పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సర్వే
ముత్తుకూరు : పామాయిల్ ఫ్యాక్టరీలకు కేంద్రంగా ఉన్న పంటపాళెం పంచాయతీలో మరో ఫ్యాక్టరీ నిర్మాణానికి సర్వే శుక్రవారం మొదలైంది. కోళ్లమిట్ట రైల్వే గేటు వద్ద నిర్మించబోయే దీని పేరు ‘పంచ్’ పామాయిల్ ఫ్యాక్టరీ. ఈ పంచాయతీలో ఇప్పటికే 7 ఫ్యాక్టరీల ద్వారా పామాయిల్ ఉత్పత్తులు జరుగుతున్నాయి. సరయూవాలా చెంతనే జై సంతోషిమాతా పేరుతో 8వ ఫ్యాక్టరీ, త్రిపుల్ ఎఫ్ ఫ్యాక్టరీ సమీపంలో లోహియా పేరుతో 9వ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం 10వ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం 30 ఎకరాల భూముల్ని సర్వే చేస్తున్నారు. ఫ్యాక్టరీలన్నీ ఇప్పటి వరకు రైల్వే లైన్‌కు దక్షిణం వైపు ఉండగా, తాజా ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టారు.