విద్యార్థులు నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి
ఏయూక్యాంపస్: విద్యార్థులు తమ నైపుణ్యాలను అందిపుచ్చుకునే దిశగా కషిచేయాలని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఉదయం ఏయూ అంబేద్కర్ అసెంబ్లీ మందిరంలో స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ విభాగంలో కల్పిస్తున్న వసతులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రసాయన శాస్త్రంలో విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవకాశాలు లభిస్తున్నాయన్నారు. విద్యార్థులు తమ ఆలోచన శక్తిని విస్తతం చేసుకోవాలన్నారు. విద్యార్థులు పూర్తి సమయాన్ని తరగతి గదిలో, ప్రయోగశాలలో వెచ్చించాలన్నారు. విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ పూర్తిగా నిశిద్ధమని, ర్యాగింగ్‌కు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.వి రామన్ మాట్లాడుతూ సత్ ప్రవర్తన కలిగి ఉండటం ఎంతో ప్రధానమన్నారు. వర్సిటీ విద్యార్థులందరికీ సమాన అవకాశాలను కల్పిస్తుందన్నారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. స్కూల్‌ఆఫ్ కెమిస్ట్రీ సంచాలకులు ఆచార్య ఆర్.మురళీకష్ణ రావు విద్యలో అంతరార్ధాన్ని తెలుసుకుని మసలు కోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏ.ఉమా బాబ, వి.వెంకటేశ్వరరావు, పి.శ్యామల,టి.శివరావు, సిద్దయ్య, శైలజ, బసవయ్య పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.