ఘోరం..
ఆడుకుంటూ.. మృత్యు ఒడికి
రోడ్ రోలర్ కింద పడి విద్యార్థి మృతి
ఎస్సీ కాలనీలో విషాద ఛాయలు
ధర్మవరం రూరల్ : రోలర్ కిందకు రాళ్లు విసురుతూ.. అవి అణిగిపోతుండటాన్ని ఆసక్తిగా తిలకిస్తున్న ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు అదే రోలర్ కింద పడి మృతి చెందిన హదయవిదారక సంఘటన ఓబుళనాయునిపల్లిలో జరిగింది. స్థానికుల కథనం మేరకు... ఎస్సీ కాలనీకి చెందిన చంద్రశేఖర్, భాగ్యమ్మ దంపతులకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో చివరి సంతానమైన మహేష్ (6) స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఎస్సీ కాలనీ నుంచి కొందరు పిల్లలు పాఠశాలకు బయల్దేరారు. రోడ్డు పనుల్లో భాగంగా అక్కడ రోలింగ్ చేస్తున్న రోడ్ రోలర్ కనిపించింది.
రోలర్ కింద కంకరరాళ్లు అణిగిపోతుండటం చూసిన చిన్నారులు రోలర్ కిందకు కొన్ని కంకర రాళ్లు విసురుతూ ఆసక్తిగా తిలకించారు. అలా రోలర్ వెనుకకూ, ముందుకూ కదులుతోంది. డ్రైవర్ వెనుకవైపునకు తిరిగి రోలింగ్ చేస్తుండగా ముందుభాగంలో రాళ్లు విసరడానికి వచ్చిన మహేష్ ప్రమాదవశాత్తు రోలర్‌చక్రం కిందపడి అక్కడికక్కడే మతి చెందాడు. విద్యార్థి మతదేహం పక్కనే పలక, పుస్తకం, ప్లేటు చెల్లాచెదురయ్యాయి. కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. చిన్నారి మతితో ఎస్సీ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రూరల్ సీఐ మురళీ కష్ణ, ఎస్‌ఐ నాగశేఖర్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని, మతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పతికి తరలించారు.