Palm oil Factory
-
రెండో ఫ్యాక్టరీ రెడీ
దమ్మపేట(అశ్వారావుపేట): దశాబ్దకాలంగా ఇక్కడ పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలనే ఈ ప్రాంత రైతాంగం డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. దమ్మపేట మండలం అశ్వారావుపేటలో రూ.72 కోట్ల వ్యయంతో చేపట్టిన పామాయిల్ ఫ్యాక్టరీ ట్రయల్ రన్ విజయవంతమైంది. స్థానిక శాసనసభ్యుడు, ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు శనివారం ట్రయల్‌రన్ నిర్వహించారు. గత ఏడాది ఏప్రిల్‌లో అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ ఫ్యాక్టరీ రోజుకు 20 గంటలు పనిచేస్తుంది. నాలుగు గంటలు మెయింటెటెన్స్ నిమిత్తం నిలిపివేస్తారు. గంటకు 30 టన్నుల పామాయిల్ గెలల క్రషింగ్ సామర్థ్యంతో పనిచేసే ఈ ఫ్యాక్టరీలో రోజుకు 600 టన్నులను క్రషింగ్ చేస్తారు. ఏడాదికి 1.20 లక్షల టన్నులు.. ఫ్యాక్టరీలో ఏటా 1.20 లక్షల టన్నుల పామాయిల్ గెలలను క్రషింగ్ చేయాలని ఆయిల్‌ఫెడ్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణ ఆయిల్‌ఫెడ్ పరిధిలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో 12,196 హెక్టార్లలో పామాయిల్ సాగు విస్తరించి ఉంది. వీటిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 23 వేల ఎకరాల్లో సాగులో ఉండగా, అందులో ఒక్క దమ్మపేట మండలంలోనే 13 వేల ఎకరాలు సాగులో ఉంది. ప్రస్తుత పంట దిగుబడి ఆధారంగా 80 వేల టన్నులు క్రషింగ్ చేయించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట, అశ్వారావుపేట, ములకలపల్లి, పాల్వంచ, చండ్రుగొండ, జూలూరుపాడు, ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, తల్లాడ, ఏన్కూరు మండలాలల్లో పామాయిల్ పంట సాగులో ఉంది. ఈ రెండు జిల్లాలతో పాటు, సూర్యాపేట జిల్లాలో కూడా ఈ ఏడాది 10 వేల హెక్టార్లలో పామాయిల్ సాగు విస్తీర్ణం పెంచాలని ఆయిల్‌ఫెడ్ లక్ష్యంగా పెట్టుకుంది. శుద్ధిచేసిన పామాయిల్ ఇక్కడే తయారీ శుద్దిచేసి కల్తీలేని పామాయిల్‌ను తెలంగాణ బ్రాండ్‌తో ఇక్కడ నుంచే విక్రయాలు జరిపేలా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు అశ్వారావుపేట శాసనసభ్యుడు, రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఫ్యాక్టరీ ట్రయల్ రన్ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇక్కడే ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అశ్వారావుపేటలో ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న పామాయిల్ కర్మాగారంలో వచ్చిన ఆయిల్ శాతమే రెండు రాష్ట్రాల్లోని పామాయిల్ ధరను నిర్ణయిస్తోందని తెలిపారు. తెలంగాణ పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రామచంద్రప్రసాద్ మాట్లాడుతూ పామాయిల్ ధరల్లో తెలంగాణాదే పై చేయి అని అన్నారు. తొలుత తాటి వెంకటేశ్వర్లు ట్రాక్టర్‌ను నడిపి పామాయిల్ గెలలను హైడ్రాలిక్ షెట్టర్ల వద్ద దిగుమతి చేశారు.ఆయిల్‌ఫెడ్ సీనియర్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి, డీఎం ఉదయ్ధీర్రెడ్డి, ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, డీఈ రామారావు, ఎంపీపీ అల్లం వెంకమ్మ, జేడ్పీటీసీ దొడ్డాకుల సరోజనీ రాజేశ్వరరావు, మాజీ సొసైటీ అధ్యక్షుడు పైడి వెంకటేశ్వరరావు, సర్పంచ్ బుద్దా రాజు, ఎంపీటీసీ గంటా వెంకటేశ్వరరావు, రావు గంగాధరరావు, ఏఎంసీ చైర్మన్ తానం లక్ష్మీ, వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు, ఆత్మ కమిటీ చైర్మన్ కేవీ సత్యన్నారాయణ, టీఆర్ఎస్ నాయకులు పానుగంటి సత్యం, పోతినేని శ్రీరామవెంకటరావు, దారా యుగంధర్, తదితరులు పాల్గొన్నారు. -
పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సర్వే
ముత్తుకూరు : పామాయిల్ ఫ్యాక్టరీలకు కేంద్రంగా ఉన్న పంటపాళెం పంచాయతీలో మరో ఫ్యాక్టరీ నిర్మాణానికి సర్వే శుక్రవారం మొదలైంది. కోళ్లమిట్ట రైల్వే గేటు వద్ద నిర్మించబోయే దీని పేరు ‘పంచ్’ పామాయిల్ ఫ్యాక్టరీ. ఈ పంచాయతీలో ఇప్పటికే 7 ఫ్యాక్టరీల ద్వారా పామాయిల్ ఉత్పత్తులు జరుగుతున్నాయి. సరయూవాలా చెంతనే జై సంతోషిమాతా పేరుతో 8వ ఫ్యాక్టరీ, త్రిపుల్ ఎఫ్ ఫ్యాక్టరీ సమీపంలో లోహియా పేరుతో 9వ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం 10వ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం 30 ఎకరాల భూముల్ని సర్వే చేస్తున్నారు. ఫ్యాక్టరీలన్నీ ఇప్పటి వరకు రైల్వే లైన్‌కు దక్షిణం వైపు ఉండగా, తాజా ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టారు. -
పామాయిల్ ఫ్యాక్టరీ ఎదుట రైతుల ఆందోళన
ఖమ్మం (అశ్వారావుపేట) : అశ్వారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీ ఎదుట సోమవారం రైతులు ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ యాజమాన్యం సెప్టెంబర్ 3 వ తేదీ వరకు పామాయిల్ గెలలను ఫ్యాక్టరీకి తీసుకురావద్దని ఆదేశించడంతో రైతులు ఆందోళన నిర్వహించారు. పామాయిల్ గెలలను తీసుకురావద్దని యాజమాన్యం ఆదేశించడం వలన సుమారు 600 ల టన్నుల గెలలు పాడైపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం పరిస్థితిని అర్ధం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. -
క్రూడాయిల్ అక్రమ రవాణాపై విచారణ
అశ్వారావుపేట రూరల్ : అశ్వారావుపేట పట్టణంలోని పామాయిల్ ఫ్యాక్టరీలో క్రూడాయిల్(ముడి పామాయిల్)ను తెట్టు(స్లడ్జ్) పేరుతో తక్కువ ధరకు విక్రయించి రవాణా చేస్తున్న ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. బుధవారం రాత్రి పామాయిల్ అక్రమంగా రవాణా చేస్తుండగా రైతులు అడ్డుకున్న విషయం విదితమే. ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించడంతో హైదరాబాద్ నుంచి సీనియర్ మేనేజర్ రంగారెడ్డి, ప్లాంట్స్ మేనేజర్ ఎండీ బాషా, ఫైనాన్స్ మేనేజర్ తిరుపతిరెడ్డి, డిప్యూటీ ఫైనాన్స్ మేనేజర్ సీతారాములుతో కూడిన బృందం విచారణ నిమిత్తం గురువారం ఫ్యాక్టరీకి వచ్చింది. తొలుత వారు ఫ్యాక్టరీలోని క్రూడ్ ఆయిల్‌ను పరిశీలించారు. ట్యాంక్‌ల ద్వారా ఈటీపీ ప్లాంట్‌ను పరిశీలించారు. అనంతరం ఈటీపీ ప్లాంట్ వెనుక భాగంలోగల స్లడ్జ్ చెరువును కూడా పరిశీలించి దాంట్లో క్రూడ్ ఆయిల్ కొంతమేర కలుస్తున్నట్లు ప్రాథమికంగా తేల్చారు. స్లడ్జ్లో క్రూడ్ ఆయిల్ కలవడం జరుగుతుంటుందని, ప్రస్తుతం 0.1 శాతం కలిసిందని బృందం గుర్తించారు. అధికారుల నిర్లక్ష్యంతోపాటు, సామర్థ్యానికి మించి గెలల క్రషింగ్ వల్ల, పైపులైను ద్వారా