నేడు ఎస్‌ఐ పోస్టుల భర్తీకి రాతపరీక్ష | sub inspector written exam today | Sakshi
Sakshi News home page

నేడు ఎస్‌ఐ పోస్టుల భర్తీకి రాతపరీక్ష

Published Sat, Nov 26 2016 11:22 PM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM

sub inspector written exam today

అనంతపురం సెంట్రల్‌ : పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీ సంబంధించి ఆదివారం నిర్వహిస్తున్న రాత పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో 20 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దాదాపు 10260 మంది అభ్యర్థులు ఈ పరీక్షలో పాల్గొననున్నారు.  ఒక్కో పరీక్ష కేంద్రానికి డీఎస్పీ స్థాయి అధికారిని బందోబస్తు విధులకు నియమించారు.

పరీక్షల్లో పాల్గొను అభ్యర్థులకు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ కాని పక్షంలో హెల్ప్‌లైన్‌ నంబర్లు 9441450639, 0884–2340535, 0884–2356255 నెంబర్లను సంప్రదించి ఈ మెయిల్‌ ఐడీలు తెలియజేస్తే హాల్‌టికెట్లు పంపనున్నట్లు  జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు శనివారం ఓ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement