞానానికి తగినట్లుగా చర్యలు చేపట్టాలన్నారు. అధిక ఆదాయాన్నిచ్చే పంటల సాగు.. అధిక ఆదాయాన్నిచ్చే పంటల సాగువైపు రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సీఎం సూచించారు. బోర్ల కింద వరి, సుబాబుల్, పొగాకు, చెరకు, మొక్కజొన్న లాంటి పంటల సాగుని క్రమంగా తగ్గించి ఉద్యాన పంటల సాగు వైపు మొగ్గుచూపేలా రైతులను ప్రోత్సహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2020 – 21లో ఇలా1,42,565 ఎకరాల్లో అదనంగా ఉద్యాన పంటల సాగు చేపట్టినట్లు అధికారులు వివరాలను ముఖ్యమంత్రికి అందించారు. ఈ ఏడాది 1,51,742 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగును లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. సలహాలు, పరిష్కారాలు డిజిటల్లో.. రైతుల సందేహాలపై ఇస్తున్న సలహాలు, పరిష్కారాలను వీడియో రికార్డ్ చేసి డిజిటల్ ప్లాట్‌ఫాం మీదకు తేవాలని సీఎం ఆదేశించారు. వీటిని అప్లోడ్ చేయడం ద్వారా మిగిలిన రైతులు సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని, దీనికోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించుకోవాలన్నారు. మార్కెటింగ్ అవకాశాలున్న వంగడాలన్నీ.. మార్కెటింగ్ చేయగలిగే అవకాశం ఉన్న ప్రతి వంగడాన్ని రైతుల్లోకి విరివిగా తీసుకెళ్లాలని సీఎం జగన్ సూచించారు. రైతులు కష్టపడి సాగుచేసిన తర్వాత వాటిని మార్కెటింగ్ చేసేందుకు ఇక్కట్లు ఎదుర్కొనే దుస్థితి రాకూడదన్నారు. పువ్వుల సాగు (ఫ్లోరీ కల్చర్) రైతుల విషయంలో సరైన మార్కెటింగ్ అవకాశాలు, ప్రాసెసింగ్‌పై దృష్టి పెట్టాలన్నారు. ఆర్బీకేల ద్వారా తుంపర, బిందు సేద్యం లబ్ధిదారుల ఎంపిక తుంపర సేద్యం, బిందుసేద్యం పరికరాల మంజూరులో పారదర్శకతకు పెద్దపీట వేయాలని, ఆర్బీకేల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరగాలని సీఎం జగన్ ఆదేశించారు. రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం ద్వారా రేట్లు గణనీయంగా తగ్గి నాణ్యమైన పరికరాలు రైతులకు అందుబాటులోకి వస్తాయన్నారు. అవినీతికి తావులేని విధానంలో రైతులకు పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సెరికల్చర్‌కు ప్రోత్సాహం సెరికల్చర్ సాగు విధానం, ఉత్పాదకతపై సీఎంకు అధికారులు వివరాలు అందచేశారు. పట్టు గూళ్ల విక్రయాల్లో ఇ–ఆక్షన్ విధానం తేవడం ద్వారా దేశవ్యాప్తంగా వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని, రైతులకు మంచి ధరలు వస్తున్నాయని తెలిపారు. 1,250కి పైగా ఆర్బీకేల పరిధిలో పట్టు పురుగులు పెంచుతున్న రైతులు ఉన్నట్లు చెప్పారు. వీటిపై ప్రత్యేక దృష్టి సారించి సెరి కల్చర్‌ను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. షెడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టడం వల్ల చిన్న రైతులకు సెరికల్చర్ సాగుకు ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. మంత్రి కన్నబాబు, వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, హార్టి కల్చర్ కమిషనర్ ఎస్.ఎస్.శ్రీధర్, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ వీసీ అండ్ ఎండీ డాక్టర్ జి.శేఖర్‌బాబు, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో ఎల్.శ్రీధర్‌రెడ్డి, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పీవో డాక్టర్ హరినాథ్‌రెడ్డి, వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ టి.జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ విద్యార్థులకు ఆర్బీకేల్లో శిక్షణ.. రైతు భరోసా కేంద్రాలకు వచ్చినప్పుడు రైతులు వ్యక్తం చేసే సందేహాలను నివృత్తి చేసేలా తగిన వ్యవస్థ ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ఆర్బీకేల్లో ఉండే అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఆ సందేహాలను తీర్చేలా ఉండాలన్నారు. దీనివల్ల రైతులు, అగ్రికల్చర్ అసిస్టెంట్ల మధ్య అనుబంధం బలపడి మంచి వాతావరణం ఉంటుందని, తద్వారా అనుకున్న ఫలితాలను సాధించగలుగుతామన్నారు. రైతుల సందేహాలు, సమస్యలను పరిష్కరించేలా అగ్రికల్చర్ అసిస్టెంట్లు ప్రయత్నించాలన్నారు. రైతులు వెల్లడించిన సమస్యలు, సందేహాలు ఏమిటి? వాటికి ఎలాంటి పరిష్కారం చూపారన్న అంశాన్ని ఆర్బీకేల్లో తనిఖీల సందర్భంగా కచ్చితంగా పరిశీలించాలని సీఎం ఆదేశించారు. రైతుల సమస్యలకు వేగంగా పరిష్కారాలు చూపే విధంగా నిర్దిష్ట నిర్వహణ ప్రణాళిక (ఎస్వోపీ) ఉండాలని, ఈ విషయంలో జవాబుదారీతనం ఉండాలని స్పష్టం చేశారు. అగ్రికల్చర్ విద్యార్థులు ఆర్బీకేల్లో కనీసం నెలరోజులు తప్పనిసరిగా పనిచేసేలా ఇంటర్న్‌షిప్ నిబంధన విధించడం ద్వారా వాటి పనితీరు, కార్యక్రమాలపై వారికి అవగాహన, పరిజ్ఞానం పెరుగుతుందన్నారు. -