లీకై స్లడ్జ్లో క్రూడాయిల్ కలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. విచారణ బృందాన్ని నిలదీసిన రైతులు విచారణ బృందం వస్తుందన్న సమాచారం తెలుసుకున్న పలు రైతు సంఘాలు, రైతులు అక్కడికి చేరుకున్నారు. ఫ్యాక్టరీలో వరుసగా జరుగుతున్న అవినీతి, అక్రమాలపై నిలదీశారు. గెలల క్రషింగ్‌లో జాప్యం జరుగుతోందని, ఆయిల్ రికవరీ కూడా దారుణంగా తగ్గిపోతుందని మాజీ జడ్పీటీసీ జేకేవీ రమణరావు, జడ్పీటీసీ అంకత మల్లికార్జునరావుతో పాటు పలువురు రైతులు విచారణ బృందం దృష్టికి తీసుకెళ్లారు. క్రషింగ్ జాప్యం కావడంతో గెలలు కుళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీకి మంచి రోజులు వస్తాయని వారు సర్థిచెప్పేందుకు యత్నించగా, మంచి రోజులేమీ రావడం లేదని, నిత్యం అవినీతి అక్రమాలే రాజ్యమేలుతున్నాయని, ఫ్యాక్టరీ మూతపడే స్థితికి చేరుకుంటుందని అన్నారు. -
పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి
పెద్దగొల్లగూడెం (దమ్మపేట): గతంలో అధికారులు ప్రతిపాధించిన ప్రదేశంలోనే పామాయిల్ రెండో ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేస్తానని, దీనిపై ఇప్పటికే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావుతో చర్చించినట్టు అశ్వారావుపేట ఎమ్మె ల్యే, వైఎస్ఆర్ సీపీ శాసనసభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు చెప్పారు. అశ్వారావుపేట వ్యవసా య కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం పెద్దగొల్లగూడెంలో ఏర్పాటైన పొలంబడి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా, వ్యవసా య కళాశాల డీన్ డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తాటి మాట్లాడు తూ.. పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి 33లక్ష ల రూపాయలు మంజూరైనట్టు చెప్పారు. ‘‘ఎ న్నికల వరకే రాజకీయాలు. అభివృద్ధిలో వాటికి తావుండదు. నేను కూడా పామాయిల్ రైతునే. అందరినీ కలుపుకుని పనిచేస్తా’’ అని అన్నారు. పామాయిల్ సాగుతో ఆర్థికాభివృద్ధి సాధించవచ్చన్నారు. రైతులు పామాయిల్‌తోపాటు ఇతర పంటలపై కూడా దృష్టి సారించాలన్నారు. పామాయిల్ సాగుకు సంబంధించిన సబ్సిడీ విషయంలో ఏజెన్సీలోని గిరిజనేతర రైతులు అనేక ఇబ్బందులెదుర్కొంటున్నారని అన్నారు. దీనిని ప్రభుత్వం దృ ష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రైతాంగాన్ని విద్యుత్ సమస్య తీ వ్రంగా వేధిస్తోందని, ఇది మరో ఏడాదిపాటు ఉండవచ్చని అన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు కూడా విద్యుత్తుకు ప్రత్యామ్నాయం చూసుకోవాలన్నారు. ఉద్యానవన శాఖ ఏడీ సూర్యనారాయణ మాట్లాడుతూ.. పామాయిల్ రైతులకు గతంలో నాలుగేళ్లపాటు సబ్సిడీ ఉండేదని, దానిని ఇప్పుడు ప్ర భుత్వం మూడేళ్లకే పరిమితం చేసిందని అన్నా రు. పామాయిల్లో అంతర్ పంటలు వేసుకునే రైతులకు హెక్టారుకు మూడువేల రూపాయల ను ప్రభుత్వం రాయితీఇస్తోందన్నారు. ఖమ్మం, నల్గొండ జిల్లాలు మాత్రమే పామాయిల్ పంట సాగుకు అనుకూలమైనవని అన్నారు. ఈ ఏడాది వెయ్యి హెక్టార్లకు పామాయిల్ సాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయించినట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ అల్లంవెంకమ్మ,జడ్పీటీసీ సభ్యురాలు దొడ్డాకుల సరోజని, సర్పంచ్ రాండాస్, ఎంపీటీసీ సభ్యులు జలగం శ్రీనివాస్, గంటా వెంకటేశ్వరరావు,పామాయిల్ రైతుసంఘం రా ష్ట్ర నాయకుడుమహేశ్వరరావు పాల్గొన్నారు. -
ఈపీఎఫ్ కుంభకోణం కనుమరుగుకు యత్నాలు
అశ్వారావుపేట: అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో ఈపీఎఫ్ కుంభకోణం.. అక్కడి మేనేజర్ మెడకు చుట్టుకుంది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఈ మేనేజర్‌పై అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో స్థానిక ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై ఫిర్యాదు చేయడంతో సమస్య మరింత తీవ్రమైంది. ఫ్యాక్టరీ మేనేజర్ ఈ నెల 5న హైదరాబాద్ వెళ్లారు. గతంలో ఇక్కడ పనిచేసి పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ ఉద్యోగోన్నతిపై ఆయిల్‌ఫెడ్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న వారిని కలిసి ‘నన్ను ఏదోరకంగా గట్టున పడేయండి’ అని బతిమిలాడుకుంటున్నట్టు తెలిసింది. ఈపీఎఫ్ కుంభకోణాన్ని ఆయిల్‌ఫెడ్ ఎండీ విష్టు స్వయంగా విచారిస్తున్నారని, అశ్వారావుపేట ఫ్యాక్టరీలోని రికార్డులను డిప్యూటీ మేనేజర్ సన్యాసిరావు ద్వారా తెప్పించుకున్నారని సమాచారం. ఈ విచారణను తప్పుదారి పట్టించేందుకు స్థానిక ఫ్యాక్టరీ మేనేజర్, కాంట్రాక్టర్ కుమారుడు మధు కలిసి ఆయిల్‌ఫెడ్ కార్యాలయంలో పైరవీలు సాగిస్తున్నట్టు తెలిసింది. కార్మికుల వాటాల లెక్కింపు వేగవంతం 2007లో అశ్వారావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఫ్యాక్టరీలోని కార్మికులు ఎన్ని రోజులు పనిచేశారు? ఈపీఎఫ్ వాటాగా ఎంత సొమ్ము మినహాయించారు? కార్మికుని వాటాతోపాటు కాంట్రాక్టర్ వాటా కలిపి ఒక్కో కార్మికునికి నిబంధనల ప్రకారం ఎంత సొమ్ము ఈపీఎఫ్ ఖాతాలో జమ కావాల్సు ఉంది? అనే అంశాలను ఉన్నతాధికారి పరిశీలిస్తున్నారు. 2007 నుంచి ఏడాదివారీగా ఒక్కో కార్మికుని నెలసరి, రోజువారీ వేతనాన్ని పరిగణలోకి తీసుకుని, ఏడాదివారీగాఈపీఎఫ్ సొమ్మును లెక్కకట్టనున్నట్టు తెలిసింది. ఈ లెక్కంతా పూర్తయ్యాక ఈపీఎఫ్ కమిషనర్ అనుమతితో కార్మికుల ఈపీఎఫ్ సొమ్మును నిర్థారిస్తారని తెలిసింది. -
పామాయిల్ ఫ్యాక్టరీలో అవినీతి ఊట..!
అశ్వారావుపేట, న్యూస్‌లైన్: అశ్వారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీలో కుంభకోణాలు ఒకటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక్కడ మంగళవారం ఓ ఆయిల్ ట్యాంకర్‌ను నిబంధనలకు విరుద్ధంగా తరలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీనిపై ‘న్యూస్‌లైన్’ ఆరా తీయగా.. ఆ ట్యాంకర్ యజమాని, ఫ్యాక్టరీ మేనేజర్ నీళ్లు నమిలారు. ఈ ఫ్యాక్టరీ అవినీతి ఊటగా, కుంభకోణాలమయంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వరంగానికి చెందిన ఈ ఫ్యాక్టరీలో జరుగుతున్న అవినీతి అక్రమాలతో పామాయిల్ రైతులు నష్టపోతుండగా.. అధికారులు బాగుపడుతున్నారు. పామాయిల్ గెలల కుంభకోణం.. ముడి చమురు కుంభకోణం.. గింజల కుంభకోణం.. కార్మికుల వేతనాలు, ఈపీఎఫ్ చెల్లింపుల్లో అక్రమాలు... ఇలా చెప్పుకుంటే పెద్ద జాబితానే అవుతుంది. ఇందులోని కొన్నింటి చిట్టా ఇది... 