రాష్ట్రస్థాయి యోగా పోటీలకు చౌడువాడ విద్యార్థులు | students select for districtwise yoga competitions | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు చౌడువాడ విద్యార్థులు

Published Tue, Jul 26 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

students select for districtwise yoga competitions

 
కె.కోటపాడు : విశాఖపట్నంలో ఈనెల 24న జరిగిన జిల్లా స్థాయి యోగా పోటీల్లో చౌడువాడ శ్రీ సాయి విద్యావిహార్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. 8 నుంచి 11 ఏళ్ల బాలుర విభాగం పోటీల్లో పాఠశాలకు చెందిన కొత్తూరు శివసాయిరాజ్‌కుమార్, బాలికల విభాగంలో పిల్లా నాగపూర్ణిమాలు 4వ స్థానాల్లో నిలిచారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో విశాఖపట్నంలో జరగనున్న రాష్ట్రస్ధాయి యోగా చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్‌ దాట్ల శివాజీబాబు, ప్రిన్సిపాల్‌ దివి అప్పలకొండ(దత్తు) అభినందించారు. 
చోడవరం నుంచి హరికిరణ్‌ : చోడవరం : యోగా రాష్ట్ర స్థాయి పోటీలకు చోడవరం ఉషోదయ విద్యార్థి హరికిరణ్‌ అర్హత సాధించాడు. ఈ నెల 24న విశాఖపట్నంలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో సీనియర్‌ విభాగంలో రెండో స్థానం కైవసం చేసుకున్నాడు. హరికిరణ్‌ను పాఠశాల యాజమాన్యం అభినందించింది.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement