Overload
-
సారూ.. అధికలోడ్ లారీలను అరికట్టరూ!
సాక్షి, సిటీబ్యూరో: రహదారులను పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తున్న ఓవర్‌లోడ్ లారీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నగరానికి చెందిన ఓ కార్పొరేటర్ ఇబ్రహీంపట్నం ఆర్టీఏ అధికారులను వేడుకున్న తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెద్ద అంబర్పేట్ వద్ద సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తున్న మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ సాయిబాబా కాళ్లపైన పడి అభ్యర్ధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పరిమితికి మించిన బరువుతో ప్రతిరోజూ వందలకొద్దీ లారీలు ఔటర్‌రింగ్ రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయని, దీంతో రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమవుతున్నాయని హయత్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పలుమార్లు ఇబ్రహీంపట్నం ఆర్టీఏ అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. సోమవారం కంకర, డస్ట్ లారీల అసోసియేషన్లతో కలిసి పెద్ద అంబర్పేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో ఆ రహదారిపై అధికలోడ్‌తో లారీలు వెళ్తున్నాయని ఆర్టీఏ అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో ఎంవీఐ సాయిబాబా ఆధ్వర్యంలో ఆర్టీఏ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఓవర్‌లోడ్ లారీలు రాకపోకలు సాగిస్తున్నాయని, వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కార్పొరేటర్ అధికారులను నిలదీశారు. అనేకసార్లు అధికారులను కలిశామని, ఇప్పటికైనా వాటిని అడ్డుకోవాలని కోరుతూ ఎంవీఐ సాయిబాబా కాళ్లపై పడ్డారు. ఇదంతా వీడియోలో రికార్డు చేసి వాట్సప్, ఫేస్బుక్లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఓవర్‌లోడ్ వాహనాలపైన త్వరలోనే మంత్రులు కేటీఆర్, మహేందర్రెడ్డిలను సైతం సంప్రదించనున్నట్లు ఈ సందర్భంగా కార్పొరేటర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. తాము ఓవర్‌లోడ్ వాహనాలను ఏ మాత్రం ఉపేక్షించడం లేదని, ఇప్పటి వరకు 300కుపైగా వాహనాలపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నామని ఇబ్రహీంపట్నం ప్రాంతీయ రవాణా అధికారి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. -
ఓవర్‌లోడ్.. అతివేగం.. అజాగ్రత్త
సారంగాపూర్(జగిత్యాల): పరిమితికి మించిన ప్రయాణాలతో ప్రాణాలు పోతున్నా.. ప్రయివేటు వాహనదారులకు పట్టింపు ఉండడం లేదు. ఓ వైపు రహదారి భద్రతవారోత్సవాలు ప్రారంభించి ప్రమాదకర ప్రయాణాలపై అవగాహన కల్పిస్తున్నా.. ఓవర్‌లోడ్ ప్రయాణాలు తగ్గడం లేదు. కరీంనగర్ జిల్లాలో ఆటోబోల్తాపడి 8 మంది మరణించిన ఘటన మరువకముందే జగిత్యాల జిల్లాలో సోమవారం మరో ఘటన జరిగింది. 