2011లో: ప్రవేటు కంపెనీల ఒత్తిడికి ఫ్యాక్టరీ అధికారులు తలొగ్గి, ఇక్కడ ఆయిల్ రివకరీని తక్కువగా చూపించేందుకు ప్రయత్నిం చారు. ఇందుకోసం, సుమారు 20వేల టన్నుల పామాయిల్ గెలలను కుళ్లబెట్టారు. ఫలితంగా, పరిశ్రమకు ప్రత్యక్షంగా 10కోట్ల రూపాయల నష్టం వచ్చింది. పరోక్షంగా రైతులకు ఇంతకంటే ఎక్కువ నష్టమే జరిగిం ది. దీనిపై ఎలాంటి విచారణ జరగనేలేదు. 2011 డిసెంబర్లో: రెండు లారీల (34 టన్నుల) ముడి చమురు చోరీ జరిగినట్టుగా అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇప్పటివరకు ఈ కేసు అతీగతీ లేదు. ఆయిల్‌ఫెడ్ ఉన్నతాధికారులు కూడా ఎలాంటి విచారణ చేపట్టలేదు. 2011 డిసెంబర్లో: 98 టన్నుల ముడి చమురు అధికంగా వచ్చినట్టుగా అధికారులు రికార్డుల్లో చూపించారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో మాత్రం చూపలేకపోయారు. 2012లో: బ్రేక్ డౌన్ పేరుతో ఈ ఫ్యాక్టరీని అధికారులు పలుమార్లు మూసేసి, పామాయిల్ గెలలను ఇతర పరిశ్రమలకు తరలించారు. ఇలా ఈ ఒక్క సంవత్సరంలోనే ఫ్యాక్టరీకి రెండుకోట్ల రూపాయల వరకు నష్టపోయింది. ఓ కాంట్రాక్టర్‌కు లాభం చేకూర్చేందుకు అధికారులు కావాలనే ఇలా చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. 2013లో: నూనె రికవరీ ఒక శాతం తగ్గింది. దీని ఫలితంగా సంస్థకు ప్రత్యక్షంగా ఏడాదికి రూ.2కోట్లు నష్టం. కేవలం అశ్వారావుపేట ఫ్యాక్టరీలోనే 2-3శాతం రివకరీ పడిపోయింది. ఇదే విషయాన్ని ఆయిల్‌ఫెడ్ ఉన్నతోద్యోగుల బందం దవీకరించింది. అయి నా అధికార యంత్రాంగం మేల్కొనలేదు. 2013లో: పరిశ్రమలో సుమారు 250 టన్నుల నూనె గింజలు మాయమైనట్టుగా ఇక్కడి అధికారులు గుర్తించి, ఉన్నతాధికారులకు నివేదించారు. ఈ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసి, ఆ తరువాత ఎత్తివేశారు. ఫ్యాక్టరీ సామర్థ్యం పెంచినప్పటికీ విద్యుత్ సరఫరాపై దృష్టి పెట్టకపోవడంతో డీజిల్ వినియోగం పెరిగింది. ఈ కారణంగా సంస్థపై సుమారు 50లక్షల రూపాయల భారం పడింది. కేవలం కమీషన్ల కోసమే విద్యుత్ సరఫరాను తగ్గించి, డీజిల్ వినియోగం పెరిగేలా ఇక్కడి అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించలేదు. 1.5కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈటీపీ ప్లాంటును ఏడాదిన్నర తరువాత వినియోగంలోకి తెచ్చారు. ఆ తర్వాత కూడా ఇది కొంతకాలం మాత్రమే పనిచేసింది. ఫలితంగా, దీని కోసం వెచ్చించిన 1.5కోట్ల రూపాయలు దాదాపు వృధా అయినట్టే. దీనికి బాధ్యులైన వారిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. గడిచిన నాలుగేళ్లలో ఈ ఫ్యాక్టరీలో సుమారు 20కోట్ల రూపాయల అవినీతి, అక్రమాలు జరిగి ఉంటాయని అంచనా. ప్రైవేటు కంపెనీల కనుసన్నల్లో అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ అధికారులు పనిచేస్తున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నారని, అందినంత దండుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై ఉన్నతాధికారులు స్పందించకపోవడంపై ఇక్కడి పామాయిల్ రైతుల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. -
భార్యాబిడ్డలతో పామాయిల్ ఫ్యాక్టరీ యజమాని ఆత్మహత్య