కరోనా: నేడు ప్రధాని మోదీ సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి తీవ్రరూపం దాలుస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం కట్టడి చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు మంగళవారం సమీక్ష చేయనున్నారు. క్షేత్రస్థాయి అధికారులతో నేడు ప్రధాని మోదీ సమీక్ష చేస్తారని పీఎంఓ అధికారులు ప్రకటించారు. పలు రాష్ట్రాలు, జిల్లాల అధికారులతో వర్చువల్‌గా ప్రధాని సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కరోనా కట్టడి చర్యలను ప్రధానికి అధికారులు వివరించనున్నారు. కరోనా తీవ్రంగా ఉన్న 9 రాష్ట్రాల్లోని 46 జిల్లాల అధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొంటున్నట్లు పీఎంఓ వెల్లడించింది. -
లాక్డౌన్ పెట్టాలా లేదా అన్నది సీఎం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్ధితులపై పోలీస్ ఉన్నతాధాకారులతో చర్చించాం.. అయితే లాక్డౌన్ పెట్టాలా లేదా అన్నది సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు అని తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. త్వరలో రాష్ట్రంలోని పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. సమీక్ష తర్వాత లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. అయితే లాక్డౌన్ పెట్టడం సీఎం కేసీఆర్‌కు ఇష్టం లేదని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, రాత్రికర్ఫ్యూ అమలుపై బుధవారం పోలీస్ శాఖ అధికారులతో హోంమంత్రి మహమూద్ అలీ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. లాక్డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు చాలా వస్తాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేసులను అసరాగ చేసుకుని బ్లాక్ మార్కెట్ దందా విచ్చలవిడిగా కొనసాగుతుందని పోలీసుల అధికారులకు చెప్పారు. ఆక్సిజన్ నుంచి రెమిడిసివర్ ఇంజెక్షన్ వరకూ జరుగుతున్న బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. చదవండి: రాబోయే 3, 4 వారాలు చాలా కీలకం.. మరింత జాగ్రత్త చదవండి: కరోనా మూడో దశకు సిద్ధంగా ఉండాలె: కేంద్రమంత్రి వ్యాఖ్యలు పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న హోం శాఖ మంత్రి మహమూద్ అలీ -
జాతీయ రహదారిపై విడిది కేంద్రాలు
ఏలూరు (మెట్రో) : జిల్లాలో జాతీయ రహదారిపై ప్రతి 10 కిలోమీటర్లకూ ఒక విడిది కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు పటిష్టమైన ప్రణాళిక అమలు చేస్తున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో శనివారం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, రైల్వే అభివృద్ధి పనుల ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారి పొడవునా ప్రయాణికులకు సరైన విశ్రాంతి సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారి కోసం విడిది కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. తాడిపూడి, చింతలపూడి, యనమదుర్రు డ్రెయిన్ వంటి సాగునీటి ప్రాజెక్టులన్నీ వచ్చే మార్చినాటికి పూర్తయ్యేలా అధికారులు పనులు వేగవంతం చేయాలన్నారు. కాంట్రాక్టర్లు పనిచేయరని, అధికారులు వారిని బ్లాక్‌లిస్టులో పెట్టమంటే పెట్టకుండా చోద్యం చూస్తుంటారని కలెక్టర్ మండిపడ్డారు. ఈ సమావేశంలో జేసీ పులిపాటి కోటేశ్వరరావు, ఏజేసీ షరీఫ్, డీఆర్వో కె.