35మంది ఉపాధిహామీ కూలీలతో వెళ్తున్న ట్రాలీఆటో బోల్తాపడింది. ఆటోలోని 21మంది గాయపడగా.. ఆదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. వీరందరినీ జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలోని బుడిగెజంగాలకాలనీ, బీసీ కాలనీకి చెందిన కూలీలు కొద్దిరోజులుగా ఉపాధిహామీ పనులకు వెళ్తున్నారు. సోమవారం ఉదయం పెంబట్ల గ్రామ శివారుల్లోని పెంబట్ల– రంగపేటమధ్య పెద్దమ్మ ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాం తంలో పనులు నిర్వహించడానికి సుమారు 35 మంది గ్రామానికి చెందిన పార్తం గంగాధర్ ట్రాలీఆటోలో వెళ్లారు. పనులు ముగించుకుని 10 గంటల ప్రాంతంలో ఆటోలో ఇళ్లకు బయల్దేరారు. ఆటో లక్ష్మీదేవిపల్లి గ్రామం దాగటగానే ఓవర్‌లోడ్‌తో కుదుపునకు గురికావడంతో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్‌వేశాడు. దీంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 21 మంది కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రులు వీరే.. ఆటోలో ప్రయాణిస్తున్న కుంట గంగు, పురా ణం మల్లవ్వ, పత్రి రాధ, గిండె లక్ష్మి, పర్సమల్ల బుజ్జి, పత్రి లచ్చవ్వ, పత్రి భీమక్క, మిర్యాల సుమలత, పత్రి కావ్య, మస్తాను దుబ్బరాజు, అనుమండ్ల సునీత, పురాణం మమత, పత్రి చిన్నఎల్లవ్వ, చొప్పరి సుజాత, బొడ్డుపల్లి మల్లవ్వ, సొప్పరి రాజమ్మ, కట్టెకోల దుబ్బరాజు, నారెల్ల ఆశవ్వ, పత్రి భీమక్క, పస్తం గంగమ్మ, మామిడి లక్ష్మి గాయపడ్డారు. పత్తి ఎల్లవ్వ, పురాణం ఎల్లక్క, పత్రి లచ్చవ్వ, పత్రి భీమక్క, పస్తం దుబ్బరాజుకు తీవ్రగాయాలయ్యాయి. సకాలంలో స్పందించిన పోలీసులు విషయం తెలుసుకున్న సారంగాపూర్ ఎస్సై రాజయ్య అక్కడికి చేరుకున్నారు. 108 రావడం ఆలస్యం కావడంతో ప్రయివేటు వాహనాల్లో క్షతగాత్రులను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించా రు. తహసీల్దార్ వసంత, ఎంపీడీవో పుల్లయ్య పరిస్థితి సమీక్షించారు. క్షతగాత్రులను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్ తదితరులు పరామర్శించారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని, ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఇసుక లారీలపై నియంత్రణేది?
► ఓవర్లోడ్తోవెళ్తున్న వాహనాలు ► లైసెన్సులు లేకుండా నడుపుతున్న డ్రైవర్లు ► పెరుగుతున్న ప్రమాదాలు ► మహారాష్ట్ర క్వారీల నిర్వాకం బాన్సువాడ: మహారాష్ట్రలోని ఇసుక క్వారీల కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా ఇసుకను నింపి రాష్ట్ర రాజధానికి తరలిస్తున్నారు. భారీ వాహనాల్లో వస్తున్న ఇసుక బోధన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, మెదక్ మీదుగా హైదరాబాద్‌కు వెళ్తోంది. నియంత్రణ లేకుండా, నిబంధనలు పాటించకుండా ఇసుకను తరలిస్తుండగా రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని ఏస్గీ, గంజ్‌గాం క్వారీల్లో ఇసుకను నింపుతున్నారు. ప్రతీరోజు 100 నుంచి 200 భారీ వాహనాల్లో ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక లారీలు వేంగంగా వెళ్తుండటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇసుకను తరలిస్తున్న కాంట్రాక్టర్లు హెచ్ఎంబీ(హైదరాబాద్–మెదక్–బోధన్) రోడ్డును వినియోగిస్తున్నారు. ఈ రోడ్డుపై ట్రాఫిక్ లేకపోవడంతో రోజూ వందల సంఖ్యలో లారీలు వెళ్తున్నాయి. ఆయా పట్టణాల మీదుగా భారీ వాహనాల రాకపోకలతో రోడ్లు పూర్తిగా చెడిపోతున్నాయని, రోడ్లను మరమ్మతు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్ల ఇబ్బందులెదురవుతున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. నెల రోజులుగా రోజూ వందల సంఖ్యలో లారీల్లో ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక రవాణా వల్ల తమకు తీవ్ర ఇబ్బందులెదురవుతున్నాయని, దుమ్ము, ధూళితో ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక లారీలను అడ్డుకొని, అక్రమ రవాణాను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నా, అధికారులు పట్టించుకోకపోవడం లేదని అంటున్నారు. ఓవర్‌లోడ్ వాహనాలతో రోడ్లు చెడిపోవడంతోపాటు ప్రాణాలు సైతం గాలిలో కలుస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. లైసెన్సు లేకుండా డ్రైవింగ్ ఇసుక లారీలను నడుపుతున్న వ్యక్తులకు కనీసం డ్రైవింగ్ లైసెన్సు కూడా లేకపోవడం గమనార్హం. ఇటీవల బాన్సువాడ పోలీసులు 7 భారీ లారీలను సీజ్ చేశారు. ఆ లారీలు ఓవర్‌లోడ్‌తో వెళ్లడంతోపాటు నలుగురు డ్రైవర్లకు కనీసం డ్రైవింగ్ లైసెన్సులు కూడా లేదని పోలీసుల విచారణలో తేలింది. భారీ వాహనాలను నడుపుతున్న వీరికి డ్రైవింగ్ లైసెన్సు కూడా లేకపోవడంతో పోలీసులే విస్మయానికి గురయ్యారు. వెంటనే లారీను కామారెడ్డిలోని ఎంవీఐ కార్యాలయానికి తరలించారు. ఇసుక లారీలతో సంభవించిన ప్రమాదాలు గతేడాది వర్ని మండలం అక్బర్‌నగర్‌లో ఇసుక లారీ ఢీకొని జాబేర్(19) అనే యువకుడు మృతి చెందాడు. అలా గే నిజాంసాగర్ మండలం కొమలంచ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇసుక లారీ కింద పడి ఒక వ్యక్తి మతి చెందా డు. బాన్సువాడ పట్టణంలో ఇసుక లారీ ఢీకొని సాయిలు అనే వ్యక్తి మృతి చెందాడు. ఇదే మండలంలోని మొగులాన్పల్లి శివారులో రాంనారాయణ్ అనే బాలుడిని ఇసుక లారీ ఢీ కొనడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఆర్టీఏ, పోలీసు అధికారులు గట్టి చర్యలు తీసుకోకపోవడంతో అమాయకుల ప్రాణా లు గాలిలో కలుస్తున్నాయి. డ్రైవర్లు అతివేగంగా, అజాగ్రత్తగా లారీలను నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. వీరిపై పోలీసుల పర్యవేక్షణ కరువైంది. ఈ వాహనాలతో ప్రధాన రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయి. ఒక్కొక్క భారీ వాహనంలో 30 నుంచి 40 టన్నుల ఇసుకను తరలిస్త్ను్న ఇసుక వ్యాపారులు వాటిని హైదరాబాద్ నగరానికి తరలించి సుమారు రూ.50 నుంచి రూ.60వేలకు అమ్ముకుంటున్నారు. ఒక్కొక్క లారీ ద్వారా సుమారు రూ.20 నుంచి రూ.30వేల ఆదాయం వస్తుండడంతో యథేచ్ఛగా ఇసుక లారీలను ఓవర్‌లోడ్ ద్వారా రవాణా చేస్తున్నారు. -
ఓవరైతే కోర్టుకే..
► వాహనాలపై రవాణా శాఖ కొరడా ► డీటీసీకి ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ ► నాలుగోసారి పట్టుబడితే యాజమానిపై క్రిమినల్ కేసు విజయనగరంఫోర్ట్: అధికలోడు( ఓవర్‌లోడ్)తో వెళ్లే వాహనాలపై కఠిన చర్యలు చేపట్టేందుకు రవాణశాఖ సిద్ధమవుతుంది. ఈమేరకు ఆశాఖ కమిషనర్ డిప్యూటీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇంతవరకు అధికబరువుతో ప్రయాణించే వాహనాలకు అపరాధ రుసం విధించి వదిలేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒకే వాహనం ఆరు నెలల కాలంలో మూడోసారి పట్టుబడితే కేసు నమోదు చేసి కోర్టులో ప్రాసిక్యూషన్‌కు పెడతారు. నాలుగోసారి పట్టుబడితే వాహన యాజమానిపై క్రిమినల్ కేసు పెడతారు. గతంలో కూడా ప్రాసిక్యూషన్‌కు పెట్టి అధికలోడు వాహనాలపై చర్యలు తీసుకునే వారు. కొంతమంది మంత్రులు రవాణశాఖ అధికారులపై ఒత్తిడి తేవడంతో ప్రాసిక్యూషన్‌కు పెట్టాలన్న నిబంధనను ఎత్తివేశారనే ఆరోపణులు వినిపిస్తున్నారుు. తాజగా మళ్లీ ప్రాసిక్యూషన్ పెట్టాలని రవాణశాఖ అధికారులు నిర్ణరుుంచడంతో వాహన యాజమానుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నారుు. అధికబరువు ఆదాయవనరులు... అధిక బరువు( ఓవర్‌లోడ్) వాహనాలే యాజమానులకు, అధికారులకు ఆదాయ వనరు. జిల్లాలో ఒడిశా సరిహద్దు ఉండడంతో అధికబరువు కాసులు వర్షం కురుపిస్తోంది. అధిక బరువుతో వెళ్లే వాహనాలను అధికారులు చూసిచూడనట్టు వదిలేసేవారు. ఇందుకుగాను ప్రతీ నెల కొంతమొత్తాన్ని మామ్మళ్లు అధికారులకు ఇస్తున్నట్టు గుసగుపలు వినిపిస్తున్నారుు.జిల్లాలో గ్రావెల్, ఇసుక, కంకర, ఇనుము తదితర సరుకులు ఇతర ప్రాంతాలకు వెలుతున్నారుు. ప్రాసిక్యూషన్‌పై అనుమానాలు... గతంలో అధికలోడు వాహనాలను కోర్టులో ప్రాసిక్యూషన్‌కు పెట్టేవారు. మళ్లీ ఇప్పుడు ఈనిబంధనను అధికారులు పూర్తి స్థారుులో అమలు చేస్తారో లేక అధికార పార్టీ నేతల ఒతిళ్లకు తలొగ్గి వెనక్కి తీసుకుంటారో వేచిచూడాలి. ఆదేశాలు వచ్చారుు అధికలోడ్‌తో మూడోసారి పట్టుబడిన వాహనాలకు కోర్టులోప్రాసిక్యూషన్కు పెట్టాలనే కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చారుు. ఆదేశాలను అమలు చేయడానికి చర్యలు తీసుకుంటాం.- భువనగురికృష్ణవేణి, ఉపరవాణకమిషనర్ -
ఓవర్ లోడ్
సాక్షి, చిత్తూరు: జిల్లాలో విలువైన గ్రానైట్‌ను వ్యాపారులు కొందరు ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా అక్రమంగా ఎగుమతి చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్‌తో గ్రానైట్ తరలిపోతున్నా రవాణాశాఖ పట్టించుకోవడంలేదు. సుమారు 400 లారీలు గ్రానైట్‌ను రవాణా చేస్తుండగా, అందులో అధిక శాతం లారీలు నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్‌తో తీసుకెళుతున్నాయి. ఆ శాఖలోని కొందరు అధికారులు లక్షల్లో నెల మామూళ్లు పుచ్చుకుంటూ గ్రానైట్ వ్యాపారులకు,ఇటు లారీ యజమానులకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గ్రానైట్ అక్రమ ఎగుమతుల పుణ్యమాని ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడుతోంది. పన్నుల రూపంలో ఏడాదికి సుమారు *220 కోట్లకు పైగా రావాల్సివుండగా *30 నుంచి 40 కోట్లకు మించి రావడంలేదు. చిత్తూరు రవాణాశాఖ తోపాటు గనులశాఖకు చెందిన కొందరు అధికారులు సొంత లాభం చూసుకుంటూ ప్రభుత్వాదాయం సంగతి గాలికి వదిలారు. ఇటీవల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారం రోజులపాటు మొక్కుబడిగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి చేతులు దులుపుకున్నారు తప్పించి క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించడంలేదు. ఒక్క రవాణాశాఖ నెల మామూళ్లు లక్షల రూపాయల్లో ఉన్నాయంటే అక్రమరవాణా ఏ స్థాయిలో జరుగుతోందో తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా 230కి పైగా వర్కింగ్ గ్రానైట్ గనులు ఉన్నాయి. జీ-20, ఇంగ్లిష్ టీక్, మేఫ్లవర్, మదనపల్లె వైట్, పుంగనూరు వైట్,గ్రీన్,పీకార్గ్రీన్,వైట్‌రోజ్,చిత్తూరు ప్యారడైజ్ తదితర గ్రానైట్ రకాలు చెన్నై హార్భర్ ద్వారా ఇతర దేశాలకు నిత్యం ఎగుమతి అవుతుంది. ప్రధానంగా క్వారీల నుంచి తీసిన 270,150,100 అడుగుల పైబడిన సైజుల గ్రానైట్ రాయి మాత్రమే ఎగుమతి చేస్తారు. రోజుకు సరాసరి వెయ్యి క్యూబిక్ మీటర్లకు తగ్గకుండా గ్రానైట్ ఇతర దేశాలకు ఎగుమతి అవుతోంది. ఇక ఇంతకు మించి తక్కువ సైజు గ్రానైట్ రాళ్లు కనీసం 2100 క్యూబిక్ మీటర్ల వరకూ స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీలకు (కటింగ్‌కు) తోలతారు. గనులనుండి రోజుకు సరాసరి 3100 క్యూబిక్ మీటర్లకు తగ్గకుండా రాయి అవసరమవుతుంది.ఈ లెక్కన 330 గనుల పరిధిలో ఒక్కో గని నుంచి రోజుకు 10 క్యూబిక్ మీటర్లకు తగ్గకుండా రాయిని తీయాల్సివుంది. రావాల్సిన రాయల్టీ: గ్రానైట్ కలర్ రాయికి సంబంధించి ఒక్క క్యూబిక్ మీటరుకు ప్రభుత్వానికి రాయల్టీ * 1750 లు,బ్లాక్ రాయికి * 2250 లు చెల్లించాల్సివుంది. సరాసరి క్యూబిక్ మీటరుకు * 2 వేలు వేసుకున్నా 93 వేల క్యూబిక్ మీటర్లకు నెలకు * 18 కోట్ల 60 లక్షలు రాయల్టీ వస్తుంది. ఏడాదికి * 223 కోట్లకుపైగా ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో రావాల్సివుంది. ప్రస్తుతం వస్తున్న ఆదాయం: భూగర్భ గనులశాఖ లెక్కల ప్రకారం చిత్తూరు పరిధిలోని 36 మండలాల్లో 2012-13కు గాను టార్గెట్ *10.42 కోట్లు కాగా * 11.70 కోట్లు,2013-14 కు గాను టార్గెట్ * 12.56 కోట్లు కాగా * 13.04 కోట్లు రాయల్టీ రూపంలో రాబడి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక 2014-15 ఏడాదికి సంబంధించి * 14.6 కోట్లు లక్ష్యంకాగా ఇప్పటివరకూ * 13 కోట్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక గంగవరం భూగర్భ గనులశాఖ పరిధిలోని 30 మండలాల పరిధిలోని గనులు,ఫ్యాక్టరీలకు సంబంధించిన ఆదాయంతో కలిపినా ఏడాదికి సరాసరి * 30 కోట్లకు మించి రాయల్టీ ప్రభుత్వానికి రాలేదు. -
మూడు గ్రానైట్ లారీలు సీజ్
కరీంనగర్: సుల్తానాబాద్ మండలంలోని తొగర్రాయి, కదంబాపూర్ గ్రామాల నుండి శనివారం ఓవర్‌లోడ్‌తో వెళుతున్న మూడు గ్రానైట్ లారీలను సీజ్ చేసినట్లు విజిలెన్స్ సీఐ సుధాకర్‌రావు తెలిపారు. వివరాలు....నిబంధనలకు వ్యతిరేకంగా లారీల్లో గ్రానైట్‌ను రవాణా చేస్తున్నారనే ఫిర్యాదు మేరకు ఈ దాడులు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. లారీలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. (సుల్తానాబాద్) -
చెక్‌పోస్టులకు చెక్
