
విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకోవాలి
కోదాడ: యువత మారుతున్న కాలానికి అనుగుణంగా తమలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని విశ్రాంత అధా«్యపకుడు డాక్టర్ అందె సత్యం కోరారు. నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో భాగంగా కోదాడలోని ఈవీరెడ్డి డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఐదురోజుల సెమినార్‌లో రెండో రోజు ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాతూ ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలని, ఆర్థిక విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకొనే నైపుణ్యం కలిగి ఉండాలని కోరారు. పారిశ్రామిక విష్లవం వల్ల చేతివృత్తులకు విఘాతం కలిగిందని, దానిని అదిగమించానికి యువత కొత్త నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని కోరారు. పర్యావరణ ఉద్యమకారుడు కొల్లు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు వలంటీర్లు కృషి చెయాలని, పర్యావరణం దెబ్బతింటే బతకు దుర్బరంగా మారుతుందన్నారు. మహిళ నాయకురాలు బంగారు నాగమణి మాట్లాడుతూ లింగ వివక్షతను రూపుమాపాలని, బాలికలు కూడ పురుషులతో పాటు అన్ని రంగాల్లో రాణించే నైపుణ్యాలను కలిగి ఉండాలని కోరారు. కళాశాల ప్రిన్సిపాల్ గింజల రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాయపూడి చిన్ని, జీఎల్‌ఎన్‌రెడ్డి, చిలకా రమేష్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.