మార్కెట్ గేట్లకు తాళాలు, కాపలాగా గార్డులు
కోల్డ్ స్టోరీజీల వద్ద మిర్చి వాహనాలు
వరంగల్‌సిటీ : లారీల సమ్మెతో నిరవధిక బంద్ కొనసాగుతున్నప్పటికీ వ్యవసాయ మార్కెట్‌కు అమ్మకోవడానికి రైతులు పంట సరుకులతో వస్తే మళ్లీ వచ్చిన దారిన పోవాల్సిందే. సోమవా రం బంద్ విషయం తెలిసినా కొందరు రైతులు అనుకోకుండా మార్కెట్‌కు రా గా చైర్మన్, కార్యదర్శి ఏదో విధంగా అడ్తి, వ్యాపారులకు నచ్చచెప్పి అమ్మకా నికి వచ్చిన సరుకులను కొనుగోళ్లు ని ర్వహించిన విషయం తెలిసిందే.
అయితే చైర్మన్, కార్యదర్శి వెంటనే అడ్తి, వ్యా పారులను సమావేశపరిచి, పంట సరుకులతో రైతులు మార్కెట్‌కు వస్తే బాధ్యత మీదేనని వివరించి మైక్‌లో బంద్ గురించి అనౌన్స్ చేయించడంతో పాటు రెండు వైపులా గేట్లను మూసేసి, సె క్యూరిటీ గార్డులను బందోబస్తుగా ఏర్పాటు చేశారు. మంగళవారం గేట్లు పూర్తిగా మూసేసి, ఎలాంటి వాహనాలు మార్కెట్‌లోనికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సోమవారం అమ్మకానికి వచ్చిన దేశి(దొడ్డురకం) రకం మిర్చిని కొనుగోలు చేయడానికి ఖరీదుదారులు రాకపోవడంతో సుమారు వెయ్యి బస్తా ల వరకు పల్లియార్డులోనే మిగిలిపోయి ఉన్నాయి. కనీసం కోల్డ్‌స్టోరేజిల్లో నిల్వ కోసం వెళ్తామన్నా అడ్తి వ్యాపారులు సహకరించడం లేదని వారు రైతులు వాపోయారు.
బారులు తీరిన వాహనాలు
చాలా మంది రైతులు వాహనాల్లో మిర్చిని మార్కెట్‌కు అమ్మకానికి తీసుకొచ్చి బంద్ విషయం తెలుసుకొని కోల్డ్‌స్టోరేజిల వద్దకు తీసుకెళ్లడంతో అక్కడ వాహనాలు బారులు తీరిపోయాయి. కొత్తపేట క్రాస్‌రోడ్డు నుంచి నూతనంగా నిర్మించిన కోల్డ్ స్టోరేజిల వరకు వాహనాలు లైన్‌గా కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం సరైన ధరలేక అటు మార్కెట్ లేక, అమ్ముకోలేక, ఇటు దాచుకోలేక, చేతికొచ్చిన పంటను ఇంటి వద్ద నిల్వ ఉంచుకోలేక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరో నెల రోజులు మిర్చి సీజన్ ముందే ఉండడంతో వరంగల్ మార్కెట్ ఎటువైపు దారితీస్తుందో ఎవరికి అంతపట్టని పరిస్థితి నెలకొంది.
అమ్మకానికి వస్తే... మళ్లీ వెనక్కే
Published Wed, Apr 5 2017 1:42 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement
Advertisement