కొత్త ఏడాది.. కొత్త కొత్తగా.. | A New Vision for a New Year | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాది.. కొత్త కొత్తగా..

Published Tue, Dec 31 2013 1:01 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

A New Vision for a New Year

 ఏడాది కాలం.. క్షణాల్లో కరిగిపోయింది. 2013 కనుమరుగై మరికొన్ని గంటల్లో 2014 రాబోతోంది. కొత్త సంవత్సరానికి సరికొత్తగా ప్లాన్ చేసేందుకు విద్యార్థులు, యువత సిద్ధమైపోయారు. గతంలో చేసిన పొరబాట్లను సరిదిద్దుకుని ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునేందు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. మరోవైపు వేడుకలను జరుపుకునేందుకు రెడీ అయిపోయారు.
 -న్యూస్‌లైన్, ఇబ్రహీంపట్నం రూరల్ / షాబాద్/ పరిగి/దోమ
 
  ఇలా ఉండాలనుకుంటున్నాం..
 
 సమాజసేవలో..
 ఇటీవలే ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్నా.   కాలేజీకి వెళ్లి వచ్చాక పూర్తి సమయం సమాజసేవలో భాగస్వామి కావాలనేది నా లక్ష్యం. కొత్త సంవత్సరంలో నా ఎజెండా ఇదే. ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నా. కొంతమంది మిత్రుల సహకారం కూడా తీసుకున్నా.
 - బి.సదన్‌రావు, బీటెక్ ఫస్టియర్
 
 పొదుపు బాట..
 డబ్బును కొన్నిసార్లు అవసరానికి మించి ఖర్చు చేస్తున్నాను. అవసరం లేకున్నా డ్రెస్‌లు, ఇతర మెటీరియల్స్ కొంటున్నా. పొదుపుతోనే జీవితం అదుపులో ఉంటుందనేది తెలుసుకున్నాను. కొత్త సంవత్సరం నుంచి డబ్బును పొదుపు చేసేందుకు ప్రణాళిక వేసుకున్నాను.
 - జి.శరత్‌రెడ్డి, బీటెక్ ఫస్టియర్
 
 టైమ్ మేనేజ్‌మెంట్..
 సమయపాలన లేకపోవడంతో పరీక్షల సమయంలో కాస్త ఇబ్బంది పడుతున్నా. లక్ష్యాన్ని చేరుకోవాలంటే టైమ్ మేనేజ్‌మెంట్ తప్పనిసరి. స్నేహితులతో పిచ్చాపాటి, అనవసర కాలక్షేపాలు మానుకోవాలని నిర్ణయించుకున్నా. కొత్త సంవత్సరంతో నా నిర్ణయాలను అమలుపరుస్తా.
 - ఎస్.భరత్, బీటెక్ ఫస్టియర్
 
 కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటా...
 నాది కాస్త మూడీ మనస్తత్వం. ఎవరితోనూ అంత త్వరగా కలిసిపోను. భవిష్యత్‌లో ఉన్నత చదువులకు వెళ్లాలన్నా, ఉద్యోగం సంపాదించాలన్నా కమ్యూనికేషన్ తప్పనిసరి. ఇకపై కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలనుకుంటున్నా. దీన్ని కొంత సంవత్సరం నుంచి  మొదలుపెడతా.  
 - ఎమ్. ఉదయ్‌కుమార్‌రెడ్డి, బీటెక్ స్టూడెంట్
 
 చదువులో రాణించాలని..
 వాయిదాలు వేయడం, సరైన నిర్ణయం తీసుకోకపోవడం నన్ను దరిచేరకూడదని ప్రణాళిక వేసుకున్నా. గత సంవత్సరం కంటే మెరుగ్గా చదువులో రాణిం చాలని నిర్ణయించుకున్నా. ఇదే నా కొత్త సంవత్సరపు ఎజెండా. న్యూ ఇయర్ వేదికగా దీన్ని ఫాలో అయిపోతా.
 - కె.మహేశ్, బీటెక్ తృతీయ సంవత్సరం
 
 కెరీర్ ప్లాన్..
 ఇంజినీరింగ్‌లోకి వచ్చి నాలుగేళ్లు పూర్తవుతోంది. చ దువు నుంచి బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టాల్సిన సమయం వచ్చింది. ఈ సంవత్సరం నాజీవి తంలో ఎంతో కీలకం. ఉద్యోగం సంపాదించి కెరీర్ ను చక్కదిద్దుకోవాలి. కొత్త ఏడాదిలో అవలంబించాల్సిన విధానాలను ఇప్పటికే సిద్ధం చేసుకున్నా.
 - బి.ఓంకార్, బీటెక్ నాలుగో సంవత్సరం
 
 చదువుపై శ్రద్ధ..
 ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు నన్ను చదివిస్తున్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాగా చదువుతా. ఈ సంవత్సరం నుంచి కాలేజీకి ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టొద్దని నిర్ణయించుకున్నా. చదువుపై శ్రద్ధపెట్టి తల్లిదండ్రులు, గురువులకు పేరు తీసుకొస్తా.         - గోనె సంజయ్‌రాజ్, బీటెక్ సెకండియర్
 
 ఇలా కోరుకుంటున్నాం...
 
 పోలీస్ వ్యవస్థపై నమ్మకం పెరిగేలా..
 పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే కచ్చితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడమే నా లక్ష్యం. పోలీస్ వ్యవస్థపై మరింత నమ్మకం పెరిగేలా నా కర్తవ్యాన్ని నిర్వహిస్తా. కొత్త ఏడాది ఇదే నా ఆశయం. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి. నేరాల అదుపునకు సహకరించాలి.
 - సత్యనారాయణ, ఎస్‌ఐ, షాబాద్
 
 రైతుల కష్టాలు తీరాలి..
 దేశానికి రైతే వెన్నుముక అంటారు, కానీ అన్ని విషయాల్లో రైతుకు అన్యాయం జరుగుతోంది. కొత్త సంవత్సరంలోనైనా అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. ఈ సంవత్సరం పంటలు బాగా పండి రైతులు కష్టాలన్నీ దూరం కావాలి.  
 
 - ఈదుల నర్సింలుగౌడ్, సహకార సంఘం మాజీ అద్యక్షుడు, షాబాద్
 
 వృత్తి ధర్మాన్ని మరవొద్దు..
 కొత్త సంవత్సరంలో ఉద్యోగుల జీవితాలు మరింత ఆనందమయంగా ఉండాలి. సుస్థిర ప్రభుత్వం ఉం డాలి. ప్రభుత్వం సుస్థిరంగా ఉంటే ఉద్యోగులకు సం బంధించి జీవోల్లో ఎలాంటి మార్పులు ఉండవు. గత ఏడాదిలో విజయాలు, అపజయాలను విశ్లేషించుకుని ఉద్యోగులు వృత్తి ధర్మాన్ని ఖచ్చితంగా నిర్వర్తించాలి.
 - బి. యాదయ్య, తహసీల్దార్, షాబాద్
 
 కలలను సాకారం చేసుకోవాలి..
 సమాజంలో పెరుగుతున్న అరాచకాలను రూపుమాపేందుకు విద్యార్థులు నడుం బిగించాలి. పగలు ప్రతీకారాలకు స్వస్తిపలికి స్నేహం,ప్రేమ, శాంతి యుత వాతావరణం నెలకొల్పాలి. కన్న కలలను నిజం చేసుకోవాలి.
 - ఎం.ఆశోక్, బీఈడీ విద్యార్థి, మాచన్‌పల్లి
 
 ఇలా జరుపుకుంటాం...
 
 స్కూల్‌లో కేక్ కట్ చేసి ...
 తోటి స్నేహితులతో కలిసి కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకోవాలని అనుకుంటు న్నా. అంతా కలిసి ఇప్పటికే కేక్ ఆర్డర్ ఇచ్చాం. పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకుంటాం. అనంతరం సమీపంలోని మైలారం వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లాలనుకుంటున్నాం. ఏడాదంతా బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తాం.
 - శిరీష, పదో తరగతి విద్యార్థిని
 
 స్నేహితులతో కలిసి...
 న్యూ ఇయర్ సందర్భంగా ఆ రోజంతా ఉల్లాసంగా గడపాలని స్నేహితులంతా కలిసి ప్లాన్ చేశాం. మద్యానికి దూరంగా ఉంటూ ఆనందంగా వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించాం. 31 రాత్రి నుంచే సంబరాలు ప్రారంభిస్తాం. రాత్రంతా డ్యాన్స్‌లతో హంగామా చేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశాం.
 - ముక్తియార్, దోమ
 
 విద్యార్థులతోనే గడుపుతా...
 విద్యార్థులతో కలిసి కొత్త సంవత్సర వేడుకలు చేసుకోవాలని అనుకుంటున్నా. కళాశాల విద్యార్థులకు సరైన మార్గనిర్దేశకత్వం చేయడానికి ఈ రోజు ఓ చక్కటి అవకాశంగా భావిస్తున్నా. ముఖ్యంగా వచ్చే ఏడాదిలో వారు సాధించాల్సిన లక్ష్యాలు, చేయాల్సి కృషిని వారికి తెలియజేస్తా.
 - ప్రకాష్ రావ్, ప్రభుత్వ జూనియర్
 కళాశాల ప్రిన్సిపాల్, దోమ
 
 దైవ సన్నిధిలో గడుపుతా..
 ఏటా మాదిరిగానే ఈసారీ స్నేహితులతో కలిసి దైవదర్శనానికి వెళ్లాలనుకుంటు న్నా. కొత్త సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉం డాలని దేవుడిని ప్రార్థిస్తా. పార్టీలు, టూర్ల కన్నా ఆలయాలకు వెళ్లి ప్రశాం తంగా గడపడమంటేనే ఇష్టం. స్నేహితులతో కలిసి సమీపంలో ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి అక్కడే గడపాలనుకుంటున్నా.
 - శ్రీనివాస్ రెడ్డి, దోమ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement