ఓవరైతే కోర్టుకే.. | Strict rules on Overload vehicles | Sakshi
Sakshi News home page

ఓవరైతే కోర్టుకే..

Published Fri, Nov 18 2016 12:58 AM | Last Updated on Thu, May 24 2018 1:57 PM

ఓవరైతే కోర్టుకే.. - Sakshi

ఓవరైతే కోర్టుకే..

వాహనాలపై రవాణా శాఖ కొరడా
డీటీసీకి ఆదేశాలు జారీ చేసిన కమిషనర్
నాలుగోసారి పట్టుబడితే యాజమానిపై  క్రిమినల్ కేసు  

విజయనగరంఫోర్ట్: అధికలోడు( ఓవర్‌లోడ్)తో వెళ్లే వాహనాలపై కఠిన చర్యలు చేపట్టేందుకు రవాణశాఖ సిద్ధమవుతుంది. ఈమేరకు ఆశాఖ కమిషనర్ డిప్యూటీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.  ఇంతవరకు అధికబరువుతో ప్రయాణించే వాహనాలకు అపరాధ రుసం విధించి వదిలేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒకే వాహనం ఆరు నెలల కాలంలో మూడోసారి పట్టుబడితే కేసు నమోదు చేసి  కోర్టులో ప్రాసిక్యూషన్‌కు పెడతారు. నాలుగోసారి పట్టుబడితే వాహన యాజమానిపై క్రిమినల్ కేసు పెడతారు. గతంలో కూడా ప్రాసిక్యూషన్‌కు పెట్టి అధికలోడు వాహనాలపై చర్యలు తీసుకునే వారు. కొంతమంది మంత్రులు రవాణశాఖ అధికారులపై ఒత్తిడి తేవడంతో ప్రాసిక్యూషన్‌కు పెట్టాలన్న నిబంధనను ఎత్తివేశారనే ఆరోపణులు వినిపిస్తున్నారుు. తాజగా మళ్లీ ప్రాసిక్యూషన్ పెట్టాలని రవాణశాఖ అధికారులు నిర్ణరుుంచడంతో  వాహన యాజమానుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నారుు.

అధికబరువు ఆదాయవనరులు...
అధిక బరువు( ఓవర్‌లోడ్) వాహనాలే యాజమానులకు, అధికారులకు ఆదాయ వనరు. జిల్లాలో ఒడిశా సరిహద్దు ఉండడంతో అధికబరువు కాసులు వర్షం కురుపిస్తోంది.  అధిక బరువుతో వెళ్లే వాహనాలను అధికారులు చూసిచూడనట్టు వదిలేసేవారు. ఇందుకుగాను ప్రతీ నెల కొంతమొత్తాన్ని మామ్మళ్లు అధికారులకు ఇస్తున్నట్టు గుసగుపలు వినిపిస్తున్నారుు.జిల్లాలో గ్రావెల్, ఇసుక, కంకర, ఇనుము తదితర సరుకులు ఇతర ప్రాంతాలకు వెలుతున్నారుు.

ప్రాసిక్యూషన్‌పై అనుమానాలు...
గతంలో అధికలోడు వాహనాలను కోర్టులో ప్రాసిక్యూషన్‌కు పెట్టేవారు. మళ్లీ ఇప్పుడు ఈనిబంధనను అధికారులు పూర్తి స్థారుులో అమలు చేస్తారో లేక అధికార పార్టీ నేతల ఒతిళ్లకు తలొగ్గి వెనక్కి తీసుకుంటారో వేచిచూడాలి.
 
ఆదేశాలు వచ్చారుు
అధికలోడ్‌తో మూడోసారి పట్టుబడిన వాహనాలకు కోర్టులోప్రాసిక్యూషన్‌కు పెట్టాలనే కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చారుు. ఆదేశాలను అమలు చేయడానికి చర్యలు తీసుకుంటాం.- భువనగురికృష్ణవేణి, ఉపరవాణకమిషనర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement