ఏటా కళాశాలల్లో ప్రాంగణ ఎంపికలు
తడబడుతున్న విద్యార్థులు
పలు అంశాల్లో రాణించని వైనం
చదువుతుండగానే ఉద్యోగం సాధించడం ఇప్పుడు సర్వసాధారణమైంది. ప్రతి కాలేజీలోనూ క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. అయితే ముంగిటకు వచ్చిన అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. నైపుణ్యం లేకపోవడం, ఆంగ్లభాషపై, సబ్జెక్టుపై పట్టు లేకపోవడం ప్రధానంగా వారిని వేధిస్తున్నాయి.
బాలాజీచెరువు (కాకినాడ):
జిల్లాలో 32 ఇంజనీరింగ్, ఐదు ఫార్మశీ, ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు 90 వరకూ ఉన్నాయి. వీటి నుంచి ప్రతి ఏటా ఇంజనీరింగ్ లేదా డిగ్రీ పూర్తిచేసిన సుమారు పది వేలమంది పట్టభద్రులై వస్తున్నారు.
ప్రముఖ కంపెనీల క్యాంపస్ డ్రైవ్‌లు
జిల్లాలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు ప్రభుత్వ.ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు టీపీఎస్, టెక్‌మహీంద్ర, టాటా, ఎల్‌అండ్‌టీ, హెచ్‌పీ,హెటిరోడ్రగ్స్, ఫార్మశీ సంస్థలు ప్రాంగణ ఎంపికలను నిర్వహిస్తున్నాయి. వీటికి వేలాది మంది అభ్యర్థులు హాజరవుతున్నప్పటికీ కేవలం 40శాతం మంది మాత్రమే అవకాశాన్ని అందిపుచ్చుకోగలుగుతున్నారు. మిగిలిన వారు చిన్నపాటి ఉద్యోగాలకే పరిమితం కావలసి వస్తోంది.∙
ప్రణాళికతో విజయం
ప్రతి విద్యార్థి మొదటి సంవత్సరం నుంచి తప్పని సరిగా ప్రణాళికలు రూపొందించు కొని ఆమేరకు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి. చాలా మంది చివరి సంవత్సరంలో ప్రిపేరవుతుంటారు. అప్పటికే సమయం మించిపోవడంతో అర్హత సాధించలేకపోతున్నారు. పుస్తక ,ప్రపం^è పరిజ్ఞానం పెంపొందించుకోవడంతో పాటు ఆంగ్లంపై పూర్తి స్ధాయిలో పట్టు సాధించాలి. అందరితో కలుపుగోలుతనంగా ఉండటంతో పాటు చర్చావేదికల్లో పాల్గొనాలి. అప్పుడే తమలో ఉన్న భయం, బిడియాన్ని తొలగించుకోగలుగుతారు. చాలా మంది అలా చేయకపోవడం వల్లే ఉద్యోగాన్ని సాధించడంలో విఫలమవుతున్నారు.
కళాశాలల్లో ప్రత్యేక శిక్షకులు
విద్యార్థుల్లో లోపాలను గుర్తించి ప్రాంగణ ఎంపికలకు అవసర మైన శిక్షణను కళాశాలల్లో ఇస్తున్నారు. కమ్యూనికేషన్స్ స్కిల్స్ ముఖాముఖితో విజయం సాధించేందుకు నిపుణుల సదస్సులు ఏర్పాటు చే స్తున్నారు. జేఎన్‌టీయూకే, పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీతో పాటు ప్రైవేట్ కళాశాలల్లో సీఆర్‌టీæ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నారు.
అన్నింశాలపై దృష్టి సారించాలి
ప్రాంగణ ఎంపికల్లో విజయం సాధించాలంటే అన్ని అంశాలపై దృష్టి సారించాలి. ఆంగ్లభాషపై పట్టులేకపోవడం, కమ్యూనికేషన్స్ స్కిల్స్ లేకపోవడంతో చాలామంది వెనుకబడిపోతున్నారు. ప్రతి సబ్జెక్టుపై ప్రాథమిక పరిజ్ఞానంతో పాటు పుస్తక పఠనానికి ప్రాధాన్యం తగ్గించి ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. చాలా మందికి పుస్తక పరిజ్ఞానం తప్ప ఇతర అంశాలపై పట్టు ఉండటం లేదు.
ఎం.వీరభద్రయ్య, ఆచార్యులు, ఎంఎస్‌ఐటీకోర్సు, జేఎన్‌టీయూకే
జిల్లాలో డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల్లో జరిగిన ప్రాంగణ ఎంపికల్లో ఎంపికైనవారు
సంవత్సరం ఎంపికైనవారు
2013–14 750
2014–15 650
2015–16 480