కోటగుమ్మం (రాజమండ్రి), న్యూస్‌లైన్ : ఓ పారిశ్రామిక వేత్త తన భార్యాబిడ్డలతో ఆత్మహత్య చేసుకు న్న సంఘటన జిల్లాలో సంచలనం కలిగించింది. అంబాజీపేటకు చెంది న పామాయిల్ ఫ్యాక్టరీ యజమాని పాబోలు వెంకట కిరణ్(28), అతడి భార్య లక్ష్మీశ్వేత(25)లు వారి కుమా ర్తె శర్వాణి(4), కుమారుడు జయదేవ్(1)లను హతమార్చి, వారూ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తన మావయ్య (భార్య తండ్రి) వివాహ వార్షికోత్సవం సందర్భంగా కిరణ్ భార్యాబిడ్డలతో రాజ మండ్రి వచ్చాడు. కార్యక్రమం ముగి శాక ఇంటికని బయలుదేరి జాంపేట లోని ఓ హోటల్లో ఆదివారం రాత్రి బస చేశారు. కిరణ్ తండ్రి రామసుబ్రహ్మణ్యం (రాంబాబు) రాత్రి 9 గంటలకు ఫోన్ చేయగా, తాను ఎక్కడున్న విషయం చెప్పకుండా, తలనొప్పిగా ఉందని.. మాత్రలు వేసుకుని పడుకుంటున్నట్టు కిరణ్ తెలిపాడని సమాచారం. కీడు శంకిం చిన రాంబాబు తన బంధువులు, మిత్రులకు విషయం తెలిపారు. వారు కిరణ్ కుటుంబం కోసం మిత్రుల ఇళ్ల వద్ద, రాజమండ్రిలోని హోటళ్లలో గాలింపు చేపట్టారు. ఇలాఉండగా కిరణ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకోగా, శ్వేత చేతి మణికట్టుపై బ్లేడుతో గాయం చేసుకోవడం వల్ల మరణించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాత్రూంలో షింక్ వద్ద రక్తం మరకలు ఉండడంతో, గాయం చేసుకున్న చేతిని శ్వేత అక్కడ కడుక్కొని ఉండవచ్చని భావిస్తున్నారు. చిన్నారులు శర్వాణి, జయదేవ్‌లకు పాలలో విషం కలిపి పట్టించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కిరణ్ కారు జాంపేటలోని హోటల్ ప్రాంగణంలో ఉన్నట్టు సోమవారం ఉద యం బంధువులు గుర్తించారు. హోటల్ సిబ్బందిని విచారించగా, రూం నంబరు 107 కిరణ్ పేరిట నమోదైనట్టు తెలిసింది. గది తలుపులు తెరిచిచూడగా.. అప్పటికే కిర ణ్, అతడి భార్యాబిడ్డలు విగతజీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫ్యాన్‌కు చీర తో ఉరి వేసుకుని కిరణ్ మృతదేహం వేలాడుతోంది. మంచం పక్కన నేల పై లక్ష్మీశ్వేత మృతదేహం, మం చం పై చిన్నారులు శర్వాణి, జయదేవ్‌ల మృతదేహాలు పడి ఉన్నాయి. సంఘటన స్థలాన్ని రాజమండ్రి సెం ట్రల్ జోన్ డీఎస్పీ నామగిరి బాబ్జీ, వన్‌టౌన్ సీఐ రమణరావు పరి శీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి 9 గంటలకు చివరి ఫోన్‌కాల్ ఓ మంత్రి కారుకు ప్రమాదం జరిగిందని, ఆ మంత్రి పీఏకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోమని రాత్రి 9 గంటలకు కిరణ్‌కు ఫోన్లో చెప్పినట్టు అతడి తండ్రి రాంబాబు చెప్పా రు. తనకు తలనొప్పిగా ఉందని, రేపు ఫోన్ చేస్తానని కిరణ్ ఫోన్ పెట్టేసినట్టు ఆయన పోలీసులకు తెలిపా రు. కిరణ్ సెల్‌ఫోన్ నుంచి అదే చివరి ఫోన్‌కాల్ అని రాంబాబు చె ప్పారు. కిరణ్ తన భార్యాబిడ్డలతో అతడి మావయ్య ఇంట్లో ఉన్నట్టు భావించానని, హోటల్లో దిగినట్టు తెలియదని రాంబాబు ఆవేదన వ్య క్తం చేశారు. కిరణ్ భార్య శ్వేత కు టుంబీకులు రాజమండ్రిలోని దేవీ చౌక్‌లో మురళీ ఎలక్ట్రానిక్స్ అండ్ టైల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ముందురోజు తమతో శుభకార్యం లో పాల్గొన్నవారు అంతలోనే విగతజీవులుగా మారడంతో శ్వేత బంధువులు విషాదంలో మునిగిపోయా రు. చిన్నారులకు నూరేళ్లు నిండిపోయాయని విలపించారు.