గ్రానైట్ ఓవర్‌లోడ్‌కు రైట్.. గ్రానైట్ లారీల ఓవర్‌లోడ్‌పై ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో సరిగ్గా నెలరోజుల క్రితం ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను అధికారులు రాత్రికి రాత్రే ఎత్తివేశారు. ఈ విషయంలో గ్రానైట్ అసోసియేషన్ నాయకులు తమ పంతం నెగ్గించుకున్నారు. జిల్లా కీలక నేతలతో సంబంధం లేకుండానే చెక్‌పోస్టులను ఎత్తివేయించుకున్నారు. ఇందుకోసం ఇద్దరు ఎమ్మెల్యేల సాయంతో రాష్ట్ర రాజధానిలో చక్రం తిప్పారు. ‘ముఖ్య’నేతను కలిసి డీల్ కుదుర్చుకున్నారు. సదరు ‘ముఖ్య’నేత సానుకూలంగా స్పందించడం, అక్కడినుంచి రవాణా శాఖకు సంకేతాలు వెళ్లడం, ఆ వెంటనే జిల్లా అధికారులు చెక్‌పోస్టులను ఎత్తివేయడం చకచకా జరిగిపోయాయి. చెక్‌పోస్టుల ఎత్తివేతపై అధికారులు మాత్రం పెదవి విప్పడం లేదు. తమకేమీ సంబంధం లేదంటూ జవాబు దాటవేస్తున్నారు. పంతం నెగ్గించుకున్న గ్రానైట్ యాజమాన్యాలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నాయి. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జిల్లాలో 427 గ్రానైట్ క్వారీలున్నాయి. వీటి ద్వారా సగటున ప్రతినెలా దాదాపు రూ.100 కోట్ల వ్యాపారం జరుగుతోంది. గ్రానైట్ లారీల ఓవర్‌లోడ్‌పై అనేక విమర్శలు రావడంతో గతనెల 30న ఎస్పీ శివకుమార్, మైనింగ్ ఏడీ కష్ణప్రతాప్, డీటీసీ మీరాప్రసాద్ హడావుడిగా సమావేశమయ్యారు. గతంలో నాలుగు చెక్పోస్టులుండగా, అదనంగా మరో ఎనిమిది చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. దీంతోపాటు చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేశారు. గ్రానైట్‌తోపాటు ఇసుక, ఇతరత్రా అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వద్ద సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఆయా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన తొలి వారంలో పెద్ద ఎత్తున కేసులు నమోదు చేశారు. లక్షలాది రూపాయల మొత్తంలో జరిమానా విధించారు. అధికారుల లెక్కల ప్రకారం పక్షం రోజుల్లోనే 322 కేసులు నమోదు చేసి రూ.33.86 లక్షల జరిమానా విధించినట్లు తెలుస్తోంది. రోడ్డు మార్గంలో ఓవర్‌లోడ్‌ను తీసుకెళ్లే సదుపాయం లేకపోవడంతో చేసేదేమీలేక గ్రానైట్ యాజమాన్యాలు రైల్వేలను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా రైల్వే ఆదాయం అమాంతం పెరిగిపోయింది. గతంతో పోలిస్తే సరిగ్గా నెలరోజుల్లోనే రూ.10 కోట్ల మేరకు రైల్వే అదాయం పెరిగినట్లు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. అకస్మాత్తుగా చెక్‌పోస్టుల ఎత్తివేత గ్రానైట్ ఓవర్‌లోడ్‌తో పాటు ఇతరత్రా జరుగుతున్న అక్రమ రవాణాను అడ్డుకుంటున్న సమయంలో సరిగ్గా మూడు రోజుల క్రితం రాత్రికి రాత్రే చెక్‌పోస్టులను ఎత్తివేయడం చర్చనీయాంశమైంది. ప్రధానంగా గత నెలలో ఏర్పాటు చేసిన ఎనిమిది చెక్‌పోస్టులను పూర్తిగా ఎత్తివేయగా, మిగిలిన చోట్ల నామమాత్రంగా కొనసాగిస్తున్నారు. చెక్‌పోస్టులను ఎందుకు ఎత్తివేశారనే అంశంపై సమాధానం చెప్పడానికి ఇటు మైనింగ్, అటు రవాణా, పోలీసు అధికారులెవరూ ముందుకు రావడం లేదు. ఓవర్ లోడింగ్ వ్యవహారంతో తమకు సంబంధమే లేదని మైనింగ్ అధికారులు చెబుతుండగా, చెక్‌పోస్టుల నిర్వహణ వ్యయాన్ని మైనింగ్ శాఖ అధికారులే భరించాలని కలెక్టర్ ఆదేశాలున్నందున చెక్‌పోస్టుల ఎత్తివేతపై ఆ శాఖ అధికారులనే అడగాలని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఏ ప్రభుత్వం కూడా అదాయం వస్తున్న మార్గాన్ని వదిలిపెట్టే పరిస్థితి లేనప్పటికీ... అలాంటిది ప్రభుత్వ ఆదాయాన్ని వదులుకుని రాత్రికి రాత్రే