హైమావతి, పోలవరం ఎస్ఈ శ్రీనివాసయాదవ్, ఐటీడీఏ పీవో షాన్ మోహన్, ఆర్డీవోలు నంబూరి తేజ్‌భరత్, లవన్న, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, ఆర్అండ్బీ ఎస్ఈ నిర్మల, వ్యవసాయశాఖ జేడీ సాయిలక్షీ్మశ్వరి, ఉద్యాన శాఖ ఏడీలు దుర్గేష్, విజయలక్ష్మి, ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఏలూరు (మెట్రో) : జిల్లాలో పర్యాటక రంగానికి అధిక ప్రాముఖ్యతనిచ్చి పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించటమే కాకుండా వారికి వసతి, బోటింగ్, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా పర్యాటకాభివృద్ధి కౌన్సిల్ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్లేరు, గుడివాకలంకలతో పాటు గోష్పాదక్షేత్రం, వలంధరరేవు, రామగుండంపార్కు, శంభుని పార్క్, ఇతర స్థలాలను పర్యాటకులు వచ్చి తిలకించడానికి వీలుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. మొదటి, రెండు, మూడు ఫేజ్‌లలో రూ.361.8 లక్షలకు పరిపాలనామోదం ఇచ్చినట్టు చెప్పారు. మొదటి ఫేజ్‌లో రూ.155.78 లక్షలు, రెండో ఫేజ్‌లో రూ.158.40 లక్షలు, మూడో ఫేజ్‌లో రూ.47.5 లక్షలు వివిధ పనులకు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. కొల్లేరు సరస్సులో పక్షులు కూర్చొవడానికి వీలుగా పొడవాటి దిమ్మెలకు, పర్యాటకులకు వసతి సౌకర్యాలు నిమిత్తం రూ.86 లక్షలు పనులను వెంటనే ప్రారంభించాలని అటవీశాఖ డీఎఫ్‌వోను కలెక్టరు ఆదేశించారు. చించినాడ బ్రిడ్జి దగ్గర బోటింగ్ సదుపాయం, ఆకివీడు దగ్గర చేనేత పరిశ్రమాభివృద్ధి, ఎమ్యూజ్మెంట్ పార్క్ తదితర కార్యక్రమాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో టూరిజం శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస్, సెట్వెల్ ఇన్ చార్జి సీఈవో, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసులు, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, డీఎఫ్ఓ ఎన్ .నాగేశ్వరరావు, టూరిజం అధికారి పట్టాభి పాల్గొన్నారు. -
మరిన్ని డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు
ఏలూరు సిటీ : జిల్లాలో మరిన్ని డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డీసీహెచ్ఎస్ డాక్టర్ కె.శంకరరావును కలెక్టర్ కె.భాస్కర్ ఆదేశించారు. గురువారం వైద్య శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాడేపల్లిగూడెం, ఏలూరులలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, తణుకులో కూడా ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వాటితో పాటు జంగారెడ్డిగూడెం, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, కొవ్వూరులో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డీసీహెచ్ఎస్ను ఆదేశించారు. జిల్లాలో మాతా శిశు మరణాలు, ప్రభుత్వ,ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎంతమంది గర్భిణులు ప్రసవిస్తున్నారు, ఎంతమంది పిల్లలు మరణిస్తున్నారనే వివరాలను కచ్చితంగా సేకరించాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. మలేరియా, డెంగీ, వైరల్ ఫీవర్స్ తదితర వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో కె.కోటేశ్వరిని ఆదేశించారు. అంగన్వాడీ చిన్నారులకు నూతన విద్యావిధానం జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో చదివే చిన్నారులకు నీతికథలు, సూక్తులు తెలియచేసి వారిలో చదువుపై ఆసక్తి పెంచే నూతన విద్యను అందించేందుకు ప్రత్యేక నీతి కథలు పుస్తకాన్ని 15 రోజుల్లో సిద్ధం చేయాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ విద్యాశాఖాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో విద్యాశాఖా పనితీరుపై అధికారులతో సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాలంటే కోడిగుడ్డు, అన్నం పెట్టే శిబిరాలుగా మాత్రమే చూడవద్దని చిన్న వయసు నుంచే నీతికథలు బోధించి వారిని ఆకట్టుకునే రీతిలో విద్య అందించాలని కలెక్టర్ కోరారు. 15న అంతర్జాతీయ హ్యాండ్‌వాష్ 15న ప్రపంచ వ్యాప్తంగా చేతులు పరిశుభ్రపరిచే దినోత్సవాన్ని జరుపుతున్న దృష్ట్యా ప్రతి పాఠశాలలోనూ ఈ కార్యక్రమాన్ని పటిష్టవంతంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 435 హైస్కూల్స్‌లో పూర్తి స్థాయిలో కంప్యూటర్లను ఏర్పాటు చేసి 7,200 మంది ఉపాధ్యాయులు విధిగా బయోమెట్రిక్ హాజరు వేసేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు జేసీ ఎంహెచ్. షరీఫ్, డీఈవో డి.మధుసూదనరావు, సర్వశిక్షాభియాన్ పీవో వి.బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.