ఆర్‌యూలో విద్యార్థుల మధ్య ఘర్షణ | students fight at ru | Sakshi
Sakshi News home page

ఆర్‌యూలో విద్యార్థుల మధ్య ఘర్షణ

Published Tue, Jan 3 2017 12:02 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

students fight at ru

కర్నూలు : రాయలసీమ యూనివర్సిటీలో నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన బ్యానర్ల ఏర్పాటు విషయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకొని పంచాయతీ పోలీసు స్టేషన్‌కు చేరింది. సీనియర్‌ విద్యార్థుల ఆధ్వర్యంలో హాస్టల్‌ కాంపౌండ్‌లో నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన బ్యానర్‌ 31వ తేదీన ఏర్పాటు చేశారు. ఒకటో తేదీ ఉదయం బ్యానర్‌ చినిగిపోయి ఉంది. ఎంబీఏ విద్యార్థులు బ్యానర్‌ సమీపంలో ఉండటంతో వారే చించివేశారని అనుమానపడి సీనియర్‌ విద్యార్థులు వారితో ఘర్షణ పడ్డారు. ఆదివారం రాత్రి హాస్టల్‌కు  మనోసారి గొడవ పడి  దాడి చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 324, 506 సెక‌్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ భాస్కర్‌రాజు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement