జిల్లాకు పెట్టుబడి రాయితీ కింద రూ.3.68 కోట్లు మంజారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పెట్టుబడి రాయితీ కింద జిల్లాకు రూ.3.68 కోట్లు
Published Tue, Jul 19 2016 9:11 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాకు పెట్టుబడి రాయితీ కింద రూ.3.68 కోట్లు మంజారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2015 ఏప్రిల్ 11 నుంచి 17 వరకు జిల్లాలో అకాల వర్షం కారణంగా వరి, సజ్జ తదితర పంటలు దెబ్బతిన్నాయి. 2,481హెక్టార్లలో పంట నష్టం సంభవించగా ఇందులో వరి ఒక్కటే 2423 హెక్టార్లలో దెబ్బతినింది. ఇందువల్ల 4,376 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పట్లోనే వ్యవసాయాధికారులు సర్వే చేసి ఇన్‌పుట్ సబ్సిడీకి ప్రభుత్వానికి నివేదిక పంపారు. అందుకు సంబంధించి ఇప్పుడు నిధులు మంజూరయ్యాయి. కౌతాళం మండలంలో 259 మందికి, ఆస్పరి 19, ఎమ్మిగనూరు 112, గడివేముల 284, పాణ్యం 158, నంద్యాల 110, హŸలగొంద 1103, గొనెగండ్ల 20, వెలుగోడు 783, బండిఆత్మకూరు మండలంలో 1578 మంది రైతులు ఇన్‌పుట్ సబ్సిడీ మంజారైంది. ప్రస్తుతానికి ప్రభుత్వం జీఓ ఇచ్చినా వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఆ తర్వాతే నష్టపోయిన రైతుబ్యాంకు ఖాతాలకు పరిహారం జమ అవుతుంది.
Advertisement
Advertisement