చెక్‌పోస్టులను ఎత్తివేయడం పెద్ద చర్చనీయాంశమైంది. దీనివెనుక పెద్ద మతలబే జరిగిందని గ్రానైట్, అధికార, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లా కీలక నేతలు, మంత్రులతో సంబంధం లేకుండానే పెద్ద డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు, గ్రానైట్ అసోసియేషన్ నాయకుడు రాష్ట్ర రాజధానిలో ‘ముఖ్య’నేతను కలవడం, ఆ వెంటనే చెక్‌పోస్టుల ఎత్తివేయడం చకచకా జరిగిందని తెలుస్తోంది. ‘ముఖ్య’నేత స్థాయిలో జరిగిన వ్యవహారం కావడంతో దీనివెనుక ఎంత ‘డీల్’ జరిగిందనే అంశంపై పెదవి విప్పేందుకు ఏ ఒక్కరూ సాహసించకపోవడం గమనార్హం. పట్టపగలే ఇష్టారాజ్యంగా... హైదరాబాద్ నుంచి చెక్‌పోస్టుల ఎత్తవేతపై ఆదేశాలు రావడంతో గ్రానైట్ లారీలకు పట్టపగ్గాల్లేకుండా పోయాయి. నిబంధనల ప్రకారం అయితే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7గంటల మధ్యలోనే నగరం నుంచి గ్రానైట్ రవాణా చేయాల్సి ఉన్నప్పటికీ గత రెండ్రోజులుగా అందుకు భిన్నంగా పట్టపగలు కూడా గ్రానైట్ లారీలు కరీంనగర్ మీదుగా వెళుతున్నాయి. అయితే అధికారులు మాత్రం తమకేమీ సంబంధం లేకుండా మిన్నకుండిపోవడం విశేషం. -
ఓవర్‌లోడ్‌కు చెక్!
కరీంనగర్ క్రైం : జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న ఇసుక, గ్రానైట్ లారీలపై పోలీసులు నిఘా పెంచారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఇసుక, గ్రానైట్ క్వారీలున్న ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది రాతంత్రా ఉండి.. అక్రమ రవాణాకు బ్రేకులు వేసేందుకు సిద్ధమయ్యారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఇసుక, గ్రానైట్ క్వారీలున్న పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎస్సైలు రాత్రి ఎనిమిది గంటల నుంచి ఆదివారం ఉదయం వరకూ అక్కడే మకాం వేసేందుకు వెళ్లినట్లు సమాచారం. వీరితోపాటు ఇతర అధికారులను కూడా దాడులు చేసేందుకు వెళ్లాలని సూచించినట్లు తెల్సింది. 8 చెక్‌పోస్టులు జిల్లా నుంచి ఇసుకతోపాటు గ్రానైట్రాయిని ఇతర ప్రాంతాలకు ఓవర్‌లోడ్‌తో తరలిస్తుంటారు. వీటితోపాటు పొగాకు ఉత్పత్తులు, ఎన్డీపీ మద్యం, బొగ్గు కూడా అక్రమంగా తరలిపోతోంది. వీటిని అడ్డుకునేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ఎనిమిది చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వీటిని శనివారం సాయంత్రమే ప్రారంభించారు. దీనిలో పోలీసులు, రెవెన్యూ, మైనింగ్, ఆర్టీఏ అధికారులు ఉంటారు. వీరు అయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులో 24 గంటల పాటు వాహనాలను తనిఖీ చేస్తారు. అక్రమంగా తరలుతున్న వాటిపై కేసులు నమోదు చేయనున్నారు. తిమ్మపూర్ మండలం అల్గునూర్ వద్ద, సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి వద్ద, ఎల్కతుర్తి మండలం ఎల్కతుర్తి చౌరస్తా వద్ద, కమాన్‌పూర్ మండలం అంబాల క్రాసింగ్ వద్ద, సిరిసిల్ల మండలం జిల్లెల్లలో, ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్ ఎదుట, ఇబ్రహీంపట్నం మండలం గుండి హన్మండ్ల వద్ద, ధర్మపురి మండలం రాయపట్నం బ్రిడ్జి వద్ద నాలుగు శాఖల అధికారులు 24 గంటలూ వాహనాలను తనిఖీ చేయనున్నారు.